Naga Panchami 2nd February: మేఘన చెంప చెళ్లుమనిపించిన పంచమి.. మరోసారి మోసం చేసేందుకు పెద్ద ప్లాన్!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా మలుస్తున్నారు షోను నిర్వాహకులు. అయితే తాజాగా మోక్ష, మేఘనలకు పెళ్లి చేయాలని మోక్ష తల్లి వైదేహి ప్లాన్ చేసింది. పంచమి వచ్చి ఆపుతుందని.. ముఖ్యంగా మేఘన నాగ కన్య కాబట్టి కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని మోక్ష కూడా చెప్పాడు. అయితే ఈ రోజుటి ఎపిసోడ్ లో ముందుగా.. మోక్ష, మేఘనలకు పెళ్లి చేసేందుకు ముహూర్తం పెట్టమని ఓ పంతులును కూడా పిలిపించారు. ఈక్రమంలోనే అంతా చాలా కోపంగా చూస్తుండగా.. వైదేహి మాత్రం పంతులుతో మాట్లాడుతూ కనిపించింది.
నిశ్చితార్థం ఎప్పుడు చేస్తే బాగుంటుందని.. పెళ్లి ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుందని అడుగుతుంది. అప్పుడే పంతులు రేపు కాకుండా మరుసటి రోజు.. మూడో రోజు పెట్టుకుంటే దివ్యంగా ఉంటుందని అంటారు. అప్పుడే శబరి.. మోక్ష తండ్రి ఉంటే బాగుండని, ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాడు కూడా ఉండాలని అంటుంది. మనం ఇప్పుడు పెట్టుకునేది నిశ్చితార్థానికి ముహూర్తం మాత్రం పర్లేదు అంటూ అంటుంది. ఇలా ఆయన ముహూర్తం పెట్టి ఆయన వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొడుకులు ఇద్దరూ తమకు పెల్లి ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోతారు.

ఆ తర్వాత పంచమి, ఫణీంద్రలను పట్నం రావడం చూపిస్తారు. ముఖ్యంగా పంచమి తల్లి వచ్చి నువ్వు ఆ దుష్ట శక్తి కరాళీని అడ్డుకోవాలనుకుంటున్నావు... అది నీ వల్ల అవుతుందా తల్లి జాగ్రత్త అంటూ చెప్పుకొస్తుంది. అవుతుందమ్మా.. నేను ఎలాగైనా మోక్ష బాబును కాపాడాలంటూ వచ్చేస్తుంది. ఆ తర్వాత మేఘన.. తన అన్నయ్య నంబూద్రీని ఆవాహనం చేసుకుంటుంది. అలా ఆయన రాగానే తాను ఓ ఘట్టం పూర్తి చేశానని అంటుంది. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వివరిస్తుంది. నీకు మహాకాళి పెద్ద పనే అప్పజెప్పింది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వివరిస్తాడు. ఆ తర్వాత మాయమైపోతాడు.
దీని తర్వాత చిత్ర, జ్వాలలు ఇద్దరూ తమ భర్తలను తిడుతూ రచ్చగొడతారు. మోక్ష రెండో పెళ్లి ఆపాలంటూ ఫైర్ అవుతారు. దీంతో వారిద్దరూ వెళ్లి మోక్షను పపిలిచి ఈ రెండో పెళ్లి వద్దంటూ గొడవ పెడతారు. వైదేహి చెబుతున్నా వినకుండా.. మేఘనపై కోప్పడతారు. ఈక్రమంలోనే నంబూద్రీ జ్వాల శరీరంలోకి వచ్చి.. మేఘనతో మోక్ష పెళ్లి జరిగి తీరుతుందని చెబుతుంది. వీళ్లంతా ఇలాగే అంటారని.. మేఘన నువ్వేం భయపడకు అంటూ జ్వాల శరీరంలో ఉన్న నంబూద్రీ ఆత్మ వివరిస్తుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అయింది.

ఇక రేపటి ఎపిసోడ్ లో మేఘన.. పంచమి, ఫణీంద్రలను ఏడుస్తూ మోసం చేయాలనుకుంటుంది. మా అమ్మా, నాన్నలను చంపేస్తామని బెదిరించి మరీ కరాళీయే నాతో ఇలా నాటకం ఆడించిందని అంటుంది. కానీ ఫణీంద్ర మాత్రం అస్సలే నమ్మడు. మేఘనే కావాలని మనతో ఇలా గేమ్స్ ఆడుతుందని వివరిస్తుంది. అదంతా నమ్మిన పంచమి.. మేఘనను ఓ రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్తారు. అక్కడకు వెళ్లగానే పంచమి ఆమెపై చేయి చేసుకుంటుంది. నువ్వు ఎవరో నాకు చెప్పు అంటూ గొడవ పడుతుంది. ఇక పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











