Naga Panchami: కరాళీకి పంచమి హెచ్చరిక, మోక్షను కూడా కాటేసి చంపుతానంటూ..?
Naga Panchami November 8th Episode: నాగ పంచమి పంచమి సీరియల్ అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తోంది. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండడంతో బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఈ సీరియల్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రోజూ ఏం జరగబోతుందా అనే ఆసక్తితో తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. పంచమి పాము అని, ఇష్టరూప ధారిని నాగకన్య అని తెలుసుకున్న మోక్ష ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నాడు. పంచమి నిజంగానే తనను కాపాడాలనుకుంటుందా లేక చంపాలనుకుంటుందా అని ఆలోచిస్తూ తల బద్ధలు కొట్టుకుంటున్నాడు. ఇదంతా రేపటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.
ఈరోజు ఎపిసోడ్ లో అయితే ముందుగా సుబ్బు, పంచమిలను చూపిస్తారు. ఓవైపు పంచమి కన్నీరు పెట్టుకుంటూనే సుబ్బును వెళ్లిపోమని చెబుతుంది. నిజంగానే గుండెల్లోంచి ఈ మాట అంటున్నావా పంచమి అని సుబ్బు అడగ్గా.. అవును వెళ్లిపో అని వివరిస్తుంది. మరి నీవు ఎందుకు ఏడుస్తున్నావని.. నీ మాటలు వెళ్లమని చెబుతున్నా కళ్లు మాత్రం వెళ్లొద్దని అంటున్నాయని సుబ్బు అనగా.. నీవు ఇక్కడే ఉండి నలుగురితో నాలుగు మాటలు పడడం నాకు ఇష్టం లేదు సుబ్బు వెళ్లిపో అంటుంది. నా భర్త మాట నేను వినాలి, ఆయనే నాకు ముఖ్యం కాబట్టి నీవు వెళ్లిపో అని చెబుతుంది. అందుకు సుబ్బు ఇంత సాయం చేసిన నాకంటే కూడా నీ భర్తే ముఖ్యమా అని అడుగుతాడు.

అందుకు పంచమి మరింతగా ఏడుస్తూ.. అలా అంటావేంటి సుబ్బు నీవు చేసిన సాయాన్ని జన్మజన్మల వరకు గుర్తుంచుకుంటాను అని చెబుతుంది. ఏదో సరదాగా అన్నానులే పంచమి నిజంగా వెళ్లిపోమంటే నేను వెళ్లిపోతానని సుబ్బు అంటాడు. అలాగే మళ్లీ నీవే నన్ను పిలిచినా తిరిగి రానని అంటాడు. నీమీద నాకూ ఇష్టం ఏర్పడింది పంచమి.. ఇక్కడే ఉండి అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా ఉంటానని సుబ్బు చెప్పినా వినకుండా బలవంతంగా వెళ్లిపోమంటుంది. సుబ్బు వెళ్తుండగా.. శిశిర, మోక్షలు అక్కడకు వస్తారు. బాబాయ్ సుబ్బును వెళ్లొద్దని చెప్పు అనగానే మోక్ష.. సుబ్బు ఇక్కడే ఉండు అని చెబుతాడు.
ఇందుకు పంచమి వద్దు సుబ్బు వెళ్లిపో అంటుంది. ఏంటి పిన్ని బాబాయి ఉండమంటే నువ్వు సుబ్బును వెళ్లిపోమంటున్నావు, ఉండు సుబ్బు అని శిశిర అనగా.. తనను తీసుకువచ్చిందని పంచమి కాబట్టి ఆమె ఉండమంటేనే ఉంటానని సుబ్బు చెబుతాడు. కానీ పంచమి వెళ్లిపోమని చెప్పేసరికి ఇష్టంలేకపోయినా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత పంచమి కూడా బట్టలు సర్దుకుంటూ కనిపిస్తుంది. అంతలోనే మోక్ష వచ్చి ఇదేంటని ప్రశ్నించగా.. నేను మీ మాట ధిక్కరించేలను, మీకు నచ్చని పని చేయలేను.. నేనేం ఇప్పుడే మా ఇంటికి వెళ్లిపోవట్లేదు కానీ ఇక్కడున్నంత కాలం ఔట్ హౌస్ లోనే ఉంటానని అంటుంది.

ఇదంతా విన్న మోక్ష.. నాకు ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి, ఇప్పుడే ఎలాంటి దృఢ నిర్ణయం తీసుకోలేనని అంటాడు. అలాగే ఆ పాము లక్ష్యం నన్ను చంపడమ యితే తాను చేయగల్గింది ఏమీ లేదని .. తన చావు వల్ల కనీసం ఆ పాముకు అయినా ప్రయోజనం కల్గుతుందంటే తనకు కూడా పర్వాలేదని చెబుతాడు. ఆ మాటలు విన్న పంచమి వెంటనే అలాంటి రోజు రాకూడదనే తన తపని అని, తన సాయశక్తులా మోక్షను కాపాడుకునే ప్రయత్నం చేస్తానని అంటుంది. ఇక ఆ తర్వాత పంచమి కరాళీని కలిసేందుకు వెళ్తుంది.
నంబూద్రీని కలవాలని పంచమి అనగా.. చంపేసి ఇప్పుడు కలవాలంటున్నావా.. ఎందుకు ఇంత అమాయకంగా ప్రవర్తిస్తున్నావు అని కరాళీ పంచిమని నిలదీస్తుంది. అలా నంబూద్రీని తీనే పాముగా మారి చంపినట్లు తెలుసుకున్న పంచమి... టెన్షన్ పడుతుంది. కరాళీ.. నా అన్నను చంపిన నువ్వు, మోక్షను ఎందుకు చంపలేదు.. ఇద్దరికీ సమాన శిక్ష పడాల్సిందే.. కాబట్టి నువ్వే నా అన్నను రక్షించు అంటూ చెబుతుంది. అందుకు పంచమి... నేను పాముగా మారే నంబూద్రీని చంపి ఉంటే మోక్ష బాబు చావు కూడా నా చేతిల్లోనే ఉంటుందని చెబుతుంది.

అలాగే దుష్టుడు అయిన నంబూద్రీని తాను బతికించలేనని.. నువ్వు కూడా నాగమణిని సంపాధించేందుకు ప్రయత్నాలు ఆపడం మంచిదని చూస్తుంది. నీ చేతులతోనే ఆ నాగమణిని తీసుకొచ్చి నాకు ఇచ్చేలా చేస్తానని కరాళీ అనగా.. నా ప్రాణాలు అర్పించిన అయినా సరే దాన్ని కాపాడతానని.. కానీ నీలాంటి దుష్టుల చేతికి నాగమణిని చిక్కనివ్వనని హెచ్చరిస్తుంది. నీ అన్నకు పట్టిన గతే నీక్కూడా పడుతుంది... నాగమణిపై ఆశ చంపుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











