Naga Panchami : పాములా మారి మోక్షను చుట్టేసిన పంచమి.. ఇక కాటేయడమే ఆలస్యం!

నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో సీరియల్ ను రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదిశి రావడం.. అందులో భాగంగానే భర్తను కాపాడుకునేందుకు పంచమి చేసిన ప్రయత్నాలు మరింత అలరించబోతున్నాయి. సినిమాటిక్ రేంజ్ లో సాగుతున్న ఈ సీరియల్ ను చూసేందుకు అందుకే అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజే ముక్కోటి ఏకాదశి కావడంతో.. అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. పంచమికి సాయం చేస్తానని చెప్పిన ఫణీంద్ర మాత్రం మాట తప్పేందుకు సిద్ధం అయ్యాడు.

మరోవైపు నాగమణిని ఎలాగైనా దక్కించుకోవాలని మేఘన ఉవ్విళ్లూరుతుండగా.. పాముగా మారి భర్తను కాటేసిన తర్వాత నాగమణి తీసుకు వచ్చి భర్తను కాపాడుకోవాలని చూస్తోంది పంచమి. మోక్షను కాటేసిన వెంటనే నాగలోకం తీసుకు వెళ్లడం.. ఆ తర్వాత పట్టాభిషేకం చేయడం, పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోవాలని ఫణీంద్ర ఎత్తులు వేస్తున్నాడు. అయితే తాజా ఎపిసోడ్ లో మోక్ష, పంచమి, ఫణీంద్రలు ఓ చోట నిలబడతారు. వెంటనే పంచమి పాములా మారిపోతుంది. అది చూసిన మోక్ష విపరీతంగా భయపడిపోతాడు. కానీ తన భార్యే కావడంతో చేయి చాస్తాడు.

Panchami Tuned into Snake And Ready Bite Moksha on Naga Panchami January 6th Episode

మోక్ష చేయి చాచగానే.. పాముగా మారిన పంచమి అతడి చేయిని చుట్టేస్తుంది. మోక్ష మాత్రం చాలా భయం భయంగానే ఆమెను దగ్గరకూ తీసుకుంటూ కనిపిస్తాడు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది. పాముగా మారిన పంచమి మోక్షను కాటేసిన వెంటనే నాగలోకం వెళ్లిపోతుంది. ఇక ఆతర్వాత ఏం జరుగుతుందో తెలయాలంటే మాత్రం సోమవారం రోజు వచ్చే ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. మోక్ష, పంచమిలు ఇంట్లోకి వస్తారు. అది చూసిన వైదేహి వద్దని పంచమి పాము అంటూ అరుస్తుంది. కానీ మోక్ష మాత్రం వారందరితో ఫైట్ చేసి మరీ పంచమిని ఇంట్లోకి తీసుకు వస్తాడు.

ఆ తర్వాత చిత్ర, జ్వాలలు వైదేహిని ఎద్దేవా చేస్తారు. అదంతా వింటూనే ఉన్న వైదేహి మాత్రం కోపంతో ఊగిపోతూనే ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మోక్ష, పంచమిలు గదిలోకి వెళ్తారు. మోక్షను ప్రాణాలతో కాపాడుకుంటే చాలని పంచమి మరోసారి చెబుతుంది. ఇలా భయం భయంగా బతకడం కంటే కూడా ఓసారి చావుకు తెగించడమే బెటర్ అంటూ మోక్ష చెబుతాడు. ముఖ్యంగా పంచమి చెప్పిన ప్లాన్ కు ఓకే చెబుతారు. ఆ తర్వాత ఫణీంద్ర, మేఘనలను కలిసేందుకు వెళ్తారు. అంతా ఓ చోట చేరి తమ ప్లాన్ గురించి చర్చించుకుంటూ ఉంటారు.

పంచమి మీ గురించి అంతా చెప్పింది.. చెప్పిందంతా చెప్పినట్లుగానే జరుగుతుంది కదా అనగా.. ఫణీంద్ర మాత్రం పంచమి నాగలోకం వచ్చేందుకు ఒప్పుకుందని మురిసిపోతాడు. అలాగే పాము మారి మోక్షను కాటేసిన తర్వాత పంచమిని నాగ లోకం తీసుకెళ్లిపోవచ్చని ఆ తర్వాత మోక్షను కాపాడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని అనుకుంటాడు. ఫణీంద్ర సైలెంట్ గా ఉండడంతో పంచమి ఎలాంటి సమస్యా రాదు కదా అని అడుగుతుంది. ఏ సమస్యా ఉండదు.. కానీ నేను నాగ దేవత వద్దకు వెళ్లి నీకు శక్తులు ఇవ్వమని అడిగి ఒప్పించాలి.. ఈ రాత్రికే నేను వచ్చేస్తానంటూ వెళ్లిపోతాడు.

Panchami Tuned into Snake And Ready Bite Moksha on Naga Panchami January 6th Episode

ఆ తర్వాత పంచమి, మోక్షలు మాట్లాడుకుంటూ సమయం గడుపుతారు. మరోవైపు ఫణీంద్ర నాగలోకం వెళ్లి నాగదేవతతో మాట్లాడుతాడు. పంచమి నాగలోకం వచ్చేందుకు ఒప్పుకుందని ఆమెకు శక్తులు ఇవ్వాలని కోరుతాడు. తన ఇష్టంతోనే వస్తుంది కదా ఎలాంటి సమస్యలు వచ్చినా నీవే బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటుంది. అందుకు ఫణీంద్ర ఓకే చెబుతాడు. అలా నాగదేవత పంచమికి శక్తులు ప్రసాదిస్తుంది. పంచమికి శక్తులు వచ్చిన వెంటనే ఆమె కాస్త పాములా మారుతూ మైకంలోకి వెళ్తుంది. అది చూసిన మోక్ష తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X