Naga Panchami January 11th: భర్తను కాటేసిన పంచమి.. నొప్పితో విలవిల్లాడుతున్న మోక్ష.. ప్రాణం నిలిచేనా?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో అద్భుతంగా సాగుతున్న ఈ సీరియల్ లో ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది. ముందుగా ఫణీంద్ర, మేఘన, పంచమిలు వేసుకున్నట్లుగా ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకోసం వీరంతా కలిసి నాగులవరం వచ్చారు. ముఖ్యంగా మేఘన రూపంలో ఉన్న కరాళీతోపాటు ఫణీంద్ర, నాగ సాధువు, మేఘన, పంచమిలు ఒక్కచోట ఉన్నారు. ఈక్రమంలోనే పంచమి పాముగా మారింది. ఆ తర్వాత మోక్షను కాటేసింది.

ముందుగానే పడుకుని ఉన్న మోక్ష కుడి పాదంపై పంచమి కాటేసింది. ఒక్కసారిగా పాము కాటేయడంతో మోక్ష నొప్పితో విలవిల్లడాతున్నాడు. అతను అంతగా మొత్తుకుంటున్నా అక్కడే ఉన్న నలుగురు మాత్రం చూస్తూనే ఉండిపోయారు. ముఖ్యంగా మేఘన, నాగ సాధువు దగ్గరే మోక్షను వదిలి ఫణీంద్ర, పంచమిలు నాగలోకం వెళ్లనున్నారు. మరి అక్కడకు వెళ్లాక అయినా వీరు నాగమణిని తీసుకు వస్తారా లేక అక్కడే ఉండిపోతారా.. ముఖ్యంగా మోక్ష ప్రాణాలను కాపాడగల్గుతారా లేదా అన్నది తెలియాలంటే మాత్రం రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Panchami Turn into Sanke And Bite panchami on Naga Panchami January 11th Episode

మరోవైపు నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా నాగ దేవతను చూపించారు. నాగదేవతకు ఫణీంద్రపై అనుమానం వచ్చింది. ఈక్రమంలోనే ముగ్గురు నాగ కన్యలను పిలిచిన ఆమె.. ఫణీంద్రపై తనకు అనుమానంగా ఉందని.. మీరు భూలోకం వెళ్లి వారు చేస్తున్న పనులను గుర్తించి, వారు ఏం చేయబోతున్నారో తనకు చెప్పాలని అంటుంది. వారు దానికి అంగీకరించి కిందకు వెళ్తారు. ఇఖ ఆ తర్వాత మోక్ష, పంచమిలతో పాటు కారులో వెళ్తున్న ఫణీంద్ర ఆ విషయం పసిగడతాడు. వెంటనే పాముగా మారి బుసలు కొడతాడు. దీంతో మోక్ష కారును ఆపగా.. వారు కిందకు దిగుతారు. అలా కిందకు రాగానే మనిషి రూపంలోకి మారి తనపై నాగ దేవతకు అనుమానం వచ్చిందని అంటాడు.

మీరిద్దరే అక్కడకు వెళ్లండి.. నేను ఒంటరిగా వస్తానని అంటాడు. అదేంటి మాకు సాయం చేస్తున్నట్లు నాగ దేవతకు తెలిస్తే మీక సమస్య వస్తుంది కదా అంటాడు. అవునని చెప్పిన వెంటనే నాకోసం మీ ఇద్దరికీ సమస్య వద్దని అంటాడు. నన్ను కాటేసి నాగలోకం వచ్చాకా పంచమిని నాగ దేవత కిందకు రానివ్వకపోతే ఎలా అని అడగ్గా.. అక్కడకు వెళ్తే నాగ దేవత మిగిలినవి పట్టించుకోదు.. మేము నాగమణిని తీసుకు వచ్చి నిన్ను కాపాడతానని వివరిస్తాడు. నా బాధ చూసే ఫణీంద్ర సాయం చేస్తున్నాడని పంచమి చెబుతుంది.

Panchami Turn into Sanke And Bite panchami on Naga Panchami January 11th Episode

ఇక ఆ తర్వాత మోక్ష కుటుంబ సభ్యులను చూపిస్తారు. చిత్ర, జ్వాలలు... నిజంగానే పంచమి పాము అని తమ వద్ద నిజాలు దాచేస్తూ అనేక పనులు చేస్తున్నారని అంటారు. నా కళ్ల ఎదుటే అతడు పాములా మారాడాని పంచమి కూడా అలాంటి పామేనని వివరిస్తారు. పంచమి గురించి మోక్షకు పూర్తిగా తెలుసు కాబట్టి అతడిని కూడా చంపేస్తుందేమోనని అంటారు. అదంతా విన్న కుటుంబ సభ్యులు చాలా భయపడిపోతారు. గజగజావణికిపోతూనే అలా జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తారు. వారిద్దరూ ఇంటికి వచ్చాకా వీటి గురించి పూర్తిగా మాట్లాడుకుందామని అంటారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X