Naga Panchami: పాములా మారి నంబూద్రీని కాటేసి చంపిన పంచమి, పగతో రగిలిపోతున్న కరాళీ!
Naga Panchami October 31st Episode: నాగ పంచమి సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న ఈ సీరియల్.. పాములు, నాగ కన్యలే నేపథ్యంగా సాగుతోంది. ఈ సీరయల్ విపరతీమైన ప్రేక్షకాధరణ పొందుతుండడగా... రోజుకో ట్విస్ట్ ఇస్తూ సీరియల్ ను చాలా ఆసక్తిగా మలుస్తున్నారు. అలాగే డైలీ సీరియల్ లా సాగదీయకుండా చక్కగా పాయింట్ చెబుతున్నారు. దీంతో మరింత ఎక్కువ మంది ఈ సీరియల్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా... ఈరోజుటి ఎపిసోడ్.. పాములా మారిన పంచమి నంబూద్రీని కాటేస్తుంది. ఈక్రమంలోనే అతడు చనిపోతాడు.
అయితే తన అన్న నంబూద్రీని కాపాడుకునేందుకు కరాళీ చాలానే ప్రయత్నిస్తుంది. కానీ నంబూద్రీని కాటేసింది.. ఇష్టరూప నాగ ధారిణి కావడం అందులోనూ కాలకూట విషం ఇవ్వడంతో అతను బతకలేనని... ఏం చేసినా తనను బతికించుకోలేవని చెల్లి కరాళీతో చెబుతాడు. ఈక్రమంలోనే ఆమె ఒడిలోనే నంబూద్రీ ప్రాణాలు కోల్పోతాడు. అన్నయ్య చనిపోవడంతో.. కరాళీ తీవ్రంగా కలత చెందుతుంది. అలాగే పంచమిపై విపరీతమైన పగతో రగిలిపోతూ కనిపిస్తుంది. అయితే తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం ఈరోజుటి ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే.

అయితే నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా మోక్షను చూపిస్తారు. పంచమి బాత్రూంలోనే ఉంది అనుకొని.. మోక్ష తలుపు కొడుతూనే ఉంటాడు. ఆమెను బయటకు రావాలని చెబుతూనే కనిపిస్తాడు. అయితే తన ప్రాణాలు కాపాడుకునేందుకు పంచమి పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూనే... పాము కాటేయకుండా ఉండాలంటే పంచమి తన పక్కన ఉండాలి కానీ ఇలా ఎందుకు పారిపోతుందో తెలుసుకునేందుకు ట్రై చేస్తాడు. అతడికి ఎంతకూ వియం అర్థం కాదు. ఇక ఆ తర్వాత పాములా మారిన పంచమిని గరుడ తన చేత్తో పట్టుకొని నంబూద్రీ వదద్కు తీసుకెళ్తుంటాడు. కానీ పంచమి తల్లి శివుడితో పెట్టుకున్న మొర విన్న స్వామి వారు నందీశ్వరుడిని పంపిస్తాడు.
ఆ నందీశ్వరుడే.. గరుడ నుంచి పంచమిని విడిపిస్తాడు. మళ్లీ మళ్లీ గరుడ పంచమిపైకి దూసుకొస్తుంటే... నందీశ్వరుడు తన కొమ్ములతో కొట్టి మరీ గరుడను చంపేస్తాడు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య సాగే ఫైటింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఆ తర్వాత నంబూద్రీ, కరాళీలు... నాగమణితో పొందే లాభాలను ఆలోచిస్తూ.. తెగ సంబరపడిపోతూ కనిపిస్తారు. కానీ ఐదు నిమిషాల్లో వస్తానన్న గరుడ రాకపోయేసరికి అంజరం వేసి చూస్తారు. గరుడ చనిపోయి కనిపించగానే ఇద్దరూ టెన్షన్ పడిపోతారు. ఇక వెంటనే పంచమి వారి ముందుకు రావడం చూసి భయపడిపోతారు.
ఇలా వచ్చిన పంచమి బారి నుంచి తప్పించుకునేందుకు చాలానే ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ అవేవీ ఫలించవు. నంబూద్రీని వెంట పడి మరీ పంచమి అతడిని కాటేస్తుంది. ఈక్రమంలోనే అతడు కింద పడిపోతాడు. వెంటనే కరాళీ అక్కడకు వచ్చి పంచమిని చంపాలని చూస్తుంది. కానీ ఆమె కొట్టే బుసలు చూసి భయపడుతుంది. నా అన్ననే కాటేస్తావా నిన్ను చంపేస్తానని అనగానే.. కరాళీ వెంట పడుతుంది పాము రూపంలో ఉన్న పంచమి. కానీ చివరకు ఆమెను ఏం చేయకుండానే వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత కరాళీ తన వద్దకు రాగా... ఆమె చేతిలోనే నంబూద్రీ ప్రాణాలు కోల్పోతాడు.


Click it and Unblock the Notifications











