Naga Panchami: గరుడ చేతిలో పంచమి ప్రాణాలు, ఎవరు ఎవరిని చంపబోతున్నారంటే?
Naga Panchami October 29th Episode: నాగ పంచమి పంచమి సీరియల్ అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా తాజాగా వస్తున్న ఎపిసోడ్ లు అయితే ఈ సీరియల్ అభిమానులను పడుకోనీయకుండా చేస్తోంది. పౌర్ణమి రోజు పంచమి పాములా మారడం, ఆమెను చంపేందుకు నంబూద్రీ, కరాళీ, గరుడలు వేచి చూడడం హైలెట్ గా నిలుస్తోంది. మరోవైపు నాగ దేవత కూడా పంచమిని తిరిగి నాగ లోకానికి తీసుకు వెళ్లడం, మోక్షతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అంతా పంచమి గురించి తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
మోక్షతో పాటు గదిలో ఉన్న పంచమి బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడే ఆమె పాములా మారింది. భర్తను చంపేందుకు బాత్రూం డోర్ తీసేందుకు చాలానే ప్రయత్నించింది. కానీ ఆమె వల్ల కాలేదు. దీనంతటిని నాగ దేవతతో పాటు నాగ కన్యలు చూస్తూనే ఉన్నారు. పంచమి కావాలనే ముందుగా డోర్ వేసిందని.. ఈరోజు గనుక పంచమి.. నంబూద్రీ, మోక్షలను చంపకపోతే వాళ్లను నాగ లోకానికి రానివ్వనని స్పష్టం చేసింది. నాగ కన్యలు వద్దని చెబుతున్నా వినకుండా తన నిర్ణయాన్ని కుండ బద్ధలు కొట్టినట్లుగా చెప్పేసింది.

ఆ తర్వాత పాముగా మారిన పంచమి బాత్రూం నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత చిత్ర, జ్వాలల దగ్గరకు వెళ్లి బుసలు కొడుతుంది. వారిద్దరూ పామును చూసి భయంతో ఉయ్యాల ఎక్కేస్తారు. ఆ పామును గతంలో చూసినట్లు గుర్తుకు చేసుకుంటారు. ఇదిలా ఉండగానే గరుడ వచ్చి పంచమిని చేతిలోకి తీసుకుంటాడు. ఓ సారి గరుడలా మారుతూ, మరోసారి మనిషిలా మారుతూ కనిపిస్తాడు. మనిషిలా మారిన గరుడ పాము రూపంలో ఉన్న పంచమిని గట్టిగా పట్టుకుంటాడు.
వీరిద్దరిని ఓ చోట కూర్చుని చిత్ర, జ్వాలలు చూస్తూనే ఉంటారు. మరోవైపు నంబూద్రీ, కరాళీలు కూడా మంత్రశక్తితో అక్కడ జరిగేదంతా చూస్తారు. గరుడ పంచమిని పట్టుకోగానే.. కరాళీ, నంబూద్రీలు తెగ సంబర పడిపోతారు. నీ శత్రువు గరుడు చేతిలోకి వచ్చింది అన్నయ్యా అంటూ తెగ సంబర పడిపోతుంది కరాళీ. గదిలోనే ఉన్న మోక్ష మాత్రం పంచమికి ఏదో మానసికి సమస్య ఉందని అనుకుంటాడు. బయటకు రా, బయటకు రా అంటూ పిలుస్తూనే ఉంటాడు. కుటుంబ సభ్యులు అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు.
ఓ వైపు పంచమి తలప్పి శివుడి ముందు కూర్చొని ధాన్యం చేస్తూనే ఉంటుంది. తమకు ప్రసాదించిన పంచమి పాముగా మారడం ఏంటని అడుగుతుంది. పాము అయినా, చీమ అయినా.. పంచమి తమ కూతురే అని ఆమె పడే కష్టాలను ఎలాగైనా సరే తీర్చమంటూ వేడుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శివుడు.. పంచమిని కాపాడేందుకు ముందుకు వస్తాడా, వచ్చి ఏం చేస్తాడో తెలియాలంటే సోమవారం రోజు రాత్రి వచ్చే ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











