Naga Panchami 8th February: మోక్షను వదిలేసి అలా జీవిస్తానంటున్న పంచమి.. సంతోషంతో అతడికి హగ్గులు!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ.. రచ్చ చేస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో పంచమి ఓ షాకింగ్ డెసీషన్ తీసుకుంది. ముఖ్యంగా మోక్షకు, మేఘనతో పెళ్లి చేసిన తర్వాత తాను ఎలా జీవించాలనుకుంటుందో చెప్పి షాకిచ్చింది. మోక్ష పెళ్లి అయిపోయి తన బాధ్యత తీరిపోయిన వెంటనే అలా ఉంటానంటూ.. తనకు ఎంతగానో ఇష్టం అయిన సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి ఆ స్వామి విరాకి చెప్పింది.
ముఖ్యంగా తన తర్వాతి జీవితం అంతా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి నామ స్మరణతోనే అని స్పష్టం చేసింది. ప్రస్తుతం మోక్ష మేఘనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం.. తనకు ఎంతో సంతోషాన్ని కల్గిస్తోందని తెలిపింది. ఈక్రమంలోనే ఆనందంతో పంచమి.. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా.. ఎదురుగా సుబ్బు కనిపిస్తాడు. చాలా రోజుల తర్వాత సుబ్బు కనిపించడంతో చాలా ఆనందపడిపోతుంది పంచమి. వెంటనే ప్రదక్షిణలు చేయడం ఆపేసి మరీ అతడి వద్దకు పరిగెడుతుంది.

సుబ్బు, సుబ్బు అంటూ అతడిని ఆప్యాయంగా ముట్టుకుంటుంది. కౌగిలించుకుంటుంది. తెగ సంబురపడిపోతూ.. ఎన్ని రోజులు అవుతుంది సుబ్బు అంటూ ప్రేమగా అతడిని దగ్గరకు తీసుకుంటుంది. సుబ్బును చూసిన తర్వాత తన మనసులోని బాధలు అన్నీ మాయం అయినట్లు పంచమి మొహం చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు. అయితే నిన్ని ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిన్నటి ఎపిసోడ్ లో పంచమి మోక్ష ఇంటికి వెళ్లి అతడితో మాట్లాడిన తర్వాత.. మోక్షకు మరో పెళ్లి చేయడం తనకు ఇష్టమేనని పంచమి కుటుంబ సభ్యులతో చెబుతుంది. అది విన్న శబరి అదేంటమ్మా.. మీ జీవితాలే నాశనం అవుతాయని అనగా.. లేదు బామ్మా ఈ పెళ్లి వల్లే మా జీవితాలు బాగవుతాయని పంచమి అంటుంది. తాను వెళ్లిపోతానని అంటుంది. వెంటనే మోక్ష.. మా పెళ్లి అయ్యే వరకు నీవు ఇక్కడే ఉండాలి పంచమి, అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలని చెబుతాడు. అలా అయితేనే తాను ఈ పెళ్లి చేసుకుంటానని లేకపోతే చేసుకోనని అంటాడు. దీనికి పంచమి ఒప్పుకుంటుంది.
పంచమి పెళ్లి అయ్యే వరకు ఉంటానని వివరిస్తుంది. కానీ వైదేహి మాత్రం శుభమా అని పెళ్లి చేస్తుంటే మళ్లీ ఈ దరిద్రం ఇక్కడ ఎందుకు అని అంటుంది. అలాగే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పంపించండి అని పేర్కొంటుంది. నేను డబ్బుల కోసం ఈ పెళ్లి చేసుకోలేదని.. మోక్ష పెళ్లి జరిపిస్తానని వివరిస్తుంది. ఇక ఆ తర్వాత మేఘన మహాంకాళిని ఆవాహనం చేసుకుంటుంది. ప్రత్యక్షం అయిన అమ్మవారు... కరాళీ నువ్వు అనుకున్నవి అన్నీ జరగవు అని చెబుతుంది. నువ్వు మంచి పనులు తలపెడితేనే దైవం సహకరిస్తుందని.. లేదంటే సహకరించదని చెబుతుంది. ఇలా కరాళీని మహాంకాళి భయపెట్టగా.. నంబూద్రీ ఆత్మను ఆవాహనం చేసుకుని సాయం చేయాలని కోరుతుంది.


Click it and Unblock the Notifications











