Naga Panchami: పాములా మారబోతున్న పంచమి, నిజం తెలుసుకునేందుకు మోక్ష ప్రయత్నం - ఏం జరగబోతోంది?
Naga Panchami October 26th Episode: నాగ పంచమి సీరియల్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఎక్కడా ఎలాంటి సాగదీత లేకుండా.. అదిరిపోయే ట్విస్టులతో రోజురోజుకూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే తాజా ఎపిసోడ్ లో పౌర్ణమి వస్తుండడంతో.. పంచమి పాముగా మారబోతుంది. ఈక్రమంలోనే కుటుంబ సభ్యులు అంతా పంచమిని ఇంట్లోంచి పంపించేద్దామని.. మోక్షతో చెబుతారు. చిత్ర, జ్వాలలు అయితే పంచమి పాము అని, ఆమె ఇంట్లో ఉంటే అందరికీ సమస్యేనని చెప్పుకొచ్చారు. ఇందుకు మోక్ష కూడా స్పందించి.. తనకు కూడా పంచమిపై చాలా అనుమానాలు ఉన్నాయని చెబుతాడు.
ఇక ఆ తర్వాత.. ఈరోజు పౌర్ణమి అని పంచమి గురించి తనకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని మోక్ష కుటుంబ సభ్యులకు వివరిస్తాడు. నిజంగా పంచమి పాము అని తెలిస్తే తాను తనను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనీయని అంటాడు. అప్పటికే పంచమి అక్కడకు వస్తుంది. గుమ్మం దగ్గరే నిలబడి.. వారు మాట్లాడే మాటలను వింటుంది. లోలోపల పంచమి చాలా భయపడిపోతుంది. పౌర్ణమి రోజు తాను పాములా మారడం, అలా మారితే నంబూద్రీతో పాటు మోక్షలపై పగ తీర్చుకోవాలి. తన తల్లిని చంపినందుకు వారిని కాటేసి చంపాలి. దాన్ని తలుచుకొని పంచమి చాలా భయపడిపోతుంది. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.

అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. ముందుగా మోక్ష తల్లి.. పంచమిపై కోప్పడుతుంది. ఆమెను తీసుకెళ్లమని తన తల్లికి ఫోన్ చేసినట్లు మోక్షతో చెబుతుంది. పంచమి ఒక దుష్ట శక్తి అని ఆమె ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మోక్ష అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటుంది. పంచమి తన భార్య అని అలా చేయడానికి వీల్లేదని మోక్ష చెబుతాడు. ఆ తర్వాత పంచమి వద్దకు వెళ్లి నిజం చెప్పమని అడుగుతాడు. పంచమి తన కోసం భయపడడం తెలుస్తోందని.. కానీ నిజం ఏంటో చెప్పాల్సిందేనని పట్టుబడతాడు.
కానీ పంచమి మాత్రం నోరు మెదపదు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి.. తర్వాత చెబుతానని అంటుంది. అక్కడితో మోక్ష ఊరుకుంటాడు. ఇక ఆ తర్వాత చిత్ర దెయ్యంలా తయారై జుట్టు ముందుకు వేసుకొని కూర్చుంటుంది. ముందుగా అక్కడకు వచ్చిన శిశిర తల్లిని చూసి తీవ్రంగా భయపడిపోతుంది. మమ్మీ దెయ్యం, మమ్మీ దెయ్యం అంటూ బయటకు పరుగులు పెడుతుంది. ఆ తర్వాత అక్కడకు జ్వాల రాగా.. ఇద్దరూ అరుస్తారు. చిత్ర మోహం చూసి జ్వాల, జ్వాల తనపై చేయి వేయడంతో చిత్ర తీవ్రంగా భయపడిపోతారు.

ఇక ఆ తర్వాత నంబూద్రీ, కరాళీలు పూజలు చేస్తూ కనిపిస్తారు. ముందుగా మంత్రశక్తితో పంచమిని చూసి నవ్వుకుంటారు. ఆపై గరుడని పిలిచి.. పంచమి ఈరోజు పాములా మారుతుందని, నీవు పగ తీర్చుకోవాలని చెబుతారు. అందుకు గరుడ సరేనని చెబుతాడు. ఆపై గరుడ పక్షిలా మారి పంచమిపై తిరుగాడతాడు. అందుకు పంచమి తీవ్రంగా భయపడుతుంది. కానీ ఆ తర్వాత గరుడకు వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత.. సుబ్బు దగ్గరకు నాగ దేవత వస్తుంది. మీరు మా పనులకు అడ్డు రావద్దని, అలా జరిగితే తాము చేయాలనుకున్నవి చేయలేకపోతున్నామని అంటుంది. నేను మీకు అడ్డు రానని.. కేవలం తన భక్తురాలికి అండగా ఉంటానని చెబుతాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications











