»   » “పండుగ చేస్కో” : హీరోతో తలనొప్పులున్నా... నిర్మాతకు కొంత ఊరట

“పండుగ చేస్కో” : హీరోతో తలనొప్పులున్నా... నిర్మాతకు కొంత ఊరట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆర్ధిక సమస్యలతో హీరో తో డబ్బింగ్ సమస్య ఎదుర్కొంటున్న "పండుగ చేస్కో" నిర్మాతకు కొంత ఊరట లభించినట్లే అంటున్నారు. అంటే హీరో వచ్చి డబ్బింగ్ చెప్పాడన్న విషయం కాదు. ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ ఊహించని విధంగా 6.5 పలకటమే అంటున్నారు. జీ తెలుగు ఛానెల్ వారు ఈ రేటు ఇచ్చి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమచారం. కుటుంబాలని ఈ చిత్రం టార్గెట్ చేసినట్లుగా ఉండటం, బ్రహ్మానందం, రకుల్ ప్రీతి సింగ్ లు చిత్రంలో ఉండటం, దర్శకుడు మలినేని గోపిచంద్ కు ఇది సూపర్ హిట్ బలుపు తర్వాత చిత్రం కావటం ఈ రేటు పలకటానికి కారణమయ్యాయని సమాచారం.

రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


“Pandaga Chesko” satellite right 6.5 crores

దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్‌ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.


రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
Zee Telugu channel has reportedly invested 6.5 crores to bag the satellite rights of this Ram-Rakul starrer “Pandaga Chesko” being directed by Gopichand Malineni.
Please Wait while comments are loading...