ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య.. నిశ్చితార్థం అయిన కొన్ని నెలలకే ఉరివేసుకొని..

2020లో సినిమా పరిశ్రమలో ఎన్నో విషాద ఫటనలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు కరోనా ధాటికి కొందరు సెలబ్రెటీలు కన్నుమూయగా మరోవైపు ఆత్మహత్య చేసుకొని మరికొందరు కన్నుమూశారు. ఇక ఈ రోజు తెల్లవారుజామున ఒక టెలివిజన్ నటి ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. 28ఏళ్ళ వయసులోనే నటి బలవన్మరణానికి పాల్పడటం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆమె మరెవరో కాదు. తమిళ టీవీ నటి వీజే చిత్ర.

ఉరి వేసుకొని ఆత్మహత్య

ఉరి వేసుకొని ఆత్మహత్య

గత కొంతకాలంగా తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజే చిత్ర ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 28. టీవీ, సినిమా ప్రపంచానికి ఈ వార్త షాక్ ఇచ్చింది. పాండియన్ స్టోర్స్ అనే పాపులర్ షోలో ముల్లై పాత్ర ద్వారా ఆమెకు భారీగా క్రేజ్ దక్కింది. ఈ నటి నజరేత్‌పేట్టైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.

కాబోయే భర్తతోనే ఉంటున్న చిత్ర

కాబోయే భర్తతోనే ఉంటున్న చిత్ర

వీజే చిత్రా ఈవీపీ ఫిల్మ్ సిటీలో మంగళవారం షూటింగ్ పూర్తి చేసుకొని హోటల్ రూమ్ కు వెళ్లింది. ఇక ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు తన హోటల్ గదికి తిరిగి వచ్చారని హోటల్ సిబ్బంది తెలిపారు. అయితే ఆమె తన కాబోయే భర్త, వ్యాపారవేత్త హేమంత్‌తో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కొన్ని నెలల క్రితమే నిశ్చితార్థం కూడా జరిగింది.

పాండియన్ స్టోర్స్ ద్వారా భారీ క్రేజ్

పాండియన్ స్టోర్స్ ద్వారా భారీ క్రేజ్

వీజే చిత్ర తమిళ పరిశ్రమలోని వివిధ టీవీ ఛానెళ్లలో ప్రెజెంటర్ గా వర్క్ చేశారు. ప్రస్తుతం ఆమె పాండియన్ స్టోర్స్ సీరియల్‌తో బిజీగా ఉంది. ముల్లై పాత్ర ద్వారా ఈ నటి భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె నిత్యం అనేక రకాల ఫొటోలతో నెటిజన్లను ఆకర్షిస్తునే ఉంటారు. ఆమె అందమైన ఫోటోలకు అభిమానులు చాలానే ఉన్నారు.

ఆత్మహత్యకు అసలు కారణం..?

ఆత్మహత్యకు అసలు కారణం..?

ఇక ఆమె ఆత్మహత్యకు అసలు కారణం తెలియాల్సి ఉంది. ఒక విషయంలో అప్సెట్ అవ్వడం వలన నిరాశతో వీజే చిత్రా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆమె మరణం అభిమానులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆమె ఫొటోలో దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
ఆ సీరియల్స్ ద్వారా భారీ క్రేజ్

ఆ సీరియల్స్ ద్వారా భారీ క్రేజ్

చిత్ర పలు టెలివిజన్ల సీరియల్స్ తోనే తన స్థాయిని మరింత పెంచుకుంది. ఆమెకు గుర్తింపు తెచ్చిన వాటిలో చిన్న పాపా పెరియా పాపా ఒకటి. 2014 నుంచి 2018 వరకు సన్ టివిలో వచ్చిన ఆ సిరియల్ మంచి రేటింగ్స్ అందుకుంది. విజయ్ టీవీలో ప్రసిద్ధ సీరియల్ శరవణన్ మీనాచి యొక్క సీజన్ 2 కూడా బాగానే క్లిక్కయ్యింది. 2016 నుంచి 2017 మధ్య జీ తమీజ్ లో ప్రసారమైన డార్లింగ్ డార్లింగ్ కూడా హిట్టయ్యింది. జీ తమీజ్ యొక్క వేలునాచిలో కూడా ఆమె ఒక చిన్న పాత్ర పోషించింది. ఇక 2019 లో వచ్చిన విజయ్ టీవీ యొక్క వసూల్ వెట్టైకి హోస్ట్ గా వ్యవహరించింది చిత్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X