twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటి ఝాన్సీ ఆత్మహత్యకేసు: ఫోన్‌లోని ఆ వీడియోపై అనుమానం, ప్రియుడే కారణమా?

    |

    'పవిత్ర బంధం' సిరీయల్‌లో నటించిన ఝాన్సీ ఆత్మహత్య కేసులో సెల్ ఫోన్ కీలకంగా మారింది. గత మూడు నెలలుగా ప్రియుడు సూర్య ఝాన్సీని వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం కూడా ఝాన్సీ ఆత్మహత్య యత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఇటీవల శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్‌లో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూర్యకు ఆమె వాట్సాప్ ద్వారా సందేశాలు పంపింది. వాటి ఆధారంగా ప్రియుడు వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

    వీడియోలు సీజ్ చేసిన పోలీసులు

    వీడియోలు సీజ్ చేసిన పోలీసులు

    ఈ కేసులో రెండు సెల్ ఫోన్లు కీలకంగా మారాయి. ఇప్పటికే ఒక సెల్ ఫోన్ ఓపెన్ చేయగా, మరొక ఐ ఫోన్ లాక్ కావడంతో దాన్ని తెరిపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓపెన్ అయిన ఫోన్లో వందల చాటింగులను పోలీసులు గుర్తించారు. వీడియోలను కూడా సీజ్ చేశారు.

    ఇద్దరి మధ్య అందుకే గొడవా?

    ఇద్దరి మధ్య అందుకే గొడవా?

    తన ప్రియురాలు ఝాన్సీ మరొకరితో చనువుగా ఉండటాన్ని సూర్య జీర్ణించుకోలేక పోయాడని, ఈ విషయంలో సూర్య నిత్యం ఝాన్సీని వేధించేవాడని, చాటింగులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు టీవీ చానల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

    గతంలో ఆత్మహత్యయత్నం?

    గతంలో ఆత్మహత్యయత్నం?

    ప్రస్తుతం రెండు ఫోన్లను నిపుణుల వద్దకు పంపించాం. ఐఫోన్ ఓపెన్ కావడం లేదు. సామ్ సంగ్ ఫోన్ ఓపెన్ అయింది. అందులో ఇద్దరి మధ్య లవ్ విషయంలో వాట్సాప్ చాట్ ఉంది. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. గతంలో సూసైడ్ అటెమ్ట్ చేసినట్లు కూడా ఓ వీడియో ఉందని, విషం తాగి నోట్లో నుంచి నురగలు వస్తున్నట్లు అందులో ఉందని... పోలీసులు తెలిపారు.

    టిక్ టాక్ వీడియోలు

    టిక్ టాక్ వీడియోలు

    టిక్ టాక్ అనే యాప్‌లో కొన్ని సాడ్ సీన్స్, లవ్ సీన్స్, హ్యపీ సీన్స్ ఆమె డబ్ స్మాష్ చేసింది. అయితే సూసైడ్ అటెమ్ట్ లాగా ఉన్నది ప్రాక్టీస్ వీడియోనా? లేక రియల్ వీడియోనా అనేది విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

    పోలీసుల ముందుకు సూర్య

    పోలీసుల ముందుకు సూర్య

    సూర్యకు సంబంధించిన వ్యక్తులకు ఇంటిమేట్ చేశాం. అతడిని విజయవాడ నుంచి తీసుకుని వస్తున్నారు. ఝాన్సీ బ్రదర్ చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఎఫైర్ ఉన్న విషయం తెలిసింది. ఆ లవ్ ఎఫైర్ వల్లనే వారి మధ్య డిస్ట్రబెన్స్ వచ్చినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

    English summary
    Panjagutta police about Tv actress Jhansi suicide case. Her WhatsApp chat with lover Surya and other is selfie video seized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X