twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్2 చూసి జీర్ణించుకోలేకున్నా.. బ్రతికున్నవారి ఫోటోలు, టీవీ ఆఫ్ చేయమని నా భార్యకు చెప్పా!

    |

    బిగ్ బాస్2 షో ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 16 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ షోకు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్2 చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 7 మంది సభ్యులు విజేతలుగా నిలిచినందుకు గట్టిగా పోటీ పడుతున్నారు. ఆడియన్స్ కు బాగా వినోదాన్ని అందిస్తుండడంతో బిగ్ బాస్ షోకు ఆదరణ లభిస్తోంది. మరో వైపు ఈ షోని విమర్శించే వారు కూడా అధికం అవుతున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కూడా చేరారు.

    నాకు నచ్చింది

    నాకు నచ్చింది

    బిగ్ బాస్ షో మొదట్లో నాకు బాగా నచ్చిందని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. అంతరించిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థని గుర్తుచేసేలా ఈ షో ఉండడంతో ఆకర్షితుడిని అయ్యానని పరుచూరి అన్నారు. రక్త సంభందం లేని వారంతా ఒకే ఇంట్లో రెండు మూడు నెలలు కలసి ఉండడం గొప్ప విషయం అని పరుచూరి అన్నారు.

    జీర్ణించుకోలేకపోతున్నా

    జీర్ణించుకోలేకపోతున్నా

    కానీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి జీర్ణించుకోలేకపోతున్నా అని పరుచూరి తెలిపారు. బిగ్ బాస్ లో జరిగే కొన్ని సంఘటనలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. స్త్రీ పురుషులు ఆకాశంలో చెరి సగం. కాలం శరీర నిర్మాణంలో మాత్రం వ్యత్యాసం ఉందని అన్నారు.

    అన్ని క్రీడల్లో

    అన్ని క్రీడల్లో

    క్రీడల్లో కూడా స్త్రీ పురుషులకు వేరు వేరుగా పోటీలు నిర్వహిస్తారు. దానికి కారణం శరీర నిర్మాణమే అని అన్నారు. ఇద్దరికీ కలిపి బిగ్ బాస్ హౌస్ లో పోటీలు నిర్వహించడం సరైన విషయం కాదు.

    కొంతమంది పడిపోయారు

    కొంతమంది పడిపోయారు

    బిగ్ బాస్ షోలో స్త్రీ పురుషులిద్దరికీ పరిగెత్తే పోటీ ఒకటి నిర్వహించారు. కొంత మంది ఆడపిల్లలు పడిపోయారు. చాలా భాదగా అనిపించింది. ఇలాంటి పోటీలు నిర్వహిచడం సరైనది కాదు.

    కారులో

    కారులో

    తాను తమిళ బిగ్ బాస్ కూడా తాను చూశానని అన్నారు. కారులో 24 గంటల పాటు కూర్చునే పోటీలో ఒక అమ్మాయి తమిళ బిగ్ బాస్ లో గెలిచింది. కానీ తెలుగులో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలని బలవంతంగా కారులో నుంచి నెట్టివేయడం భాదగా అనిపించిందని పరుచూరి అన్నారు.

    జీవిత కాలం

    జీవిత కాలం

    క్రీడలో కొన్ని నియమాలు తప్పితే జీవితకాలం నిషేధం విధించిన సందర్భాలు ఉన్నాయని పరుచూరి అభిప్రాయపడ్డారు. పురుషులు స్త్రీలని బలవంతంగా నెట్టివేయడం క్రీడా స్ఫూర్తి కాదని అభిప్రాయం పడ్డారు.

    బ్రతికున్నవారి ఫోటోలు

    బ్రతికున్నవారి ఫోటోలు

    ఓ నామినేషన్ టాస్క్ లో ఫోటోలు తగలబెట్టడం చూశా. నేను బయటకు వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చా. నా భార్య బిగ్ బాస్ చూస్తోంది. టాస్క్ లో భాగంగా ఫోటోలు తగలబెడుతున్నారు. వెంటనే టివి ఆఫ్ చేయమని నా భార్యకు చెప్పా. బ్రతికున్న వారి ఫోటోలు తగలబెట్టడం ఏంటి ? ఈ నాగరికత ఎక్కడి నుంచి వస్తోంది ? వికృత రూపంలో వినోదాన్ని అందించే షోలు అవసరం లేదు అని పరుచూరి మండిపడ్డారు.

     ఎన్నైనా చేయండి

    ఎన్నైనా చేయండి

    ఎక్కడ స్త్రీలు పూజించబడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చిన్నప్పటి నుంచి చదువుతూ పెరిగాం. బిగ్ బాస్ 2, 3, 4 ఇలా ఎన్నైనా చేయండి.. కానీ భారతదేశ నాగరికతని గుర్తుపెట్టుని చేయండి అని పరుచూరి హితవు పలికారు.

    English summary
    Paruchuri Gopala Krishna About Bigg Boss 2 Telugu Show TASKS. Paruchuri Gopala Krishna told how he was upset with this show
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X