హేమ విషయంలో అలా జరుగడం బాధగా ఉంది: పరుచూరి గోపాలకృష్ణ
బిగ్ బాస్ 3 నుంచి తొలివారమే ఎలిమినేట్ అయిన హేమ గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయసులో ఆమె రాఘవేంద్రరావుగారి 'రక్త కన్నీరు' సమయంలో పరిచయం. హీరోయిన్ అవుతుంది అనుకున్నాను. కానీ అద్భుతమైన కమెడియన్‌గా కన్వర్ట్ అయింది. తన జీవితాన్ని తనే రచించుకుంది. 'అతడు' లాంటి సినిమాల్లో లేడీ బ్రహ్మానందంలా నవ్వించింది. ఒకానొక సమయంలో హేమ కనపడని సినిమా ఉందా? అనే అంత బిజీగా గడిపిందని పరుచూరి గుర్తు చేసుకున్నారు.
బిగ్ బాస్ 3 నుంచి హేమ తొలివారమే ఎలిమినేట్ అవ్వడంతో బాధేసింది. నాకు తెలిసిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న అమ్మాయి కావడం వల్ల అలా అనిపించింది. బిగ్ బాస్ షోకు అంటూ కొన్ని రూల్స్ ఉండొచ్చు. మొదటి వారమే ఎలిమినేషన్ ఉండటం కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే వారు కలిసి ఉండేది నాలుగైదు రోజులే, ఇంట్లోని 15 మందిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కానీ ఆ లోపే ఎలిమినేట్ అవ్వడం వల్ల వారు ఏం తప్పు చేశారో తెలుసుకునే అవకాశం కూడా వారికి లేకుండా పోతోందని పరుచూరి అన్నారు.

ఇందులో ప్రేక్షకుల ఓట్లు తప్ప... ఆమె బయటకు రావడానికి కారణం ఏమిటో నాకైతే కనిపించలేదు. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే మొదటి వారంలో హోస్ట్ నాగార్జున వాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేసి రెండో వారంలో కూడా అవే తప్పులు చేస్తే బయటకు పంపించే ప్రయత్నం చేస్తే బావుండేదని పరుచూరి అభిప్రాయపడ్డారు.
బిగ్ బాస్ షోలో తొలివారం హేమ ఎలిమినేట్ అవ్వగా, రెండో వారం జర్నలిస్ట్ జాఫర్ ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్లో బాబా భాస్కర్, పునర్నవి, వితిక, రాహుల్ సిప్లిగంజ్, తమన్నా సింహాద్రి ఉన్నారు. ఈ ఐదుగురిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











