Double Elimination: తమిళ బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. కంటెస్టెంట్‌పై అమానుష ప్రవర్తనకు రెడ్‌కార్డు శిక్ష!

బిగ్‌బాస్ తమిళ సీజన్ 9 సంచలనం చోటు చేసుకొన్నది. సహచర కంటెస్టెంట్‌పై దాడి జరపడమే కాకుండా హింసాత్మక ప్రవృత్తిని చాటినందుకు ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఇంటి నుంచి నిర్ధాక్షిణ్యంగా బయటకు సాగనంపారు. ఇటీవల కాలంలో బిగ్‌బాస్ రియాలిట షోలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అరుదుగా కనిపించింది. ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్లపై ఇంటలి సభ్యుల నుంచే కాకుండా నెటిజన్ల నుంచి కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి, నిరసన వ్యక్తమవుతున్నది. ఈ వివాదం, డబుల్ ఎలిమినేషన్ వివరాల్లోకి వెళితే..

తమిళ బిగ్‌బాస్ 9వ సీజన్ జర్నీ దాదాపు 90 రోజులపాటు వివాదాలు, కంటెస్టెంట్ల మధ్య విభేదాలతో సాగిపోయింది. ఈ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఇంటిలో టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్‌లో భాగంగా కారును ఒకటి లాంజ్‌లో పెట్టి.. అందులో కంటెస్టెంట్లను కుక్కారు. ఎవరు ఎక్కువ సేపు టాస్క్ నిబంధనలు పాటించి చివరి వరకు ఉంటారో వారికి టాస్క్ టూ ఫినాలే గెలుచుకొనేందుకు అర్హత సాధిస్తారు అని రూల్స్ చెప్పారు.

Double Elimination in Tamil Bigg Boss 9

టికెట్ టూ ఫినాలే టాస్క్ జరుగుతుండగా కారులో కంటెస్టెంట్లందరూ కూర్చున్నారు. కాసేపు సమయం గడిచిన తర్వాత పార్వతి, కమ్రుద్దీన్ ఇద్దరు కలిసి సండ్రా అనే లేడీ కంటెస్టెంట్‌ను టార్గెట్ చేశారు. కారు డోర్ తీసి ఆమెను బయటకు నెట్టి వేసేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలను సండ్రా ప్రతిఘటించడంతో ఆమెపై శారీరక దాడికి పాల్పడ్డారు. ఏకంగా కాలితో తన్నుతూ ఆమెను కిందికి తోశారు. తోటి కంటెస్టెంట్లు ప్రవర్తించిన తీరుతో కలత చెందిన సండ్రా పానిక్ ఎటాక్‌కు గురైంది. దాంతో అత్యవసర చికిత్స కోసం మెడికల్ రూమ్‌కు తరలించారు. ఈ సంఘటనపై ఇంటిలోని కంటెస్టెంట్లతోపాటు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు సోషల్ మీడియాలో కనిపించాయి.

అయితే శనివారం రాత్రి వారాంతంపు ఎపిసోడ్‌ను నిర్వహించడానికి వచ్చిన హోస్ట్ విజయ్ సేతుపతి ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆ ఇద్దరి దుష్ప్రవర్తనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సహచర కంటెస్టెంట్‌పై అమానుషంగా ప్రవర్తించినందుకు పార్వతి, కమ్రుద్దీన్‌కు రెడ్ కార్డులు చూపించారు. తక్షణం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు. దాంతో చేసేది ఏమీ లేక వారు ఇంటి నుంచి నిష్క్రమించారు.

రెడ్‌ కార్డు ద్వారా ఇంటి నుంచి బయటకు వెళ్లిన పార్వతి, కమ్రుద్దీన్ తీవ్రమైన శిక్షను ఎదుర్కోనున్నారు. మానసికంగా వారికి సోషల్ మీడియాలో ప్రతికూల దాడులు ఎక్కువైనాయి. ఈ తరహా ఎలిమినేషన్ వల్ల ఇద్దరు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోనున్నారు. గత 90 రోజులుగా వారికి లభించే పారితోషికం, బహుమతులు లభించవు. బిగ్‌బాస్ షోలో వారి జర్నీకి సంబంధించి ప్రదర్శించే ఏవీ కూడా వారికి ఉండదు. అంతేకాకుండా బిగ్‌బాస్ ఫినాలే సెలబ్రేషన్‌లో పాల్గొనడానికి కూడా అనర్హులుగా మారుతారు అని తెలిసింది.

ఇదిలా ఉండగా, ఎలిమినేషన్ సందర్భంగా పార్వతికి విడ్కోలు చెప్పడానికి కంటెస్టెంట్లు ఎవరూ కూడా ముందుకు రాలేదు. గేట్ వద్ద కాసేపు నిలుచొని ఎవరూ రాకపోవడంతో ఆమె ఇంటి నుంచి దారుణమైన పరిస్థితుల్లో నిష్క్రమించింది. కమ్రుద్దీన్‌కు మాత్రం ఒకరిద్దరూ సానుకూలంగా స్పందించి బయటకు పంపించారు. అయితే పార్వతిని, కమ్రుద్దీన్‌ను కర్మ సిద్దాంతం వెంటాడింది. మనం ఏదైనా తప్పు చ చేస్తే అంతుకు మించి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X