నన్ను బ్యాన్ చేశారు.. అలా చేసినా ఇబ్బంది పెట్టారు: పసుపు కుంకుమ హీరోయిన్ పల్లవి
బుల్లితెర ప్రేక్షకులు సీరియల్స్ ను ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని పాత్రలను తమ ఇళ్లల్లో జరుగుతున్నట్లుగానే ఊహించుకుంటారు. ఇక అందులో నటించే నటీనటులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అలా క్రేజ్ సంపాదించుకున్న సీరియల్ నటి పల్లవి గౌడ. ఇలా పేరు చెబితే తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ గుర్తు పట్టకపోవచ్చేమో కానీ పసుపు కుంకుమ సీరియల్ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్ లో అమాయకమైన నటనతో ఎంతగానో మెప్పించింది క్యూట్ భామ పల్లవి గౌడ. అయితే ఆమెపై తెలుగు టీవీ ఇండస్ట్రీ బ్యాన్ వేసినట్లు చెప్పుకొచ్చింది.

విలన్ గా అదరగొట్టి..
పసుపు కుంకుమ సీరియల్ లో అమాయకపు చూపలతో ఎంతో బాగా నటించి అనేకమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది బ్యూటిఫుల్ పల్లవి గౌడ. ఆ తర్వాత సావిత్రి సీరియల్ తో మరింతగా దగ్గరై తెలుగు ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ రెండు సీరియల్స్ లో అమాయకంగా కనిపించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ చదరంగం ధారావాహికతో విలన్ గా కూడా అదరగొట్టింది. అటు అందం ఇటు అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది.

పర్మిషన్ అంతా తీసుకున్నా..
అయితే టాలెంటెడ్ నటి అయిన పల్లవి గౌడను ఒకప్పుడు తెలుగు టీవీ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందట. అది ఎందుకు అనే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది పల్లవి గౌడ. "నేను నా సెకండ్ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు ఓ సినిమా షూటింగ్ ఉంది. అది ఔట్ డోర్ షూటింగ్. అప్పుడు నా సీరియల్ టీమ్ వాళ్లతో మాట్లాడి పర్మిషన్ అంతా తీసుకున్నాను. వాళ్లు కూడా ఆ సమయంలో కథలో ఏవో మార్పులు చేసుకుంటున్నారు. వాళ్లకు కూడా అప్పుడు ఈజీగా ఉండేది" అని పల్లవి గౌడ్ తెలిపింది.

25 రోజులు బ్లాక్ అయిపోయా..
"అయితే వాళ్లతో చేసిన అగ్రిమెంట్ లో ఓ విషయం ఉంది. ఈ సీరియల్ టెలీకాస్ట్ ఎపిసోడ్ అయిపోయేవరకు నేను తెలుగులో ఏ సీరియల్ చేయకూడదు అని అందులో రాశారు. నేను కూడా సరే, నేను ఏం చేయను అని చెప్పాను. కానీ నేను బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అలా అక్కడ ఒక నెలలో 20 నుంచి 25 రోజుల పాటు నేను బ్లాక్ అయిపోయాను. అది చేయాల్సి వచ్చింది కాబట్టి నేను పర్మిషన్ అన్నీ తీసుకుని వెళ్లాను. అంతా బాగానే మాట్లాడుకున్నాను. అగ్రిమెంట్ కూడా సైన్ అయిపోయింది. తర్వాత సినిమా షూటింగ్ కు వెళ్లిపోయాను" అని పల్లవి గౌడ్ చెప్పుకొచ్చింది.

2 నెలలపాటు చేశాను..
పల్లవి గౌడ్ ఇంకా కొనసాగిస్తూ.. "ఆ సినిమా షూటింగ్ కు వెళ్లిన తర్వాత నాకు రావాల్సిన పేమెంట్ సీరియల్ వాళ్లు ఇవ్వలేదు. దీంతో ఏంటీ సార్ ఎందుకు డబ్బులు పంపలేదు అని అడిగాను. అయినా రోజు అడగటానికి కూడా ఏదోలా ఉంటుంది కదా. అందుకే అలా చేయలేదు. పేమెంట్ ఇవ్వకపోయినా రెండు నెలలపాటు పని చేశాను. ఆ తర్వాత అడిగితే ఈరోజు రేపు అనేవాళ్లు. ఇక ఇది వర్కౌట్ అయ్యేలా లేదనుకుని మీరు ఎలాగు నాకు పేమెంట్ ఇవ్వడం లేదు. నేను వేరే సీరియల్ అయినా చేస్తాను అని చెప్పాను" పేర్కొంది.
మసెజ్ వచ్చింది..
"వేరే సీరియల్ చేస్తానంటే.. లేదు లేదు అలా చేయడానికి లేదు. నువ్వు అగ్రిమెంట్ సైన్ చేశావ్ కదా అన్నారు. అవును, చేశాను కానీ మీరు పేమెంట్ ఇవ్వలేదు కదా అని అన్నాను. ఇలా జరిగిన కొద్ది రోజులకు నాకు ఒక మెసేజ్ వచ్చింది.. నన్ను తెలుగులో బ్యాన్ చేశారని. పెద్దగా మాటా మాటా అనుకోవడం ఏం లేదు. నాకు మెసేజ్ వచ్చింది నన్ను తెలుగులో బ్యాన్ చేశారని. ఇదంతా మెసేజ్ లో మాట్లాడను. 6 నెలలో, ఒక సంవత్సరమో అనుకుంటా బ్యాన్. సరిగా గుర్తు లేదు" అని పల్లవి గౌడ్ అన్నారు.
తెలుగులోకి వస్తానని..
"తెలుగు టీవీ ఇండస్ట్రీలో బ్యాన్ తర్వాత నాకు మంచి ఆఫర్ వచ్చింది. కానీ ఈలోపు కరోనా సంక్షోభం వచ్చింది. దాని తర్వాత నేను మలయాళంలోకి వెళ్లిపోయాను. తర్వాత కన్నడలో సినిమాలు కంటిన్యూ చేశాను. ఒక మంచి స్టోరీ వస్తే కచ్చితంగా తెలుగులోకి వస్తాను అని చెప్పాను. అప్పుడే చదరంగం సీరియల్ వచ్చింది. సక్సెస్ ఫుల్ గా రన్ అయింది" అని చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ పల్లవి గౌడ.


Click it and Unblock the Notifications











