ప్రేమ,పెళ్లి అంటే భయమేస్తోంది.. పెళ్లైన వారానికే షాకింగ్ కామెంట్స్

పటాస్, జబర్దస్త్ తదితర టీవీషోలతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ ప్రవీణ్. ఇక మరీ ముఖ్యంగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఎక్కువ రోజులు కొనసాగుతూ అక్కడే క్రేజ్ దక్కించుకున్నాడు. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతోనూ అలరిస్తున్నాడీ జబర్దస్త్ కమెడియన్.ఇంద్రజతోనూ మంచి బాండింగ్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చాడు ప్రవీణ్. ఇంద్రజను అమ్మలా భావిస్తుంటాడు ప్రవీణ్. ఇటీవల సింగిల్ లైఫ్ కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ప్రముఖ నటి, డ్యాన్సర్ కడెం వంశిత తో ప్రవీణ్ వివాహం గ్రాండ్ గా జరిగింది. అయితే, తాజాగా ఓ టాక్ షోలో ప్రేమ, పెళ్లి అంటే భయమేస్తోందంటు షాకింగ్ కామెంట్స్ చేశారు.

కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పటాస్ ప్రవీణ్ తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత, వృత్తి జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న ఆయన, పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు రావడంతో ఈ ఇంటర్వ్యూ హాట్ టాపిక్‌గా మారింది. మొదటగా తన పెళ్లి గురించి మాట్లాడిన ప్రవీణ్, "నా భార్య చాలా అర్థం చేసుకునే వ్యక్తి. నా జీవితంలోకి రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పారు.

Pataas Praveen Opens Up on Marriage Struggles Industry Reality amp amp Shocking Love Fears

ప్రస్తుతం తన కెరీర్ విషయానికి వస్తే, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాటు కొన్ని ఈవెంట్స్, సినిమా ప్రాజెక్టుల్లో కూడా పాల్గొంటున్నానని తెలిపారు. ఇదే సమయంలో యాంకర్ వర్షాను హీరోగా ఎప్పుడు చూస్తాం అని ప్రశ్నించగా, "హీరోగా ఛాన్స్ వస్తే నిన్నే హీరోయిన్‌గా తీసుకుంటా" అంటూ సరదాగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

అయితే ఇంటర్వ్యూలో ప్రవీణ్ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని కూడా బయటపెట్టారు. ఓ సీరియల్ షూటింగ్ సమయంలో కో-డైరెక్టర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించారు. "నటుడిగా కనీస గౌరవం ఇవ్వకుండా అందరి ముందూ వెటకారంగా మాట్లాడాడు. కుర్చీలో కూర్చొని ఆర్డర్లు ఇవ్వడం, ఎండలో నిలబెట్టడం వంటి విషయాలు చాలా బాధించాయి" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, తొమ్మిదేళ్లుగా ఈ రంగంలో ఉన్నానని, కానీ మధ్యలో వ్యక్తిగత సమస్యలు తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని తెలిపారు. ముఖ్యంగా తన తండ్రి తీసుకున్న బాధ్యతల కారణంగా వచ్చిన ఆర్థిక సమస్యలను తానే తీర్చాల్సి వచ్చిందని చెప్పారు. "వాటిని వదిలేయొచ్చు, కానీ మా నాన్న పేరు చెడకూడదనే ఆలోచనతోనే ఆ బాధ్యత తీసుకున్నాను" అని వెల్లడించారు. సమాజంపై కూడా ప్రవీణ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. "ఈ రోజుల్లో మనిషి విలువ కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరికి మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. ఉన్నంత కాలం అందరితో మంచిగా ఉండటం ముఖ్యం" అని అన్నారు.

ప్రేమ, పెళ్లి విషయాలపై కూడా ఆయన స్పందించారు. ఇటీవలి ఘటనలను ప్రస్తావిస్తూ, "ఇప్పటి పరిస్థితులు చూస్తే ప్రేమ, పెళ్లి అనే విషయాలే భయంకరంగా అనిపిస్తున్నాయి. చిన్న విషయాలకు కూడా తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. చట్టంపై భయం తగ్గిపోవడం కూడా ఇలాంటి ఘటనలకు కారణం" అని అభిప్రాయపడ్డారు. ఇలా పటాస్ ప్రవీణ్ తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, ఇండస్ట్రీలోని పరిస్థితులు, సమాజంపై తన అభిప్రాయాలను నిజాయితీగా పంచుకోవడం ఈ ఇంటర్వ్యూను ప్రత్యేకంగా మార్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X