అమ్మాయితో అడ్డంగా దొరికిన జబర్ధస్త్ నూకరాజు: బొ*, ము* అంటూ బూతులు.. ఆసియాకు షాక్ ఇచ్చాడుగా!

తెలుగు బుల్లితెరపైకి గతంలో కంటే ఇప్పుడు ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో చాలా మంది టీవీ రంగంలోకి వచ్చి ఫుల్ పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో నూకరాజు ఒకడు.

జబర్ధస్త్‌లో టీమ్ లీడర్‌గా సందడి చేస్తోన్న అతడు.. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. అదే సమయంలో ప్రియురాలు ఆసియాతోనూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా నూకరాజు మరో అమ్మాయితో అడ్డంగా దొరికిపోయాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!

Patas Asia Prank Video On Jabardasth Nookaraju Gone Fail

అలా వచ్చి ఫుల్ ఫేమస్: తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ తర్వాత అంతటి ఆదరణను అందుకున్న షోనే 'పటాస్'. స్టాండప్ కామెడీ షోగా వచ్చిన దీని ద్వారానే నూకరాజు బుల్లితెరపైకి వచ్చాడు. చాలా చిన్న వయసులోనే అదిరిపోయే టాలెంట్‌తో ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. అందులో బెస్ట్ కమెడియన్‌గా నిలిచాడు. ఫలితంగా ఎనలేని గుర్తింపును అందుకుని ఫుల్ ఫేమస్ అయిపోయాడు.

Patas Asia Prank Video On Jabardasth Nookaraju Gone Fail

జబర్ధస్త్‌ షోతో మరింతగా: చాలా ఏళ్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితం 'పటాస్' షోను లాక్‌డౌన్ నుంచి నిలిపివేశారు. దీంతో నూకరాజు జబర్ధస్త్‌ షోలోకి అడుగు పెట్టాడు. ఇక్కడ హేమాహేమీ కమెడియన్లతో పాటు పని చేసిన అతడు.. తనదైన శైలి కామెడీతో ఆకట్టుకున్నాడు. తద్వారా ఇందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు.

టీమ్ లీడర్‌గా మారాడు: జబర్ధస్త్‌ షోలో చేయడం వల్ల నూకరాజు మరింతగా పాపులర్ అయిపోయాడు. ఇందులోకి సాదాసీదా ఆర్టిస్టుగా వచ్చిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే సెకెండ్ లీడ్‌గా ఎదిగాడు. గెటప్ శ్రీను తర్వాత పలు విధాలుగా గెటప్‌లు వేస్తూ.. అన్ని రకాల హవాభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు టీమ్ లీడర్‌గానూ మారి సత్తా చాటుతున్నాడు.

Patas Asia Prank Video On Jabardasth Nookaraju Gone Fail

ఆసియాతో లవ్ ట్రాకు: తెలుగు బుల్లితెరపై కమెడియన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న నూకరాజు.. 'పటాస్' షోలో చేస్తోన్న సమయం నుంచి లేడీ కమెడియన్ ఆసియాతో లవ్ ట్రాకును నడుపుతున్నాడు. ఇప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట కలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. అలా ఇద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలను కూడా చేస్తూ అలరిస్తున్నారు.

నూకరాజుపైన ప్రాంక్: సాధారణ కమెడియన్‌గా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన నూకరాజు ఇప్పుడు టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిపోయాడు. దీంతో అతడికి క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నూకరాజు పైన అతడి ప్రేయసి ఆసియా ఓ ప్రాంక్ వీడియో చేసింది. అతడికి ఓ అమ్మాయితో ఎఫైర్ ఉందని కలరింగ్ ఇస్తూ ఏడిపించాలని ఆ వీడియోలో విశ్వప్రయత్నాలు చేసింది.

Patas Asia Prank Video On Jabardasth Nookaraju Gone Fail

నిజంగానే అమ్మాయి: ముందుగా ప్లాన్ చేసినట్లుగానే వేరే అమ్మాయితో నూకరాజుకు అఫైర్ ఉందని ఆసియా ఆరోపించింది. మొదట దీనికి ఒప్పుకోని అతడు.. ఆ తర్వాత 'అవును.. నిజంగానే ఓ అమ్మాయి పరిచయం అయింది. తనను కలిశాను' అని చెప్పి షాకిచ్చాడు. దీంతో ఆసియా కోప్పడుతూ 'నీ బొచ్చులో రింగు' అంటూ విసిరేసింది. అప్పుడు నూకరాజు కూడా బూతులు మాట్లాడాడు.

బిగ్ ట్విస్ట్ ఇచ్చాడుగా: నూకరాజు అమ్మాయి గురించి చెప్పే సరికి ఆసియా 'నేనేదో సరదాగా నిన్ను ఏడిపిద్దామని అడిగితే నువ్వు నిజంగానే దొరికిపోయావు. నీ అంత ఫాల్త్, బేకార్ గాడు ఎవడూ లేడు. నువ్వు నాకు వద్దు' అంటూ ఏడ్చేసింది. అప్పుడే నూకరాజు 'నువ్వు ప్రాంక్ చేస్తున్నావని నాకు తెలుసు. అందుకే అబద్ధం చెప్పా' అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X