Patas Faima: ప్రవీణ్‌తో పటాస్ ఫైమా పెళ్లి... సీక్రెట్‌గా రిజిస్టర్ ఆఫీసులో..

పటాస్ కార్యక్రమం ద్వారా తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టి తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఫైమా. జబర్తస్ద్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు బిగ్‌బాస్‌లోనూ సత్తా చాటిన ఫైమా.. ప్రవీణ్ అనే కుర్రాడితో 9 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఆమె తన ప్రేమాయణానికి ముగింపు పలికి ప్రవీణ్‌తో ఒక్కటయ్యారు. ఈ మేరకు ప్రవీణ్ తాను పెళ్లి చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టి షాకిచ్చింది ఫైమా.

జూన్ 23న అత్యంత సన్నిహితుల మధ్య ప్రవీణ్ నాయక్- ఫైమాలు నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని దండలు మార్చుకున్నారు. కొందరు మమ్మల్ని అవమానించారు, విమర్శించారు.. విడదీయాలని ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకిని ఎదిరించి నిలబడింది. ఈ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు. వదిలేయడానికి 1000 కారణాలున్నా.. మేమిద్దరం ప్రతిరోజూ ఒకరినొకరం ఎంచుకున్నాం. ఎట్టకేలకు ఈరోజు భార్యాభర్తలం అయ్యామని ఫైమా ఎమోషనల్ అయ్యారు.

Patas Faima Gets Married with Long-Time Boyfriend Praveen Nayak

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. పటాస్ ఫైమా - ప్రవీణ్ నాయక్ దంపతులకు అభిమానులు, బుల్లితర ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ, ప్రియాంక జైన్.. జబర్దస్త్ సత్యశ్రీ, పవన్, హర్షిత్‌లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఫైమా పెళ్లికి అంగీకరించారా? లేదా? సీక్రెట్‌గా ఫైమా- ప్రవీణ్‌లు ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్‌ చేసుకున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

తెలంగాణలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఫైమా షేక్ .. తను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఈటీవీలో ప్లస్‌లో ప్రసారమైన పటాస్ కార్యక్రమానికి ఓ రోజున చూడటానికి వచ్చింది. ఈ సందర్భంగా యాంకర్లు శ్రీముఖి- రవిలు ఇచ్చిన ఓ ఫన్నీ టాస్క్‌ని అద్భుతంగా చేసింది ఫైమా. ఈ వీడియో బాగా వైరల్ కావడంతో పటాస్‌ షోలో పాల్గొనాల్సిందిగా ఫైమాకు ఆఫర్ వచ్చింది. తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో పట్టుబట్టి మరి పటాస్ షోకు వచ్చింది ఫైమా.

పటాస్ షోలో ప్రవీణ్‌తో కలిసి ఫైమా చేసిన అల్లరి ప్రేక్షకులను అలరించింది. ఆమెలోని టాలెంట్‌ను గుర్తించిన నిర్వాహకులు మరింత ప్రోత్సహించి జబర్దస్త్‌లోకి పంపారు. అక్కడ బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది తదితర టీమ్ లీడర్ల దగ్గర పనిచేసి మరింత పేరు సంపాదించింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఈటీవీలో ప్రసారమైన పలు షోలలో తన పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించింది. అందంగా లేకపోయినా కేవలం తన టాలెంట్‌ను నమ్ముకుని ఈ స్థాయికి చేరుకుంది.

ఈ ఫేమ్‌తో తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి అక్కడ 10 వారాలు హౌస్‌లో సందడి చేసింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను సొంతిల్లు కట్టుకోవడమే తన కల అని బిగ్‌బాస్‌లో చెప్పింది. ఎంతో కష్టపడి ఆ లక్ష్యాన్ని కూడా సాధించి.. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. పటాస్‌లో తనతో పాటు చేసిన ప్రవీణ్‌తో ఫైమా ప్రేమాయణం సాగిస్తోందని గాసిప్స్ వచ్చాయి. అయితే నా బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ప్రవీణే అని.. దాంతో వాళ్లిద్దరూ ఒక్కరే అనుకున్నారని అసలు విషయం చెప్పి పుకార్లకు చెక్ పెట్టింది ఫైమా. ఇటీవల ప్రవీణ్ కూడా తన ప్రియురాలు వంశితను పెళ్లాడారు.. రోజులు గడవకుండానే ఫైమా కూడా తన 9 ఏళ్ల ప్రేమాయణానికి చెక్ పెడుతూ ప్రవీణ్‌ని పెళ్లి చేసుకుంది.

Read more about: praveen jabardasth faima
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X