నువ్వు వస్తే.. పక్కనే నలగదు.. అది నలుగుతుందా? ఫైమా షాకింగ్ కామెంట్స్

దశాబ్థాలుగా తెలుగువారికి వినోదం పంచుతోన్న జబర్దస్త్ కామెడీ షో .. కొత్త కొత్త టాస్క్‌లు, కంటెస్టెంట్స్‌తో నేటికీ సత్తా చాటుతోంది. యాంకర్లు, కంటెస్టెంట్స్, జడ్జిలు మారినా వినోదం మాత్రం మారలేదని అంటోంది జబర్దస్త్. మనసును రీఛార్జ్ చేసుకోవడానికి ఇప్పటికీ జబర్దస్త్ పాత వీడియోలు చూసేవారు ఎందరో. ఈటీవీతో పాటు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో టాప్ రేటింగ్ వచ్చే షోగా జబర్దస్త్ తన హవాను కంటిన్యూ చేస్తోంది.

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమోను రిలీజ్ చేసింది ఈటీవీ. ఇందులో ఏ పంచులు బాగా పేలాయి? ఎవరు ఎలా చేశారు? ఏమేం ట్విస్ట్‌లు ఉన్నాయి? ఒకసారి పరిశీలిస్తే. ప్రస్తుతం ఈ పాపులర్ కామెడీ షోకు జడ్జిలుగా ఖుష్బూ, శివాజీలు వ్యవహరిస్తున్నారు. తమ పంచ్‌లు, ప్రాసలు, టైమింగ్‌తో వీరు కూడా జబర్దస్త్ షోను బాగానే నడిపిస్తున్నారు. ముఖ్యంగా శివాజీ తన మార్క్ సెటైర్లతో బాగా అలరిస్తున్నారు. మరి ఊరనాటుగా మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నా.. జనం ఆయనను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారని చెబుతున్నారు.

patas faima satires on potti naresh goes viral in Jabardasth show host by rashmi gautham

ఇమ్మాన్యుయేల్ , వర్ష , పండ్‌లు స్కిట్ చేయడానికి వస్తారు. తండేల్ స్పూఫ్ చేసినట్లుగా వారి గెటప్ చూస్తే అర్ధమవుతుంది. నేను సాయిపల్లవిని అని ఓ అమ్మాయి చెప్పగా.. నువ్వు సాయిపల్లవి కాదు పంది పిల్లవి అంటాడు ఇమ్మాన్యుయేల్. మరి నువ్వు బర్రె పిల్లనా అంటూ రష్మీ సెటైర్ వేస్తుంది. దీంతో అంతా నవ్వేస్తారు. అనంతరం ఇమ్మాన్యుయేల్ పడవ నడుపుతుండగా వర్ష- పండులు వచ్చి లిఫ్ట్ అడుగుతారు. ఇదేమైనా లారీ అనుకున్నావా? ఏం చేశారొచ్చారు అని ప్రశ్నిస్తాడు ఇమ్మాన్యుయేల్.

దాంతో వర్ష నేను చెబుతానంటూ లేచి ఇమ్మాన్యుయేల్‌ని అన్నయ్యగారు అని పిలుస్తుంది. దాంతో మండిపడిన ఇమ్మాన్యుయేల్ చేతిలో ఉన్న తెడ్డును తీసుకుని ఎవడే నీకు అన్నయ్య అని కొట్టబోతాడు. కాసేపటికీ ఆటోరామ్ ప్రసాద్- ఇమ్మాన్యుయేల్‌లు ఎంట్రీ ఇస్తారు. తమ్ముడు .. మీ ఆవిడ పేపర్ వాడితో చాలా సార్లు అని చెప్పబోతూ ఆగుతాడు రామ్ ప్రసాద్.. ఏం చేసిందని ఇమ్మాన్యుయేల్ అడగ్గా పేపర్ తీసుకుందని అంటాడు. ఆ వెంటనే పాల వాడొచ్చి పాలు పోస్తుండగా ఇవి నిజంగానే ఒరిజినల్ పాలా? అని అడుగుతాడు రామ్ ప్రసాద్. అమ్మతోడు తోడేస్తే పెరుగు అవుతుందని చెబుతాడు పాలవాడు. దీంతో అమ్మతోడు అంటాడు రామ్ ప్రసాద్.. ఏది పెరుగు అవ్వలేదుగా అని రామ్ ప్రసాద్ పంచ్ విసరడంతో అంతా నవ్వేస్తారు.

patas faima satires on potti naresh goes viral in Jabardasth show host by rashmi gautham

ఇక ఈ వారం ప్రోమోలో పటాస్ ఫైమా - పొట్టి నరేష్ జోడీ ఇరగదీసినట్లుగా కనిపిస్తోంది. మామూలుగానే కొంచెం ఛాన్స్ దొరికితేనే ఫైమా రెచ్చిపోతుంది. అలాంటిది సరైన స్కిట్ పడితే ఆమెను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నది ఎన్నోసార్లు రుజువైంది. జబర్దస్త్‌లో మేల్ కమెడియన్స్‌కు ధీటుగా నవ్విస్తూ దూసుకెళ్తున్నారు ఫైమా. ముఖ్యంగా ఆమె కామెడీ టైమింగ్ సూపర్బ్ అని చెప్పొచ్చు. డైలాగ్ డెలివరీ, చిత్ర విచిత్రంగా ఉండే భాష, మేనరిజం ఫైమాను ఎక్కడో నిలబెట్టాయి.

పొట్టి నరేష్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఏవండి మిమ్మల్ని చూస్తుంటే పీలింగ్స్ వస్తున్నాయని చెబుతుంది. వద్దే చొక్కా నలుగుద్దీ అని నరేష్ అనగా.. మీరొస్తే పక్కనే నలగదు, చొక్కా ఎలా నలుగుతుందని పంచ్ విసరడంతో అంతా నవ్వేస్తారు. మరి ఈ షోలో పూర్తి పంచ్‌లు, డైలాగ్స్ తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: rashmi gautham
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X