ఫైమాతో బ్రేకప్.. కొత్త లవర్‌తో పటాస్ ప్రవీణ్ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్

జబర్దస్త్, పటాస్ కార్యక్రమాల ద్వారా పాపులర్ అయిన నటుడు ప్రవీణ్. ఫైమాతో ఇతను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇదే సమయంలో వీరిద్దర ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. ఫైమా- ప్రవీణ్ బంధం తెగిపోయింది. ఇద్దరూ ఎవరికి వారే అయిపోయారు. తాజాగా ప్రవీణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
బాలయ్యకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్? కొరటాల ప్లానింగ్ అదిరిపోయిందిగా!
బాలయ్యకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్? కొరటాల ప్లానింగ్ అదిరిపోయిందిగా!

పటాష్ షోలో ప్రవీణ్‌తో కలిసి స్కిట్లు చేస్తూ పాపులర్ అయ్యారు ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చి లేడీ కమెడియన్‌గా సత్తా చాటింది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన మరింత పాపులర్ అయ్యింది. అయితే ఫైమాతో ప్రవీణ్‌ క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఫైమాకు పటాస్ ప్రవీణ్ కంటే ముందే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు కూడా ప్రవీణ్ కావడంతో జనాలు కన్‌ఫ్యూజ్ అయ్యారు.

Patas Praveen Gets Engaged to Kadam Vamshitha Amid Breakup Rumors with Faima

ప్రవీణ్ తన జీవితంలోకి వచ్చాక పటాస్ ప్రవీణ్‌తో దూరం పెరిగిందని, అతనితో వీడియోలు కూడా చేయడం లేదని టాక్ నడిచించింది. దీనికి ఫైమా ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వచ్చింది. ఇద్దరూ ప్రవీణ్‌లు వేర్వేరని చెబితే జనాలు ఏమనుకుంటారోనని టైం తీసుకుని ప్రవీణ్ ఎవరో రివీల్ చేయాల్సి వచ్చిందని ఫైమా ఓ ఇంటర్వ్యలో తెలిపారు. ప్రవీణ్- నేను అంతపెద్ద సెలబ్రిటీలం కూడా కాదు. మాకు పెద్ద పేమెంట్స్ కూడా రావు. వాడి యూట్యూబ్ ఛానెల్‌లో నేను.. నా ఛానెల్‌లో వాడు ఇద్దరం వీడియోలు చేశాం. ఆల్రెడీ ప్రవీణ్‌తో జోడీ కనెక్ట్ అయినప్పుడు.. నా లవర్ ప్రవీణ్‌ని పరిచయం చేయలేకపోయానని ఫైమా పేర్కొన్నారు.

Recommended For You
ఆ ప్రేమ చచ్చిపోయింది.. ప్రాణంగా ప్రేమిస్తే అలాంటి గతి... బిగ్‌బాస్ స్టార్ ఎమోషనల్
ఆ ప్రేమ చచ్చిపోయింది.. ప్రాణంగా ప్రేమిస్తే అలాంటి గతి... బిగ్‌బాస్ స్టార్ ఎమోషనల్

ఫైమా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలతో పాటు ప్రైవేట్ ఈవెంట్స్‌తో సెలబ్రిటీగా ఎంజాయ్ చేస్తోంది. ప్రవీణ్ కూడా జబర్దస్త్ ఇతర కార్యక్రమాలతో సత్తా చాటుతున్నాడు. ఇద్దరి మధ్యా గతంలో ఉన్నంత రెపో ఉండటం లేదని నెటిజన్లు పలుమార్లు కామెంట్స్ పెట్టారు కూడా. ఎవరి జీవితంలో వాళ్లు బిజీ అయ్యామని ఫైమా దీనికి వివరణ ఇచ్చింది. ఇక ఫైమా తన ప్రియుడు ప్రవీణ్‌ను పెళ్లాడే పనిలో ఉంది.. అయితే ప్రస్తుతానికి కెరీర్‌పైనే ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. అయితే ప్రవీణ్ మాత్రం త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు.

You May Also Like
Patriot Day 5 Collections: దారుణంగా పడిపోయిన పేట్రియాట్‌ కలెక్షన్స్.. మోహన్‌లాల్- మమ్ముట్టి మూవీకి ఎంతంటే?
Patriot Day 5 Collections: దారుణంగా పడిపోయిన పేట్రియాట్‌ కలెక్షన్స్.. మోహన్‌లాల్- మమ్ముట్టి మూవీకి ఎంతంటే?

గత కొంతకాలంగా నటి, డ్యాన్సర్ కడం వంశితతో ప్రవీణ్ ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో పెళ్లికి సిద్దమవుతున్నాడు. దీనిలో భాగంగా ప్రవీణ్- వంశితలు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్ధం చాలా సింపుల్‌గా జరిగిపోయింది. ప్రవీణ్- వంశితల ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ బజర్దస్త్ జడ్జి ఇంద్రజ, యాంకర్ రష్మి గౌతమ్‌, నటుడు మహీధర్, సత్యశ్రీ, షబానాపాటు పలువురు వుల్లితెర ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. మరి ప్రవీణ్ ఎంగేజ్‌మెంట్‌పై ఫైమా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read more about: jabardasth patas praveen faima
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X