పూర్తి రిస్క్ : అనకొండ పొట్టలోకి వెళ్లి వచ్చాడు(వీడియో)

By Srikanya

హైదరాబాద్ : అంతరించిపోతున్న అడవులపై అవగాహన కల్పించడానికి.. ప్రాణాల్నే పణంగా పెట్టాలనుకున్నాడు. అనకొండ పొట్టలోకెళ్లి.. సజీవంగా బయటకు వచ్చాడు. ప్రకృతి ప్రేమికుడు పాల్‌ రోసోలీ చేసిన ఈ సాహస కార్యం మొత్తం వీడియో తీసి ప్రముఖ ఛానల్‌ డిస్కవరీ ప్రసారం చేయబోతోంది. ఈ సాహసానికి సంబంధించిన వివరాలన్నీ పాల్‌ మాటల్లోనే..

పాల్ మాట్లాడుతూ... 'అంతరించిపోతున్న సతత హరితారణ్యాలపై అవగాహన కల్పించాలనుకున్నా.. అందరి దృష్టినీ అటువైపు మరల్చాలనుకున్నా. అందుకే పాము పొట్టలోకి వెళ్లే ధైర్యం చేశా. ప్రత్యేకంగా రూపొందించిన ఫైబర్‌ సూట్‌ని తెప్పించుకున్నా. అమెజాన్‌ అడవుల్లో ఈ సాహసానికి అనువైన అనకొండ కోసం గాలించా. అందుకు 60 రోజులు సమయం పట్టింది. 20 అడుగుల పొడవున్న ఒక అనకొండ కనిపించింది.

Paul Rosolie calls off 'Enter the Anaconda' stunt after 1 hour

ఇక సాహసానికి సిద్ధపడ్డా. ప్రాణాలతో చెలగాటమే... ఏదైనా పొరపాటు జరిగితే..? ఆ వూహ నన్ను కొంచెం భయపెట్టింది. ఫైబర్‌ సూట్‌ ధరించి ధైర్యంగా ముందడుగేశా. కొండచిలువ నోట్లో తలపెట్టా. తిన్నగా దాని పొట్టలోకి వెళ్లి ఒక గంటపాటు ఉండిపోయా. అక్కడినుంచి బయటివారితో మాట్లాడే ఏర్పాటు చేసుకుని మరీ వెళ్లాననుకోండి.. మొత్తానికి క్షేమంగా బయటకు వచ్చేశా'' అంటూ తన అనుభవాన్ని వివరించాడు.

అయితే ఆ అనకొండ పొట్టనుంచి బయటికి ఎలా వచ్చాడనే విషయాన్ని మాత్రం పాల్‌ వెల్లడించలేదు. పాము కూడా క్షేమంగా ఉందని పాల్‌ తెలిపాడు. ఈ మొత్తం వీడియోను డిస్కవరీ ఛానల్‌ ప్రసారం చేయనుంది. అయితే పాల్‌ చర్యపై జంతుప్రేమికులు ఇప్పటికే ఆందోళన చేపట్టారు. ఇది జంతువుల హక్కులను కాలరాయడమేనని పీటా తదితర సంస్థలు విమర్శిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X