Pavithra Jayaram Death: ఆఫర్ కోసం పడకగది.. లైంగిక వేధింపులు దాటుకొని స్టార్ యాక్టర్‌గా.. పవిత్ర జయరాం లైఫ్ జర్
తెలుగు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో పవిత్ర జయరాం ఒకరు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె మొట్టమొదటిసారి తెలుగులో నిన్నే పెళ్ళాడుతా అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా తన నటనతో అందరిని మెప్పించినటువంటి ఈమె ప్రస్తుతం త్రినయని అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే తాజాగా రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర ప్రాణాలు కోల్పోయారని విషయం తెలిసి బుల్లి తెర నటీనటులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఈమె కారులో ప్రయాణిస్తూ ఉండగా కర్నూలు సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారని తెలుస్తుంది. ఈమె ప్రయాణిస్తున్నటువంటి కారుకు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదం నేడు ఉదయం జరిగిందని సమాచారం. కన్నడలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ ఒక మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈమె మరణించారనే వార్త తెలియడంతో బుల్లితెర నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె రోడ్డు ప్రమాదంలో మరణించారు అనే విషయం మాత్రమే తెలుసు అయితే ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు ఈమె రోడ్డు మార్గంలో వెళ్లారు అనే విషయాలు గురించి మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇలా రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మరణించారు అనే వార్త అభిమానులకు కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలిగించింది.
ప్రస్తుతం ఈమె నటిస్తున్నటువంటి త్రినయని సీరియల్ ఎంతో అద్భుతమైనటువంటి రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది ఇక ఈ సీరియల్ కి భారీ స్థాయిలో అభిమానులు కూడా ఉన్నారని చెప్పాలి అయితే ఈ సీరియల్ నటి మరణించారని వార్త అభిమానులకు కూడా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

అయితే ఆమె నటిగా పాపులారిటిని సాధించడానికి ఎన్నో అడ్డంకులు, కష్టాలను అనుభవించింది. ఆరంభంలో ఆఫర్ కోసం పడక గదికి రమ్మని బలవంతం చేసిన సంఘటనలు, అలాగే షూటింగ్‌కు వెళితే.. భోజనం తప్ప ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వని పరిస్థితులను దాటుకొంటూ వచ్చి ఆమె తనకంటూ ఇమేజ్‌ను, అభిమానులను సొంతం చేసుకొన్నది. ఎన్నో అవరోధాలు ఆమె అద్బుతంగా రాణిస్తున్న సమయంలోనే మరణించడం అత్యంత బాధాకరంగా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కష్టాలను చెప్పుకొని ఆవేదన చెందింది. తాను అనుభవించిన కాస్టింగ్ కౌచ్ సంఘటనలను పవిత్ర జయరాం చెబుతూ నేటితరం వారు ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో రాణించడం, నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. కాబట్టి విలువలతో కూడిన ప్రొఫెషన్‌ను దృష్టిలో పెట్టుకోవాలి అని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూచించారు.


Click it and Unblock the Notifications











