twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishna Funeral: కృష్ణ అంతిమయాత్రలో పవిత్ర లోకేష్.. ప్రత్యేకంగా తీసుకెళ్లిన నరేష్!

    |

    సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన వార్త ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. సినిమా పరిశ్రమలో ఆయన ఎన్నో మర్చిపోలేని సరికొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టారు. ఆ విషయంలోనే చాలామంది కృష్ణను ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వ్యక్తి మృతి చెందడంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నివాళులర్పించారు. ఇక అంతిమయాత్రలో నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలో కూడా వైరల్ అవుతున్నాయి..

    తిరిగివస్తారు అనుకుంటే..

    తిరిగివస్తారు అనుకుంటే..

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఘట్టమనేని కృష్ణ 79 ఏళ్ల వయసులో మృతి చెందడం ఒక విధంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన తప్పకుండా హాస్పిటల్లో నుంచి తిరిగి నవ్వుతూ వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ గుండెపోటు కారణంగా మిగతా అవయవాలపై కూడా ప్రభావం పడటంతో ఆయన తనువు చాలించారు.

    సెలబ్రిటీల నివాళి

    సెలబ్రిటీల నివాళి

    ఇక కృష్ణ కు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అందరూ కూడా ప్రత్యేకంగా నివాళులర్పించారు. చాలాకాలం తర్వాత ఒక స్టార్ హీరో కోసం తెలుగు చిత్ర పరిశ్రమలో నుంచి దాదాపు అందరూ నటీనటులు దర్శకులు ఘనంగా నివాళులర్పించారు. అంటే ఆయన ఇండస్ట్రీలో ఎంత సన్నిహితంగా మంచితనంతో మెలిగారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    అంతిమయాత్రలో అభిమానులు

    అంతిమయాత్రలో అభిమానులు

    ఇక బుధవారం రోజు ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. అయితే మొదట అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారి పార్థివ దేహాన్ని ఉంచిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత పద్మలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది ఈ అంతిమయాత్రలో ప్రముఖ సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులు పాల్గొన్నారు.

    అంతిమయాత్రలో పవిత్ర

    అంతిమయాత్రలో పవిత్ర

    ఇక ప్రముఖ నటి పవిత్ర లోకేష్ కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. నరేష్ ఆమెను ప్రత్యేకంగా తీసుకువెళ్లిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కృష్ణ మరణ వార్త తెలుసుకోగానే నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కూడా కృష్ణ గారి ఇంటికి చేరుకున్నారు. మొదట వారు కృష్ణగారి పార్థివదేహానికి ప్రత్యేకంగా వారు నివాళులర్పించారు.

    సూపర్ స్టార్ కన్నీటి వీడ్కోలు

    సూపర్ స్టార్ కన్నీటి వీడ్కోలు

    ఇక మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ బాబు హిందూ ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పంటించారు. ఒక విధంగా మహేష్ బాబు తండ్రికి ఆ విధంగా వీడ్కోలు పలికినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితమే తల్లిని కోల్పోయిన మహేష్ ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయే మరింత కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక మహేష్ బాబును చూస్తున్న అభిమానులు కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతున్నారు.

    English summary
    Pavitra lokesh and actor naresh attend in super star krishna final journey
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X