twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టేజీపై పవన్ కళ్యాణ్...అదిరిందంతే!!!(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజే వేరు. అందుకే ఆయన ఎక్కడికయినా ఫంక్షన్స్ కు వస్తే కంట్రోలు చేయటం కష్టం. కాబట్టి ఆయన అరుదుగా పంక్షన్స్ కు వస్తూంటారు. రీసెంట్ గా ఆయన ఈటీవి 20 సంవత్సరాల పంక్షన్ కు ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఫంక్షన్ ఫొటోలు ఈ రోజు మీ కోసం..

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఎంత బిజీగా ఉన్న పవన్ తనను అబిమానంగా పిలిచినవారి మాట కాదనలేరు. అందులోనూ పిలిచింది వేరే ఎవరో కాదు రామోజీరావు. ఈటీవి,ఈనాడు సామ్రాజ్యాధిపతి. ఆయన తను స్ధాపించిన సంస్ద ఇరవై సంవత్సరాల వేడుకకు గౌరవంగా పిలిచి సంత్సరించారు. అబిమానంగా పవన్ హాజరయ్యారు. ఈ ఫంక్షన్ ఈ మధ్యన జరిగిందే. అందుకే గెడ్డంతో ఆయన కనిపిస్తారు.

    కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కోదండరామిరెడ్డి, త్రివిక్రమ్‌, క్రిష్‌.. నటులు కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్‌, జయసుధ, రాధిక, మురళీమోహన్‌, గొల్లపూడి మారుతీరావు, సాయికుమార్‌, అలీ, శుభలేఖ సుధాకర్‌, సునీల్‌, మంచు లక్ష్మీప్రసన్న, యమున, శివాజీరాజా.. ప్రముఖ నిర్మాతలు శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ గీత రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, జొన్నవిత్తుల.. సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్‌, వాసూరావు, మాధవపెద్ది సురేష్‌ తదితరులు హాజరయ్యారు.

    ఎంతో ఆహ్లదంగా, కన్నుల పండుగగా, వినోదాల వల్లరిగా జరిగిన ఈ కార్యక్రమం 'ఈటీవీ@20' పేరుతో ఈటీవి ప్రసారం కానుంది. నేటి నుంచి నాలుగు వారాలపాటు ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 వరకు ఈటీవీలో ప్రసారమవుతుంది.

    ఇక ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

    దాదాపు ఇరవైఏళ్లనాటికి

    దాదాపు ఇరవైఏళ్లనాటికి

    'ఈనాడు' గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనసులో రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన సంకల్పం... అదే 'ఈటీవీ'.

    అప్పటికల

    అప్పటికల

    'ఈటీవీ'అనే రామోజీరావు గారి కల ఆవిష్కృతమై ఈ రోజు మన కళ్ళముందు ఉంది.

    మొట్టమొదటి

    మొట్టమొదటి

    తెలుగులో మొట్టమొదటి 24 గంటల ప్రసారాల ఛానెల్‌గా ప్రారంభమైంది ఈటీవి.

    అందరి మనస్సులూ..

    అందరి మనస్సులూ..

    'ఈటీవీ మీటీవీ' అంటూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది.

    20 ఏళ్లు

    20 ఏళ్లు

    ఓ చిన్న ఝరిలా ప్రారంభమైన ఈటీవీ 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొంది.

    పండుగలా..

    పండుగలా..

    ఈ ఆనందాల సందర్భాన్ని రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీస్థాయిలో పండగలా నిర్వహించింది ఈటీవీ.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    చలనచిత్ర సీమకు చెందిన అతిరథ మహారథులు, బుల్లితెర నటులు, ఈటీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులు త్రివేణీ సంగమంలా విచ్చేసారు.

    వైభవంగా..

    వైభవంగా..

    ఈ సంబరాల ఉత్సవం ఆద్యంతం అంగరంగ వైభవంగా సాగింది.

    ముఖ్యంగా

    ముఖ్యంగా

    స్టేజీపై పవన్ కళ్యాణ్ కనపడటం అందరి ఆనందానికి కారణమైంది

    ఊహించనది

    ఊహించనది

    పవన్ కళ్యాణ్ ఇలా ఈటవీ స్టేజీపై కనపడతారని ఊహించలేదు

    రకరకాలుగా..

    రకరకాలుగా..

    పవన్ ఇలా రామోజీరావుగారి పంక్షన్ కి హాజరవటం ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ కు దారి తీసింది

    అంటూ

    అంటూ

    ఇది పొలిటికల్ గా తనకు రామౌజిరావుగారితో ఉన్న అవసరాల దృష్ట్యా అంటూ కొందరు

    అలాంటిదేం లేదు

    అలాంటిదేం లేదు

    కేవలం పవన్ తనను గౌరవింగా పిలిచిన ఓ మీడియా సంస్ధ కోసం వెళ్లారని ఆయన వర్గీయులు అంటున్నారు

    గెడ్డమే...

    గెడ్డమే...

    ఆ రోజు పంక్షన్ లో పవన్ గడ్డమే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది

    అందరినీ విష్ చేసి

    అందరినీ విష్ చేసి

    పవన్ అక్కడకు వచ్చిన పెద్ద,చిన్నా అనే తేడాలేకుండా పరిచయస్దులందరితో విష్ చేసి,కలిసారు.

    ఇప్పుడు గడ్డం తీసేసి

    ఇప్పుడు గడ్డం తీసేసి

    పవన్ ఇప్పుడు సర్దార్ కోసం గడ్డం తీసేసారు

    షూటింగ్ స్పాట్ లోది

    షూటింగ్ స్పాట్ లోది

    ఈ ఫొటో తాజాగా సర్దార్ షూటింగ్ స్పాట్ లోది,దర్శక,నిర్మాతలతో కలిసి తీసుకున్నది

    అదిరిన లుక్

    అదిరిన లుక్

    రీసెంట్ గా పవన్ డిజైన్ చేసి వదిలిన సర్ధార్ సినిమా పోస్టర్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది

    English summary
    Pawan Kalyan was surprised everyone by making his presence at an event in Ramoji Film City. Pawan Kalyan attended an ETV event for completing 20 years along with his friend Trivikram Srinivas who was invited by Ramoji Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X