For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కూతురితో అంత వీజీ కాదు: రవికి చుక్కలు చూపించిన ఆద్య.. ఈ చిన్నారికి ఇన్ని టాలెంట్లు ఉన్నాయా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటుంటాయి. అలాంటి వాటిలో జీ తెలుగులో ప్రసారం అయ్యే 'డ్రామా జూనియర్స్' షో ఒకటి. చిన్న పిల్లల్లో ఉన్న టాలెంట్‌లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మొదలైన ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇటీవలే మరో సీజన్‌ను ప్రారంభించారు. దీనికి ప్రముఖ నటి రేణు దేశాయ్ జడ్జ్‌గా వ్యవహరిస్తుండగా.. వచ్చే వారం ఎపిసోడ్‌కు ఆమె కుమార్తె (పవన్ కల్యాణ్ సంతానం) ఆద్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ‘డ్రామా జూనియర్స్' సూపర్ హిట్

  ‘డ్రామా జూనియర్స్' సూపర్ హిట్

  తెలుగులో వచ్చే ఎన్నో ప్రయోగాత్మకమైన షోలలో ‘డ్రామా జూనియర్స్' ఒకటి. అప్పుడెప్పుడో జీ తెలుగు చానెల్‌లో ఈ కార్యక్రమం మొదలైంది. దీని ద్వారా కామెడీ, ఎమోషన్స్ తదితర అంశాలతో స్కిట్లు చేస్తూ చిన్న పిల్లలు తమ టాలెంట్లను నిరూపించుకుంటున్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అందుకే ఈ షో ఏకంగా నాలుగు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది.

  ఐదో సీజన్ మొదలైంది.. డీటేల్స్

  ఐదో సీజన్ మొదలైంది.. డీటేల్స్

  నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' పేరిట ఐదో సీజన్‌ కూడా ఇటీవలే ప్రారంభం అయింది. దీనికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, సింగర్ సునీత, ఫేమస్ హీరోయిన్ రేణు దేశాయ్‌లు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి మొదట ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా చేయగా.. మూడో ఎపిసోడ్‌ నుంచి మాత్రం రవి వచ్చాడు.

  మంచి స్పందన... వ్యూస్‌ భారీగా

  మంచి స్పందన... వ్యూస్‌ భారీగా

  ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' షోకు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో యూట్యూబ్‌లో సైతం ఈ షో స్కిట్లకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా వీటికి అత్యధికంగా వ్యూస్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల వచ్చిన జూనియర్ బాలకృష్ణ స్కిట్‌తో పాటు సినీ ప్రముఖుల గాసిప్స్‌కు సంబంధించిన దానికి ఎక్కువ ఆదరణ లభించింది.

  మదర్స్ డే స్పెషల్.. ఆద్య ఎంట్రీ

  మదర్స్ డే స్పెషల్.. ఆద్య ఎంట్రీ

  వచ్చే ఆదివారం ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీంతో దీనిని ఎంతో స్పెషల్‌గా రూపొందించారు. ఇందులో భాగంగానే ఈ ఎపిసోడ్‌కు రేణు దేశాయ్ - పవన్ కల్యాణ్ దంపతుల కుమార్తె ఆద్య స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఆ చిన్నారిని బాగా హైలైట్ చేశారు షో నిర్వహకులు.

  రేణు గురించి ఆద్య ఎమోషనల్

  రేణు గురించి ఆద్య ఎమోషనల్

  ఈ ప్రోమోలో ‘వకీల్ సాబ్' బ్యాగ్రౌండ్ స్కోర్‌తో షోలోకి ఎంట్రీ ఇచ్చింది ఆద్య. ఆమె వస్తున్నప్పుడు రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. ఆ వెంటనే స్టేజ్‌పైకి వచ్చారామె. రావడం రావడమే ‘ఎప్పటికీ నువ్వు నా బెస్ట్ గిఫ్ట్. తను నన్ను అమ్మలా చూసుకుంది' అంటూ కూతురికి ముద్దు పెట్టారు. ఆ వెంటనే ఆద్య కూడా ‘మై మమ్మీ ఈజ్ బెస్ట్ మామ్ ఎవర్' అంటూ చేసిన కామెంట్ ఆకట్టుకుంటోంది.

  టాలెంట్లను బయట పెట్టిన ఆద్య

  టాలెంట్లను బయట పెట్టిన ఆద్య

  ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' జడ్జ్‌ సింగర్ సునీత ‘ఇప్పుడు ఆద్య మన కోసం ఓ పాట పాడుతుంది' అని అన్నారు. దీంతో వెంటనే ఆ చిన్నారి ఓ హిందీ పాటను ఆలపించింది. తర్వాత సునీతతో కలిసి గొంతు కలిపింది. అలాగే, ఎస్వీ కృష్ణా రెడ్డి ఓ డైలాగ్ చెప్పమనగా ‘నాకు నచ్చేవి రెండే రెండు. ఒకటి మంచి నిద్ర.. రెండు మా అమ్మ' అని ఆద్య ఎమోషనల్ డైలాగ్ చెప్పింది.

  Ys Jagan పై మూవీ ఉంటుంది, Pawan Kalyan ని హ్యాండిల్ చెయ్యలేను - RGV || Filmibeat Telugu
  యాంకర్ రవికి పంచ్ వేసేసింది

  యాంకర్ రవికి పంచ్ వేసేసింది

  ఇక, ఇదే ప్రోమోలో యాంకర్ రవి మాట్లాడుతూ.. ‘నా గురించి నేనే ఇంట్రడక్షన్ ఇస్తా. నా పేరు రవి. నేను ఇక్కడ హోస్టును' అన్నాడు. వెంటనే సునీత కలగజేసుకుని ‘మీ అమ్మను రవి అక్క అని పిలుస్తాడు. కాబట్టి నువ్వు రవి మామ అని పిలువు' అని చెప్పింది. కానీ, వెంటనే ఆద్య ‘మీరు మామయ్య కాదు.. తాతయ్య' అంటూ అదిరిపోయే పంచ్ వేసింది. దీంతో రవి ముఖం మాడిపోయింది.

  English summary
  Here is this week's promo of Drama Juniors - The Next Superstar ft, Aadya for the first time on tv alongside Renu Desai, Sunitha & Director SV Krishna Reddy. Drama Juniors - The Next Superstar will be anchored by Ravi and will be telecasted every Sunday at 8 PM only on Zee Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X