వివాదంలో యాంకర్ స్రవంతి: ఆ సినిమాపై ఇన్‌స్టాలో పోస్ట్.. పవన్ కల్యాణ్‌ను లాగుతూ ఘోరంగా!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత గతంలో కంటే ఇప్పుడు ఎంతో మంది తెలుగు అమ్మాయిలు సెన్సేషన్‌గా మారారు. తద్వారా బుల్లితెర మీదనో, వెండితెరపైనో అవకాశాలను దక్కించుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో రాయలసీమ చిన్నది యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం నుంచే ఇండస్ట్రీలో ఉన్నా.. సోషల్ మీడియా ద్వారానే ఈ సుందరాంగి హైలైట్ అయింది. తద్వారా క్రేజ్‌ను కూడా పెంచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా స్రవంతి చేసిన ఓ పోస్ట్ ఆమెను వివాదంలోకి నెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసమే!
యాంకర్‌గా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న స్రవంతి చోకారపు.. ఈ మధ్య కాలంలో తనదైన రీతిలో ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కథతో వచ్చిన 'యాత్ర 2'పై పోస్ట్ చేసింది.

తాజాగా యాంకర్ స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఇప్పుడే యాత్ర 2 సినిమాను చూశాను. ఇంత మొండోడివి ఏంటి జగన్ అన్నా. మీరు కూడా యాత్ర 2 సినిమా చూసి జగన్ అన్న మొండితనాన్ని, ఆయన ధైర్యాన్ని, గెలుపును ఎక్స్పీరియన్స్ చేయండి' అని పోస్ట్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేసి.. అందులో సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడింది.

స్రవంతి చోకారపు చేసిన ఈ పోస్టుపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. దీనికి కారణం గతంలో ఆమె పవర్ స్టార్‌కు వీరాభిమానిని అని చెప్పుకోవడమే. అంతేకాదు, తన కొడుకుకు కూడా పవన్ కుమారుడి పేరు అకీరా అని పెట్టుకున్నానని స్రవంతి పలుమార్లు చెప్పింది. అలాంటి ఆమె ఇప్పుడు జగన్‌కు సపోర్టుగా పోస్ట్ చేయడంతో వాళ్లు ట్రోల్ చేస్తున్నారు.

స్రవంతి చోకారపు యాత్ర 2, వైఎస్ జగన్‌పై చేసిన పోస్టుపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'నిన్ను సక్సెస్‌ఫుల్‌గా అన్‌ఫాలో అయ్యాను', 'పేటిఎం డబ్బులు నీకు కూడా పడ్డాయా', 'మనీ కావాలంటే డైరెక్టుగా అడగాలి కదా', 'పక్క స్టేట్‌లో బతికితే ఎలా ఉంటుందో నీకేం తెలుసు? నువ్వు బట్టలు విప్పితే డబ్బులు ఇస్తారు. మేము ఇప్పితే ఎవడు చూసేది' అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

మొత్తంగా అప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా అభిమానుల సపోర్ట్ కోసం పవన్ కల్యాణ్ పేరును వాడుకుని, ఇప్పుడు జగన్‌కు మద్దతు తెలుపుతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ స్రవంతిపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











