ఉత్తమ భర్తకు పవన్ కల్యాణ్ తల్లి అరుదైన గిఫ్ట్.. యువ నటుడి టాలెంట్‌ను మెచ్చిన మెగా మదర్

ఏడాది కాలంగా ఉత్తమ ప్రతిభను చాటిన టెలివిజన్ నటీనటులను స్టార్ మా పరివార్ అవార్డులతో ఇటీవల సత్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ హీరోలు, బుల్లితెర యాక్టర్లు హాజరయ్యారు. నాగార్జున దంపతులు, మంచు లక్ష్మీ, రాఘవేంద్రరావు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ భర్తగా అవార్డు అందుకొన్న కార్తీక్ తన స్పందనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు లభించిన బహుమతి గురించి చెబుతూ సంతోషంలో మునిగిపోయారు. ఇంతకు కార్తీక్‌కు లభించిన బహుమతి ఏమిటంటే..

 బుల్లితెర మీద అశేష ప్రజాదరణతో

బుల్లితెర మీద అశేష ప్రజాదరణతో

బుల్లితెర మీద అశేష ప్రేక్షకాదరణతో ఆకట్టుకొంటున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిన కళాకారులు చాలానే ఉన్నారు. ఈ చిత్రంలో భర్త పాత్రలో కార్తీక్ మెరిసిపోయారు. ఈ సందర్భంగా మా పరివార్ అవార్డులకు ఎంపికైన కార్తీక్ ఉత్తమ భర్తగా అవార్డు అందుకొన్నారు.

ఉత్తమ భర్తగా కార్తీక్

ఉత్తమ భర్తగా కార్తీక్

ఉత్తమ భర్త అవార్డు అందుకొన్న తర్వాత కార్తీక్ మాట్లాడుతూ.. ఈ కేటగిరికి నామినేట్ అయినప్పుడు నా మదర్‌ అనుమానంగా చూసింది. నీవు ఉత్తమ భర్త ఏమిటనీ అడిగింది. నాపై మా ఇంట్లో వారి అభిప్రాయం అది. ఏది ఏమైనా పాత్ర పరంగా, నా తోటి నటీనటులు పాత్రల ప్రోత్సాహంతో నేను ఉత్తమ భర్తగా రాణించడానికి అవకాశం కలిగింది. అందుకు ప్రేక్షకులకు, తోటి చిత్ర యూనిట్‌కు థ్యాంక్ అన్నారు.

పవన్ కల్యాణ్ తల్లి నుంచి

పవన్ కల్యాణ్ తల్లి నుంచి

ఉత్తమ భర్త అవార్డు కంటే మరో అరుదైన అవార్డు నాకు లభించింది. ఈ సీరియల్‌లో నా నటనకు మెచ్చి పవన్ కల్యాణ్ తల్లి నాకు మామిడి పండ్ల బుట్టను బహుమతిగా పంపించింది. అంతేకాకుండా స్వయంగా ఫోన్ చేసి నా టాలెంట్‌ను ప్రశంసించింది. నా జీవితంలో మరిచిపోలేని సంఘటనల్లో అదీ ఒకటి అని కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు.

ప్రతీ ఏడాది పవన్ కల్యాణ్..

ప్రతీ ఏడాది పవన్ కల్యాణ్..

కాగా, ప్రతీ ఏడాది పవన్ కల్యాణ్ తన ఫాం హౌస్‌లో పండిన మామిడి పండ్లను తనకు ఇష్టమైన వ్యక్తులకు సరదాగా పంపిస్తారనే సంగతి తెలిసిందే. ఆ జాబితాలో నితిన్‌, త్రివిక్రమ్‌, ఆలీతోపాటు చాలా మంది టాలీవుడ్ యాక్టర్లు కూడా ఉన్నారు. కాకపోతే కార్తీక్‌కు పవన్ కల్యాణ్ నుంచి కాకుండా తల్లి నుంచి రావడం విశేషం కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X