twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఇమేజ్‌‌‌కు దెబ్బ.. రేణుదేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న మెగాఫ్యాన్స్‌

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఓ డాన్స్ షోకు పెద్దగా టీఆర్సీలు లేకపోయినా.. రేణుదేశాయ్ వ్యాఖ్యల మాత్రం ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తున్నాయి.

    By Rajababu
    |

    Recommended Video

    రేణుదేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న మెగాఫ్యాన్స్‌

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ వ్యాఖ్యలు ఇటీవల సంచలనంగా మారుతున్నాయి. పలు టెలివిజన్ ఛానెల్లో ఆమె ఇంటర్వ్యూలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఆమె న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఓ డాన్స్ షోకు పెద్దగా టీఆర్సీలు లేకపోయినా.. రేణుదేశాయ్ వ్యాఖ్యలు మాత్రం ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తున్నాయి. తాజాగా రేణుదేశాయ్ మాట్లాడిని మాటలు మాత్రం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఇబ్బందికరంగా మారాయి. పవన్ అభిమానులు నొచ్చుకునే విధంగా రేణుదేశాయ్ ఏం మాట్లాడారంటే..

     ఎన్టీఆర్‌పై రేణు హాట్ కామెంట్స్

    ఎన్టీఆర్‌పై రేణు హాట్ కామెంట్స్

    ఓ ప్రముఖ టెలివిజన్ చానెల్లో ప్రసారం అవుతున్న నీతోనే డ్యాన్స్ షోలో రేణుదేశాయ్ జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రసారమైన ఓ ఎపిసోడ్‌లో ఓ సెలబ్రిటీ జంట యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ పాటపై డ్యాన్స్ చేసిన జంటపై ప్రశంసలు కురిపించడానికి ముందు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి.

     ఆ డైలాగ్స్ చెప్పాలంటే ఎన్టీఆరే..

    ఆ డైలాగ్స్ చెప్పాలంటే ఎన్టీఆరే..

    తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత గొప్పగా పౌరాణిక డైలాగ్స్ చెప్పాలంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కే సాధ్యం. డైలాగ్ కొట్టాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని రేణుదేశాయ్ తన అభిప్రాయాన్ని చెప్పారు.

     తారక్ గొప్ప డ్యాన్సర్

    తారక్ గొప్ప డ్యాన్సర్

    అలాగే డాన్సులను కూడా ఎన్టీఆర్ ఇరుగదీస్తాడు. తారక్ గొప్ప డ్యాన్సర్. ఎలాంటి స్టెప్పులనైనా ఎన్టీఆర్ చాలా సులభంగా చేస్తారు అని రేణు దేశాయ్ అనడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

     ఎన్టీఆర్ మాదిరిగా గట్స్

    ఎన్టీఆర్ మాదిరిగా గట్స్

    దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోమంటే.. బన్నీ, ఎన్టీఆర్, రాంచరణ్ మాదిరిగా డ్యాన్స్ చేసే సత్తా ఇశ్వాలని కోరుకొంటాను. జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగా డ్యాన్స్ చేయాలంటే చాలా గట్స్ కావాలి అంటూ రేణు వ్యాఖ్యలు చేశారు.

     సంతోషంలో నందమూరి ఫ్యాన్స్

    సంతోషంలో నందమూరి ఫ్యాన్స్

    రేణుదేశాయ్ వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానులను కొంత ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఏమిటీ ఈమె నందమూరి హీరోలను ఆకాశానికి ఎత్తేయడం ఏమిటీ అనే ప్రశ్నిస్తున్నారు.

     ఆగ్రహంతో మెగా ఫ్యాన్స్

    ఆగ్రహంతో మెగా ఫ్యాన్స్

    మెగా ఫ్యాన్స్‌లోని ఓ వర్గం మాత్రం కోపంతో రగిలిపోతున్నది. ప్రోగ్రాం రేటింగ్స్ కోసమే ఈ జిమిక్కులంటూ సెటైర్లు పడిపోతున్నాయి. అయితే మెగా అభిమానులు ఆగ్రహంగా ఉండటం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే..

    English summary
    Pawan Kalyan's ex wife Renu desai acting as Judge for a dance show. She made sensational comments on NTR dance. Renu said that Junior NTR is the best in dialogue delivery and Dance moments. These comments made NTR fans happy but Mega fans hurted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X