»   » పవన్ ‘గబ్బర్ సింగ్' మళ్లీ గెలిచింది

పవన్ ‘గబ్బర్ సింగ్' మళ్లీ గెలిచింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gabbar Singh
హైదరాబాద్ : 'గబ్బర్ సింగ్' చిత్రం బిగ్ స్క్రీన్‌పైనే కాదు... స్మాల్ స్క్రీన్‌పై కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మాటీవీ సినిమా అవార్డులలో స్వీప్ చేసేసింది. దాదాపు అన్ని అవార్డులను ఈ సినిమానే సొంతం చేసుకుంది.

గబ్బర్ సింగ్ కి వచ్చి అవార్డులు

బెస్ట్ యాక్టర్....పవన్ కళ్యాణ్

బెస్ట్ డైరక్టర్...హరీష్ శంకర్

బెస్ట్ ప్రొడ్యూసర్...బండ్ల గణేష్

బెస్ట్ కొరియోగ్రాఫర్... గణేష్

బెస్ట్ ఎడిటర్... గౌతం రాజు

బెస్ట్ యాక్టర్ (కామిక్ రోల్) ...అత్యాక్షరి టీమ్..

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అత్యధిక పాయింట్లు సాధించడమే కాదు... గత రికార్డులను బద్దలు కొట్టేసింది. గతంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్ రికార్డు రాజమౌళి దర్వకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రంపై ఉండేది. తాజాగా ఆ రికార్డును గబ్బర్ సింగ్ తిరగరాసాడు.

ఇటీవల సంక్రాంతి సందర్భంగా టీవీల్లో ప్రసారం అయిన గబ్బర్ సింగ్ చిత్రానికి అత్యధికంగా 24 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది.. దీంతో మగధీర చిత్రం నెం.2 స్థానానికి వెళ్లి పోయింది. పవన్ కళ్యాణ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించారు.

English summary

 
 Pawan Kalyan-starrer Gabbar Singh swept the awards of a regional television channel (2012) at a glittering function held in Hyderabad . As expected, Pawan Kalyan won the Best actor (male) award for his stellar performance in Gabbar Singh. Gabbar Singh also won several awards including Best Director - Harish Shankar (Gabbar Singh), Best Producer - Bandla Ganesh (Gabbar Singh), Best Choreographer - Ganesh (Gabbar Singh), Best Editor - Goutham Raju (Gabbar Singh & Damarukam), Best Actor in Comic Role - Antakshari Team (Gabbar Singh), etc.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu