బుల్లితెరపై ‘వకీల్ సాబ్’ సందడి: అసలైన పండుగ అంటూ డేట్ ప్రకటించిన ఛానెల్

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రం ద్వారానే ఆయన రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీ గత ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే దీనికి ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనికి సూపర్ హిట్ టాక్ దక్కింది. అయితే, టికెట్ రేట్ల పెంపు, కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా థియేటర్లలో ఎంతో కాలం ఆడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి వకీల్ సాబ్ రెడీ అయిపోయాడు.

పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీ బుల్లితెరపై ప్రసారం కాబోతున్నట్లు జీ తెలుగు ఛానెల్‌ కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఈ సినిమా జూలై 18న సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవబోతుందని సదరు ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సోషల్ మీడియా ఖాతాల్లో 'తెలుగు రాష్ట్రాల టెలివిజన్‌లలో అతి పెద్ద పండుగకు సమయం ఆసన్నమైంది' అని పోస్ట్ చేసింది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్‌ నుంచి ఓ రేంజ్‌లో స్పందన వస్తోంది.

 Pawan Kalyans Vakeel Saab World Television Premiere on July 18th

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వకీల్ సాబ్' మూవీ.. బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్'కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఓ కేసులో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్‌గా ఇందులో పవన్ కల్యాణ్ నటించాడు. దీన్ని తెలుగు నేటివిటీకి, పవన్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా తెరకెక్కించడంలో వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యాడు. ఇక, ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ చిత్రానికి హై ఓల్టేజ్ మ్యూజిక్ అందించాడు.

 Pawan Kalyans Vakeel Saab World Television Premiere on July 18th

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X