బిగ్ బాస్ బ్యూటీకి పవన్ స్పెషల్ లెటర్: స్వయంగా తన చేత్తో రాసి పంపిన పవర్ స్టార్.. అందులో ఏముందంటే!

పలు సీరియళ్లు, సినిమాల్లో నటించి ఎనలేని గుర్తింపును దక్కించుకుని ముందుకు సాగిపోతోన్న వారిలో నటి హిమజ ఒకరు. దాదాపు నాలుగైదేళ్లుగా ఆమె వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి మరింతగా ఫేమస్ అయిన ఈ తెలుగమ్మాయి.. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీగా మారింది. అంతేకాదు, బడా బడా సినిమాల్లో భాగం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆమెకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ లెటర్ పంపాడు. అందులో ఏముందంటే!

స్వయంవరంతో పాపులర్ అయిన హిమజ

స్వయంవరంతో పాపులర్ అయిన హిమజ

సినిమా నటి అవ్వాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది తెలుగమ్మాయి హిమజ. మొదటిగా సీరియళ్లలో నటించే ఛాన్స్ పట్టుకుంది. ఈ క్రమంలోనే 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఈ బ్యూటీ.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లను అందుకుని సత్తా చాటింది.

సినిమాల్లోకీ ఎంటర్.. వరుస అవకాశాలతో

సినిమాల్లోకీ ఎంటర్.. వరుస అవకాశాలతో

బుల్లితెరపై తనదైన మార్క్ చూపించిన హిమజ.. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తెలుగు అమ్మాయిలు కూడా ఈ రంగంలో రాణిస్తారని నిరూపిస్తూ ఎన్నో చిత్రాల్లో నటించింది. ఆమె కెరీర్‌లో 'శివమ్', 'నేను శైలజ', 'ధృవ', 'శతమానంభవతి', 'స్పైడర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'వినయ విధేయ రామ', 'చిత్రలహరి' సహా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.

బిగ్ బాస్‌తో ఫేమస్.. ఊపందుకున్న కెరీర్

బిగ్ బాస్‌తో ఫేమస్.. ఊపందుకున్న కెరీర్

వరుసగా సినిమాలు, సీరియల్ ఆఫర్లు వస్తోన్న తరుణంలో హిమజ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల క్రితం ప్రసారం అయిన మూడో సీజన్‌కు కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె... తనదైన మార్కు చూపించి పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజాయితీగా ఆడుతూ.. ఉన్నది ఉన్నట్లు చెబుతూ ప్రేక్షకుల నుంచి ఓట్లను రాబట్టింది. దీంతో కెరీర్‌కు కూడా బూస్ట్‌ను తెచ్చుకుంది.

తొలిసారి లీడ్‌గా.. పెళ్లి కూతురిగా కనిపించి

తొలిసారి లీడ్‌గా.. పెళ్లి కూతురిగా కనిపించి

ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేసిన హిమజ.. ప్రస్తుతం 'జ' అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ప్రతాప్ రాజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను సైదిరెడ్డి చిట్టెపు తెరకెక్కిస్తున్నాడు. జై దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై గోవ‌ర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవగా, హిమజ పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించి షాకిచ్చింది.

చిరంజీవిది కంప్లీట్.. ఇప్పుడు పవన్‌తో రెడీ

చిరంజీవిది కంప్లీట్.. ఇప్పుడు పవన్‌తో రెడీ

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న 'ఆచార్య'లో హిమజ కీలక పాత్రను పోషించింది. ఇప్పటికే ఆమె పార్ట్ షూట్ కూడా కంప్లీట్ అయింది. ఇక, ప్రస్తుతం పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబోలో వస్తోన్న సినిమాలోనూ నటిస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, పవర్ స్టార్‌తో దిగిన ఓ ఫొటోను కూడా దానికి జత చేసిందామె.

బిగ్ బాస్ బ్యూటీకి పవర్ స్టార్ స్పెషల్ లెటర్

బిగ్ బాస్ బ్యూటీకి పవర్ స్టార్ స్పెషల్ లెటర్

హిమజ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీని ద్వారానే పవన్ కల్యాణ్‌తో చేస్తున్న సినిమా గురించి అప్‌డేట్స్ కూడా ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ స్పెషల్ లెటర్‌ను తాజాగా షేర్ చేసిందామె. ఇంతకీ అది రాసింది ఎవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

స్వయంగా తన చేత్తో రాసి పంపడంతో ఖుషీ

స్వయంగా తన చేత్తో రాసి పంపడంతో ఖుషీ

స్వయంగా తన చేత్తో రాసిన ఓ లెటర్‌ను పవన్ కల్యాణ్.. హిమజకు పంపించారు. అందులో 'హిమజ గారికి.. మీకు అన్ని శుభాలు జరగాలని, ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ.. పవన్ కల్యాణ్' అని రాశారు. ఈ లెటర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఆమె.. 'నా ఫీలింగ్‌ను వ్యక్తపరిచేందుకు ఎటువంటి పదాలు, ఎమోజీలు దొరకడం లేదు' అంటూ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X