BRO TRP Rating: పవన్ సినిమాకు షాకింగ్ టీఆర్పీ.. ఆ మెగా హీరో సినిమా కంటే!

రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వేగంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ రాకెట్ వేగంతో దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో అలరించిన అతడు.. కొద్ది నెలల క్రితమే 'బ్రో (BRO)' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి టాక్ బాగున్నా.. ప్రేక్షకుల నుంచి స్పంద మాత్రం ఆశించిన రీతిలో లభించలేదు.

సాయి ధరమ్ తేజ్ - పవన్ కల్యాణ్ కాంబోలో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి టాక్ అదిరిపోయినా.. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాలేదు. దీనికితోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ చిత్రం అంతగా రాణించలేకపోయింది. దీంతో ఫుల్ రన్‌లో ఈ సినిమాకు రూ. 67.40 కోట్లు వచ్చాయి. ఫలితంగా రూ. 31.10 కోట్లు మేర నష్టాలతో ఈ మూవీ రన్‌ను ముగించాల్సి వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie Gets Low TRP Rating in First Telecast

సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'బ్రో (BRO)' మూవీని థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. ఇందులో థియేటర్లలో మాదిరిగా కాకుండా ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇండియాలోని బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇలా రెండు మూడు వారాల పాటు టాప్‌లో ట్రెండింగ్ అయింది.

థియేటర్లలో ఆశించిన రీతిలో సందడి చేయలేకపోయిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ.. ఓటీటీలో సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి తక్కువ స్పందనే లభించింది. దీంతో ఈ సినిమాకు ఊహించని రీతిలో రేటింగ్‌ నమోదు అయింది.

Pawan Kalyan Starrer BRO Movie Gets Low TRP Rating in First Telecast

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్రో (BRO)' చిత్రానికి అర్బన్ ఏరియాలో 7.24 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 6.29 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల కంటే తక్కువ రేటింగే అని చెప్పాలి. ముఖ్యంగా సాయి తేజ్ గత చిత్రం 'విరూపాక్ష' సాధించిన రేటింగ్ (11.68)ను కూడా చేరలేకపోయింది.

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమానే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X