ప్రదీప్ మాచిరాజుకు పవన్ కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్: అదే జరిగితే ఈ యాంకర్ రికార్డు క్రియేట్ చేసినట్లే!
దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై తనదైన శైలి హోస్టింగ్‌తో రాణిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. అద్భుతమైన టైమింగ్‌తో పంచులు పేలుస్తూ.. ఆకట్టుకునేలా వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో మైలురాళ్లను అదిగమించిన అతడు.. ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్‌ను అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్.. ప్రదీప్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. ఈ విషయాన్ని ఈ యాంకరే వెల్లడించాడు. ఆ వివరాలు మీకోసం!

రేడియో జాకీ.. టాప్ యాంకర్ అయ్యాడు
ప్రముఖ ఎఫ్ఎమ్ సంస్థలో రేడియో జాకీగా పని చేస్తూ కెరీర్‌ను ఆరంభించాడు ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత 'బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే గేమ్ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే షోతో తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. ఈ షోతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు బెస్ట్ యాంకర్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు.

వరుస ఆఫర్లు.. వన్ మ్యాన్ షోగా మార్చి
చాలా తక్కువ సమయంలోనే టాప్ యాంకర్ అయిపోయాడు ప్రదీప్. దీంతో అతడికి వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'ప్రదీప్ దర్భార్', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'అదుర్స్', 'నర్తనశాల', 'కిక్', 'డ్రామా జూనియర్స్', 'ఢీ', 'లక్ష్మీ దేవి తలుపు తడితే', 'సరిగమప' వంటి ఎన్నో షోలలో యాంకర్‌గా పని చేసి మెప్పించాడీ కుర్రాడు. అన్నింటినీ వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు.

సినిమాల్లో ఎంట్రీ.. హీరోగా మొదటి హిట్
సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు ప్రదీప్. అదే సమయంలో ఇటీవల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మున్నా తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ఇందులో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

సినిమా సూపర్ హిట్.. నాలుగు రోజులే
యాంకర్ ప్రదీప్ మొదటి సినిమా కావడంతో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ఊహించని విధంగా నాలుగు రోజుల్లోనే టార్గెట్‌ను ఫినీష్ చేసేసింది. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల వరకూ లాభాలను అందుకుంది.

ప్రదీప్ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది ఇదే
యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే జీ తెలుగు ఛానెల్ సహకారంతో సొంతంగా 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' షోను ప్రారంభించాడు ప్రదీప్ మాచిరాజు. సినీ ప్రముఖులతో ముచ్చటించే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. అంతేకాదు, 2015 నుంచి ఇప్పటి వరకు నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుందీ షో. దీనికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కూడా విచ్చేశారు.

ప్రదీప్ మాచిరాజుకు పవన్ స్పెషల్ గిఫ్ట్
హీరోగా చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో యాంకర్ ప్రదీప్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే సక్సెస్‌ఫుల్ షో 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' ఐదో సీజన్‌ను ప్రారంభించబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టేశాడట ఈ టాప్ యాంకర్. ఈ నేపథ్యంలో ప్రదీప్‌కు పవన్ కల్యాణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని టాక్.
Recommended Video

ఈ యాంకర్ రికార్డు క్రియేట్ చేసినట్లే!
'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' ఐదో సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రాబోతున్నాడని తెలుస్తోంది. ఇటీవల ప్రదీప్ మాట్లాడుతూ.. 'పవన్ సార్ ఎప్పుడో రావాలి. కానీ, బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు. ఈ సారి సీజన్‌కు మాత్రం వస్తున్నారు' అని చెప్పుకొచ్చాడు. దీంతో అతడు వచ్చేది నిజమేనని తెలుస్తోంది. ఇదే జరిగితే బుల్లితెరపై రికార్డులు క్రియేట్ అవడం ఖాయమే.


Click it and Unblock the Notifications











