»   » బుల్లితెరపై పవన్ కళ్యాణ్ సంచలనం, త్రివిక్రమ్ తోడైతే అంతే...

బుల్లితెరపై పవన్ కళ్యాణ్ సంచలనం, త్రివిక్రమ్ తోడైతే అంతే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసలు పవన్ కళ్యాణ్ బుల్లితెర వైపు ఎప్పుడు వచ్చారు? అనే డౌట్స్ మాత్రం అడగొద్దు, ఎందుకంటే ఆయనకు వెండితెరకే సమయం చాలడం లేదు, ఇక బుల్లితెర వైపు వచ్చే అవకాశం ఎక్కడిది? ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది పవన్ కళ్యాణ్ మూవీ సాధించిన శాటిలైట్ రైట్స్ రికార్డ్ గురించి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎక్కడలేని క్రేజ్. మరి అలాంటి క్రేజీ స్టార్‌కు త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తే మైండ్ బ్లోయింగే.

పవన్‌కు త్రివిక్రమ్‌ తోడైతే అంతే...

పవన్‌కు త్రివిక్రమ్‌ తోడైతే అంతే...

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌కు త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తోడు కావడంతో వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ శాటిలైట్ రైట్స్ రికార్డు రేటు పలికింది. ప్రముఖ టీవీ ఛానల్ వీరి కాంబినేషన్లో వస్తున్న ఇంకా టైటిల్ ఖరారు కాని సినిమా శాటిలైట్ రైట్స్ రూ. 21 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Pawan Kalyan and Trivikram Film Satellite Rights Got Record Price
సింగిల్ లాంగ్వేజ్ మూవీకి ఇంత డిమాండా?

సింగిల్ లాంగ్వేజ్ మూవీకి ఇంత డిమాండా?

ఇప్పటి వరకు కొన్ని సినిమాలకు రూ. 20 కోట్ల వరకు వచ్చాయి కానీ... అవి మల్టీల్వాంగేజ్‌ సినిమాలు. అయితే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీ సింగిల్ తెలుగు లాంగ్వేజ్ మూవీ. సింగిల్ లాంగ్వేజ్ మూవీకి ఇంత ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

హిందీ డబ్బింగ్ రైట్స్‌తో కలిపి రూ. 32 కోట్లు

హిందీ డబ్బింగ్ రైట్స్‌తో కలిపి రూ. 32 కోట్లు

ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 11 కోట్లకు అమ్ముడు పోయాయి. శాటిలైట్ రైట్స్ రూ. 21 కోట్లు...... మొత్తం రూ. 32 కోట్లు. థియేటర్ రిలీజ్‌తో సంబంధం లేకుండా ఇంత మొత్తం రావడం అంటే మామూలు విషయం కాదు.

మహేష్ బాబు మూవీకి

మహేష్ బాబు మూవీకి

మహేష్ నటిస్తున్న ‘స్పైడర్' మూవీకి కూడా భాగానే బిజినెస్ జరిగింది. రూ. 26 కోట్లు వచ్చాయి. హిందీ, తమిళ అన్ని కలిపి ఇంత మొత్తం వచ్చింది ఈ చిత్రానికి.

English summary
Pawan Kalyan and Trivikram Srinivas upcoming film sets record in satellite rights. The yet to be titled film has been reportedly snapped up by a leading Television network for a whopping 21 Cr, and this is only for the Telugu language.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu