బిగ్‌బాస్‌లోకి హాట్ బ్యూటీ, యంగ్ హీరో ఎంట్రీ: కొత్త హోస్ట్ కోసం స్పెషల్‌గా.. లీకైన భారీ సర్‌ప్రైజ్‌!

By Manoj

తెలుగులో కనీవినీ ఎరుగని స్థాయిలో హవాను చూపిస్తోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అంశాలతో ప్రసారం అవుతున్నప్పటికీ... దీన్ని ఇక్కడి ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. దీంతో మూడు సీజన్ల పూర్తి చేసి, నాలుగో దాన్ని సైతం మొదలెట్టారు షో నిర్వహకులు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ సీజన్‌కు నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. అయితే, వ్యక్తిగత కారణాలతో ఆయన షో నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ స్థానంలో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదే సమయంలో హాట్ బ్యూటీ, యంగ్ హీరో కూడా సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. ఆ వివరాలు మీకోసం.!

దేనికదే టాప్.. నాగార్జునే బాప్

దేనికదే టాప్.. నాగార్జునే బాప్

తెలుగులో బిగ్ బాస్ షో మూడు సీజన్లను పూర్తి చేసుకోగా... ఈ మూడింటినీ ముగ్గురు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్ట్ చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్‌ను కూడా అక్కినేని హీరోనే నడిపిస్తున్నారు. మొదటి ఇద్దరు హీరోలు అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. నాగ్‌ మాత్రం బుల్లితెరపై ఎన్నో రికార్డులను తన సారథ్యంలోనే క్రియేట్ చేశారు.

ఇది కూడా అలానే మొదలైంది

ఇది కూడా అలానే మొదలైంది

బిగ్ బాస్ మొదటి సీజన్‌లో ఎన్టీఆర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఆ తర్వాత నాని వాటిని బీట్ చేయలేకపోయినా దగ్గరగా వచ్చాడు. కానీ మూడో సీజన్ నుంచి నాగార్జున హవాను చూపిస్తున్నారు. ప్రీమియర్, ఫైనల్ ఎపిసోడ్స్‌తో చరిత్ర సృష్టించారు. ఇక, ఇటీవల ప్రారంభమైన నాలుగో సీజన్‌ ప్రారంభ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ సాధించి షోను టాప్‌లో నిలిపారు.

బిగ్ బాస్ షో నుంచి నాగ్ ఔట్

బిగ్ బాస్ షో నుంచి నాగ్ ఔట్

తెలుగు బిగ్ బాస్ షోలోనే నెంబర్ వన్ హోస్ట్‌గా వెలుగొందుతోన్నారు అక్కినేని నాగార్జున. అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకుంటోన్న ఆయన.. కుర్రాళ్లతో పోటీగా సత్తా చాటుతున్నారు. ఇలాంటి సమయంలో అక్కినేని హీరో బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నారు. గతంలో ఒప్పుకున్న సినిమా కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

కారణం చెబుతూ వీడియో రిలీజ్

కారణం చెబుతూ వీడియో రిలీజ్

ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఇప్పుడీ మూవీ షూటింగ్ కోసమే ఆయన ఉత్తరాదికి వెళ్లారు. అక్కడ 21 రోజుల పాటు షూటింగ్ చేయనున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేసి వెల్లడించారాయన.

నాగ్ స్థానంలో స్టార్ హీరోయిన్

నాగ్ స్థానంలో స్టార్ హీరోయిన్

సినిమా షూటింగ్ కోసం అక్కినేని నాగార్జున బిగ్ బాస్ షోకు దూరమయ్యారు. దీంతో ఆయన స్థానంలో స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత షోను హోస్ట్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత సీజన్‌లోనూ నాగ్ విదేశాలకు వెళ్లగా... అప్పుడు రమ్యకృష్ణ స్పెషల్ హోస్టుగా వచ్చారు. ఇప్పుడా బాధ్యతలను తన కోడలికి అప్పగించారట కింగ్ నాగార్జున.

Recommended Video

Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
 హాట్ బ్యూటీ, యంగ్ హీరో ఎంట్రీ

హాట్ బ్యూటీ, యంగ్ హీరో ఎంట్రీ

అక్కినేని సమంత హోస్టింగ్‌లో రాబోతున్న ఈ రెండు ఎపిసోడ్స్ ఎంతో సందడిగా జరగనున్నాయట. దసరా సందర్భంగా వచ్చే ఈ ఎపిసోడ్స్‌కు RX100 మూవీ హీరో, హీరోయిన్లు కార్తికేయ గుమ్మకొండ, పాయల్ రాజ్‌పుత్ కూడా రాబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో వీళ్లిద్దరూ పెర్ఫార్మెన్స్ కూడా చేయనున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X