పవన్ రికార్డు బ్రేక్ చేసిన పాయల్: మంగళవారం మూవీ రేటింగ్ చూశారంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి విభిన్నమైన కాన్సెప్టులతో ఎన్నో సినిమాలు రూపొందుతోన్నాయి. అందులో కొన్ని మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లలో వస్తున్నాయి. ఇలాంటి వాటికే ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. దీంతో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా కొద్ది రోజుల క్రితమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'మంగళవారం'.

ఇండియాలోనే ఏ భాషలోనూ టచ్ చేయని పాయింట్‌తో తెరకెక్కిన 'మంగళవారం' మూవీకి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయింది. అందుకు తగ్గట్లుగానే దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం క్రమంగా డౌన్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ మంచి వసూళ్లతోనే ఈ సినిమా రన్‌ను కంప్లీట్ చేసుకుంది.

Payal Rajput Starrer Mangalavaaram Movie Gets Decent TRP Rating in First Telecast

టాలీవుడ్ బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన 'మంగళవారం' సినిమాకు థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాంపైన కూడా మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ చిత్రం స్టార్ మా చానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

విభిన్నమైన కథతో, క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మంగళవారం' చిత్రానికి ఇటీవలే స్టార్ మాలో ప్రదర్శితం అయిన సమయంలో అర్బన్ ఏరియాలో 7.21 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 6.51 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల కంటే తక్కువ రేటింగే అని చెప్పాలి.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'మంగళవారం' చిత్రానికి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఇది ఇటీవలే వచ్చిన పవన్ కల్యాణ్ 'బ్రో' మూవీ కంటే ఎక్కువగా రేటింగ్‌ను సొంతం చేసుకోవడమే. అంతేకాదు, విజయ్ 'లియో' కంటే కూడా దీనికి ఎక్కువ స్పందన లభించింది.

Payal Rajput Starrer Mangalavaaram Movie Gets Decent TRP Rating in First Telecast

ఇదిలా ఉండగా.. థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'మంగళవారం' మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించాడు. ప్రియదర్శి సర్‌ప్రైజింగ్ పాత్రలో నటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X