అనసూయ కత్తి.. ఆమె గురించి గూగుల్ లో ఏం సెర్చ్ చేశారో తెలుసా?

బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ సుపరిచితురాలే. కేవలం యాంకర్ గానే తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించింది. యాంకరింగ్ స్కిల్స్ ను ఒంట బట్టించుకున్న ఈమె తనదైన శైలిలో జబర్దస్త్ కామెడీ షోలో వ్యాఖ్యాతా వ్యవహరించి ఆకట్టుకుంది. మరోవైపు ఇంట్రో డ్యాన్స్ లతోనూ ఆశ్చర్యపరిచింది. ఇలా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. కాస్తా గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్లీ తిరిగి బుల్లితెరకు దగ్గరైంది అనసూయ భరద్వాజ్. ఈ క్రమంలోనే అనసూయ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.

హెచ్ఆర్ జాబ్ నుంచి స్టార్ యాంకర్ గా..
అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం స్టార్ నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమెకు ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. తను ఎంతో కష్టపడి, కెరీయర్ ను సరిగ్గా ప్లానింగ్ చేసుకొని ఈ స్థాయికి చేరుకుంది. అనసూయ టీవీ రంగంలో అడుగు పెట్టే ముందు హెచ్ఆర్ గా ఓ కంపెనీలో విధులు నిర్వహించింది. అంతే కాదు సాక్షి ఛానెల్ లో న్యూస్ రీడర్ గానూ పని చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ 2013లో ప్రారంభమైన 'జబర్దస్త్ కామెడీ షో'కు యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. అక్కడి నుంచి అనసూయ దశ మారింది. వచ్చిన అవకాశాన్ని అనసూయ కూడా చక్కగా వినియోగించుకుంది.

People searched for Anasuya Bharadwaj on Google

గూగుల్ లో అనసూయ కోసం వెతుకులాట...
ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ తిరిగి బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీ సీజన్ 2 రియాలిటీ గేమ్ షోకు ఫీమేల్ జడ్జీగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ షోలో మెరిచేందుకు స్టన్నింగ్ ఔట్ ఫిట్లనూ ధరిస్తోంది. ఇదెలా ఉంటే.. అనసూయ సమయం ఉన్నప్పుడల్లా ఆయా టీవీ షోలు, యూట్యూబ్ ఛానెళ్లు, పాడ్ కాస్ట్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ప్రదీప్ మాచిరాజ్ టాక్ షోకు హాజరైన అనసూయ భరద్వాజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఆమె గురించి ప్రజలు గూగుల్ లో తెగ వేతికారంట.

ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకున్నారంటే?
అనసూయకు ప్రస్తుతం స్టార్ స్టేటస్ ఉండటంతో ఆమెకూ ఫ్యాన్స్ బేస్ గట్టిగానే ఉంది. ఇంకా అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో అనసూయ గురించి మరింతగా తెలుసుకునేందుకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అనసూయ గురించి రీసెంట్ టైమ్స్ లో గూగుల్ లో ఎక్కువగా ఆమె వయస్సు ఎంత అని శోధించారంట. ఇదే విషయాన్ని ప్రదీప్ మాచిరాజ్ అనసూయకు చెప్పడంతో ఆశ్చర్యపోయింది. 50 ఏళ్లు వచ్చినా అనసూయ కత్తిలానే ఉంటుందని అనుకోండి.. వయస్సుతో సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది.

అనసూయ భరద్వాజ్ హిట్ సినిమాలు..
టీవీ రంగం నుంచి వెండితెరపైకి అనసూయ జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తొలుత స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపింది. ఆ తర్వాత నెమ్మదిగా కీలక పాత్రల్లో నటించే అవకాశాలను అందుకొని నటిగా మెప్పించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే క్షణం, రంగస్థలం, ధమకా, పుష్ప, రంగ మార్తాండ, విమానం, రాజాకార్, పెద్ద కాపు, పుష్ప 2 వంటి చిత్రాల్లో నటించి వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించింది. త్వరలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తమిళంలో ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X