Naga Panchami 1st March: ఒకేరోజు చావబోతున్న మోక్ష, పంచమిలు.. ఎవరిని ఎవరు చంపబోతున్నారంటే?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో అదిరిపోయే ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ మాత్రం మరింత అద్భుతంగా మారింది. ఎవరూ ఊహించని స్థాయిలో పంచమి, మోక్షలు ఇద్దరూ ఒకేరోజు చనిపోబోతున్నారు. వీరిద్దరినీ ఒవైపు నాగలోకపు యువరాణ ఫణీంద్ర, మరోవైపు మాంత్రికురాలు కరాళీ చంపనున్నారు. ముఖ్యంగా కరాళీ పంచమిని అడ్డు తొలగించుకోవాలని చూస్తోంది.

పంచమి బతికి ఉంటే మోక్షను బలి ఇవ్వడంతో పాటు తనను తాను కాపాడుకోవడం చాలా కష్టం అని అందుకే పంచమినే ముందుగా చంపాలని డిసైడ్ అయింది. ఇదే విషయాన్ని తన అన్న నంబూద్రీకి చెప్పి.. నువ్వే పంచమిని చంపాలని అంటుంది. ఇలా జ్వాల శరీరంలోకి వెళ్లిన నంబూద్రీ ఆత్మ పంచమిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముందుంగా కంత్రీ, తంత్రీలు వెళ్లి తలుపులు కొట్టగా పంచమి బయటకు రావడం... జ్వాల ఆమె పీక పట్టుకుని నొక్కడం నొక్కుతుంది. పంచమి తన ప్రాణాలు కాపాడుకోవడానికి మరింత ట్రై చేస్తుంది.

Phanindra And Karali Plan to Moksha And Panchami Death Today on Naga Panchami March 1st Episode

మరోవైపు మోక్షను చంపేందుకు నాగలోకపు యువరాజు ఫణీంద్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. పంచమి నాగదేవతలను స్మరిస్తూ ఉండగా.. అక్కడకు ఫణీంద్ర వస్తాడు. నీక నాగ దేవత ప్రత్యక్షం కాదని.. ఎలాంటి శక్తులు ఇవ్వదని చెబుతాడు. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు నాగలోకం రావట్లేదు.. నన్ను, నాగలోకాన్ని మోసం చేస్తూనే ఉన్నావని అంటాడు. మోక్షను బాబుకు... ఆ కరాళీ పీడ తొలగించి కచ్చితంగా వస్తానని చెబుతుంది. ఎవరికైనా చావు తథ్యం అని.. ఈరోజు కాకపోతే రేపు మోక్ష కూడా చావాల్సిందేనని అంటాడు.

కానీ పంచమి మాత్రం అలా అనొద్దని.. మోక్షను కాపాడుకుంటానని వివరిస్తుంది. అంతలోనే అక్కడకు మోక్ష వచ్చి పంచమిని నాగలోకం తీసుకెళ్లడానికి వీళ్లేదని అంటాడు. తను నా భార్య నాగోలకంతో ఎలాంటి సంబంధం లేదని అంటాడు. ఇదంతా విన్న ఫణీంద్ర ఆగ్రహానికి గురవుతాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది. ఇలా నీ ప్రాణాలు నేనే తీస్తానంటూ ఫణీంద్ర అనగానే పంచమి అతడి చెంప పగులగొడుతుంది. దీంతో మరింత కోపోద్రిక్తుడు అయిన ఫణీంద్ర.. మోక్ష చావు తన చేతిలోనే అని.. అది కూడా ఈరోజే అని చెబుతాడు.

Phanindra And Karali Plan to Moksha And Panchami Death Today on Naga Panchami March 1st Episode

మోక్షను ఈరోజు రాత్రికే చంపేసి.. నిన్ను నాగలోకం తీసుకు వెళ్తానని ఫణీంద్ర హెచ్చరిస్తాడు. దీంతో పంచమి భయంతో కళ్లు తరిగి పడిపోతుంది. ఆతర్వాత పంచమిని తీసుకుని గదిలోకి వెళ్తాడు మోక్ష. మరోవైపు చిత్ర, తన భర్తను ప్రేమగా తన వైపుకు మలుచుకుంటుంది. ఇంట్లోంచి వెళ్లిపోయేలా ప్రోత్సహిస్తుంది. అందరినీ ఒప్పించి.. పంచమి, జ్వాల వంటి పిచ్చోళ్ల మధ్య నుంచి వెళ్లిపోదామని అంటుంది. ఆ తర్వాత జ్వాల, ఆమె భర్తను చూపిస్తారు. అతడు కూడా ప్రేమగా మాట్లాడుతూ.. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావా అంటూ భార్యని అడగ్గా ఫుల్ సీరియస్ అవుతుంది.

నాకేం పిచ్చి లేదు.. నేనేం తేడాగా వ్యవహరించట్లేదు... ఇలా నా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లను చంపేస్తానని అంటుంది. ఆ వెంటనే నంబూద్రీ ఆత్మ వచ్చి జ్వాలను ఆవహించడం.. ఆ తర్వతా ఆమె పంచమిని చంపేందుకు బయటకు రావడం చూపిస్తారు. ఇలా ఎవరూ ఊహించని స్థాయిలో రసవత్తరంగా సాగుతున్న సీరియల్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X