Naga Panchami January 4th: ఫణీంద్ర మాయలో పంచమి.. మోక్షను చంపి నాగలోకం తీసుకెళ్లేందుకు ప్లాన్!

నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి దగ్గరకు వస్తున్నా కొద్దీ ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతుంది. మోక్షను ఎలాగైనా సరే ఈసారి కాపాడుకోవాలని పంచమి... కచ్చితంగా అతడిని చంపి పంచమిని నాగలోకం తీసుకెళ్లాలని ఫణీంద్ర ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కరాళీ.. మేఘన రూపంలో వచ్చి పంచని నాగమణిని తీసుకు వచ్చిన వెంటనే తీసుకెళ్లి తనను అన్నను కాపాడుకోవాలని నటిస్తోంది. ఇంత అద్భుతంగా సాగుతున్న సీరియల్ ప్రతిరోజూ సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చేస్తోంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు మోక్షను కాటేసి నాగలోకం వెళ్లాలని పంచమి భావిస్తోంది.

అయితే తాను ఫణీంద్రతో కలిసి నాగలోకం వెళ్లి నాగమణి తీసుకు రావాలని భర్తను కాపాడుకోవాలని పంచమి అనుకుంటుంది. అయితే తాము వచ్చే వరకు మోక్షను కాపాడాల్సిన బాధ్యత మేఘనపై పెట్టబోతున్నారు. దీని గురించి వారంతా మాట్లాడుకుంటుంటారు. మోక్ష కూడా భార్య మాట విని వారిని కలిసి మీకు నచ్చింది చేయమని చెబుతాడు. కానీ ఫణీంద్ర మాత్రం మనసులో.. నాగరాణిని చంపిన మోక్ష ఇష్టరూప నాగజాతికే శత్రువు అని అతడిని కాపాడాల్సిన అవసరం తనకు లేదని అనుకుంటాడు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ సాగుతుంది. మరి భర్తను ఒప్పించిన పంచమి.. అతడిని కాటేసి మళ్లీ భర్తను కాపాడుకునేందుకు ఏం చేస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Phanindra Big plan to Kill Moksha and Take Panchami to Nagalokam on Naga Panchami January 4th Episode

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా మోక్ష.. పంచమిని వెతుక్కుంటూ వెళ్తాడు. నాగ సాధువు దగ్గరకు వెళ్లిన మోక్ష.. పంచమి ఎక్కడికి వెళ్లి ఉంటుందో చెప్పాలని అంటాడు. అలా ఆమె సుబ్రహ్మణ్య గుడికి వెళ్లి ఉండవచ్చని చెప్పగానే.. తనను వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే అప్పటికే పంచమి, సుబ్బులు ఇంటికి వస్తుండగా.. మోక్ష పిలుస్తున్న చప్పుడు సుబ్బుకు వినిపిస్తుంది. ఇక నీకు నా అవసరం లేదు.. నేను వెళ్లిపోతానంటాడు. లేదు ఇంటికి రమ్మని పంచమి అనగా.. వద్దు నువ్వే కదా వెళ్లిపోమన్నావని సుబ్బు చెబుతాడు. అలా అనొద్దు తెలీక తప్పు చేశాను.. గుంజీలు తీస్తే నా వెంట వస్తావా అంటూ అడుగుతాడు.

లేదు నువ్వు ప్రతీరోజు గుడికి వస్తావు కదా నేను కూడా అక్కడకు వస్తుంటాను.. అలా నీ బాధలు, కష్టాలు నాతో చెప్పుకోవచ్చులే పంచమి అంటాడు. నువ్వు ప్రతిరోజూ రావాలి.. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని పంచమి చెబుతుంది. ఇక ఆ తర్వాత సుబ్బు వెళ్లిపోతాడు. మోక్ష పంచమిని పిలుస్తూ తన వద్దకు వస్తాడు. పంచమి పంచమి అంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు. అలా వచ్చిన వెంటనే భార్యను హత్తుకుంటాడు. పంచమి కూడా భర్తను హత్తుకుని ఏడుస్తుంది. ఇంకోసారి నన్ను వదిలిపెట్టి వెళ్లొద్దు పంచమి.. తప్పైపోయింది.. నువ్వెళ్లి పోవాలి అనుకుంటే నన్ను కూడా తీసుకెళ్లిపో అంటూ చెబుతాడు.

భర్త బాధను అర్థం చేసుకున్న పంచమి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. సరే అని అంటుంది. అలాగే తనను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు చేయాలని చెబుతుంది. ఇక ఆ తర్వాత మేఘన, ఫణీంద్రలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. పంచమి ఏమై పోయిందో అని ఆందోళన పడుతుంటారు. అయితే మేఘన మాత్రం.. పంచమి కచ్చితంగా వస్తుందని మోక్షను కాపాడుకుంటుందని చెబుతుంది. ఆ తర్వాత ఆమె వెళ్లిపోగా.. ఫణీంద్రను జ్వాల చూసి నువ్వు ఎవరంటూ నిలదీస్తుంది. ఈక్రమంలోనే ఫణీంద్ర పాముగా మారతాడు. అది చూసిన జ్వాల భయంతో వణికిపోతూ కనిపిస్తుంది.

Phanindra Big plan to Kill Moksha and Take Panchami to Nagalokam on Naga Panchami January 4th Episode

అందరినీ పిలుస్తూ రచ్చ చేస్తుంది. ఇంట్లోకి పరుగులు తీసి సోఫాలపై ఎక్కి రచ్చ చేస్తుంది. అంతా రాగానే తాను మనిషి పాముగా మారడం చూశానని.. చెబుతుంది. అంతా నమ్మరు. కానీ జ్వాల మాత్రం పదే పదే చెప్పగా.. చిత్ర నమ్మినట్లు వివరిస్తుంది. గతంలో చాలా సార్లు పాములు ఇక్కడకు వచ్చాయని.. అలాగే పంచమి కూడా అలాంటి పామే అని చిత్ర, జ్వాలలు వివరిస్తారు. అది నమ్మిన మోక్ష తల్లి వైదేహి.. మోక్ష, పంచమిలు ఇంట్లోకి రాగానే పంచమియే పాము అంటూ గడప దగ్గరే ఆపేస్తుంది. తనను కొట్టి చంపమని కొడుక్కు చెబుతుంది. ఇంతటితో నిన్నటి ఎపిసోడ్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X