Naga Panchami 22nd February: ప్రాణత్యాగం చేసిన కరాళీ.. మహాంకాళి ఏం వరం ఇచ్చిందంటే?

Naga Panchami: నాగపంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. సినిమాను మించిన ట్విస్ట్ లతో సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఫణీంద్ర పంచమిని నాగలోకం తీసుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే నంబూద్రీ, మేఘనలు... మోక్షను పెళ్లి చేసుకుని ఆయనను మహాంకాళి అమ్మవారికి బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మోక్ష పంచమిని తనతోనే పాటు ఉంచుకునేందుకు ప్లాన్ చేయడం.. పంచమియేమో మోక్షను కాపాడుకోవాలని మదన పడడం జరుగుతోంది.

ఈక్రమంలోనే మోక్ష మేఘనను, ఫణీంద్రలను ఇంట్లోంచి వెళ్లగొట్టమని అంటాడు. అదంతా విన్న ఫణీంద్ర పాము పంచమితో మాట్లాడుతూ.. నిన్ను ఇప్పుడే నాగలోకం తీసుకెళ్లగలను అంటాడు. అంతలోనే మోక్ష వచ్చి అలా ఎలా తీసుకు వెళ్తావు.. తను నా భార్య, తనకు నాగలోకానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. తీసుకు వెళ్లడానికి వీళ్లేదని వివరిస్తాడు. ఈక్రమంలోనే ఫణీంద్ర, మోక్షల మధ్య వైరం జరగబోతున్నట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది.

Phanindra Cautions Nambudri on Naga Panchami February 22nd Episode

నిన్నటి ఎపిసోడ్ లో కరాళీ.. మహాంకాళి అమ్మవారిని ఆవాహనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారిని కొలుస్తుంది. కానీ ఎంతకూ అమ్మవారు ఆవాహనం కాకపోవడంతో.. తన మంత్ర శక్తితో కత్తిని ప్రత్యక్షం అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత తన తల నరికి అమ్మవారిని నామ స్మరణ చేస్తుంది. ఇలా కాసేపు జరగగా.. అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. వెంటనే కరాళీ తలను తన మొండెంతో అతికిస్తుంది. అమ్మవారు రాగానే.. కరాళీ తెగ సంబురపడిపోతుంది.

అమ్మా నాకు తెలుసు.. నువ్వు వస్తావని.. నా ప్రాణాలు కాపాడతావని అంటుంది. నీ భక్తురాలు ప్రాణాలు తీసోకవడం నీవు చూడలేవని అంటుంది. నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదని.. పంచమి చేతిలో ఓడిపోవడం, చనిపోవడం ఖాయం అని అమ్మవారు వివరిస్తుంది. అయినా సరే తాను వినను అని పంచమిని ఓడించి... ఎట్టి పరిస్థితుల్లో మోక్షను బలి ఇస్తానని చెబుతుంది. నీకు ఎంత చెప్పినా నువ్వు వినవు అని మహాంకాళి అనగానే.. సరే నువ్వు మోక్షను బలిస్తే నీకు శక్తులు అన్నీ తరిగి వచ్చేలా చేస్తానని వివరిస్తుంది. దీంతో కరాళ తెగ సంబురపడిపోతుంది.

ఇక ఆ తర్వాత మోక్ష తల్లి వైదేహి పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనను ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపించి వేసి మోక్షకు, మేఘనతో పెళ్లి చేయాలని అనుకుంటుంది. పంచమి రావడం చూసి ఆగమని నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో అంటూ గొడవ చేస్తుంది. ఎందుకని పంచమి అడగ్గా.. నువ్వు నా కొడుకుని వదిలి వెళ్లిపోవడానికి అని అంటుంది. తాళి బంధం కొనగలిగేది కాదని పంచమి అనగా.. వైదేహి గొడవకు దిగుతుంది. ఇంట్లోంచి వెళ్లిపోతేనే మంచిదని చెబుతుంది. కానీ ఆమె మాత్రం వెళ్లేది లేనని.. కొట్టబోతున్న వైదేహిని అడ్డుకుంటుంది.

ఇక ఆ తర్వాత జ్వాల ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా.. చిత్ర కాఫీ తీసుకు వస్తుంది. అంతలోపే నంబూద్రీ ఆత్మ వచ్చి జ్వాలను ఆవహిస్తుంది. అటుగా వెళ్తున్న ఫణీంద్రను చూసి జ్వాల పట్టుకుని పామును పిసుకుతుంది. అది చూసిన చిత్ర కళ్లు తిరగి పడిపోగా.. జ్వాల పామును కిందకు విసిరేస్తుంది. ఇక ఆ తర్వాత ఫణీంద్ర మనిషిగా మారి నంబూద్రీ ఆత్మతో మాట్లాడతాడు. నువ్వు నంబూద్రీవి.. మేఘన రూపంలో ఉంది నీ చెల్లె కరాళీ అని చెబుతాడు.

నేను పంచమికి ఈ విషయం చెప్పకూడదంటే మీరు మా జోలికి రావద్దని చెబుతాడు. ఇలా ఇద్దరూ ఒకరి గురించి ఒకరు బయటకు తెలియకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత నంబూద్రీ ఆత్మ జ్వాలను విడవగానే.. స్పృహలోకి వచ్చిన జ్వాలను చిత్రను లేపుతూ ఉంటుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X