Naga Panchami 31st January: పంచమిని నాగలోకం తీసుకెళ్లాలనుకుంటున్న ఫణీంద్ర.. మోక్ష పెళ్లితో కథ తారుమారు!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని ట్విస్ట్ లతో సీరియల్ ను రక్తి కట్టిస్తున్నారు నిర్వాహకులు. అయితే తాజా ఎపిసోడ్ లో పంచమి తన భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెడుతూ కనిపిస్తుంది. అంతలోనే మోక్ష అక్కడకు రావడం.. నువ్వే నా ప్రాణం పంచమి అంటూ ఆమెను తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె మాత్రం ప్రాణంగా ప్రేమించే భర్త దగ్గరకు వెళ్లదు. అతడే చేయి పట్టి లాగినా ఆమె వెళ్లదు. చేయి వదిలించుకుని మరీ నేను మీతో అస్సలే రానని తేల్చి చెబుతుంది. ఈక్రమంలోనే మోక్ష తన తల్లి నిర్ణయాన్ని చెబుతాడు.
తన తల్లి తనకు వెంటనే మరో పెళ్లి చేయాలనుకుంటుందని ఏమాత్రం నువ్వు రావడంలో ఆలస్యం చేసినా ఆ పెళ్లి జరిగిపోతుందని అంటాడు. మంచిదే కదా మోక్ష బాబు.. మీరు పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి ఇక నా జీవితం ఇంతే అంటూ పంచమి వివరిస్తుంది. నేను నిన్ను తీసుకెళ్లాలనే వచ్చాను.. నువ్వు రాకపోతే అక్కడ మా అమ్మ నాకు, మేఘనకు పెళ్లి చేసేస్తుందని అంటుంది. వెంటనే పంచమి ఈ పెళ్లి జరగడానికి వీలు లేదని వివరిస్తుంది. మేఘన ఒక నాగ కన్య అని ఆమెను పెళ్లి చేసుకోకూడదని చెబుతుంది. కానీ ఇదంతా విన్న మోక్ష మాత్రం నేను మేఘననే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతాడు.

నీకు, మా అమ్మకు నేను పెళ్లి చేసుకోవడమే కదా కావాలి.. కదా ఇప్పుడే వెళ్లి మేఘనను పెళ్లి చేసుకుంటానని మోక్ష అంటాడు. వద్దు మోక్ష బాబు.. కరాళీ మేఘనను తన వశం చేసుకుని ఇలా ఆటలాడిస్తుందని అంటుంది. ఇదంతా నాకు అనసవరం పంచమి నేను వెళ్లి పెళ్లి చేసుకుంటానని మోక్ష అంటాడు. మేఘన నాగకన్య.. కలిస్తే చనిపోతాం.. చనిపోనీ నేను అని అంటాడు. అలాగే చివర్లో.. నువ్వు వచ్చి ఆ పెళ్లి ఆపితేనే నేను ప్రాణాలతో ఉంటాను... లేదంటే ఆమెతో కలిసి నేను చనిపపోతానని వివరిస్తాడు. ఇలా చెప్పి ఇంటికి వెళ్లిపోతాడు. పంచమి మాత్రం ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోతుంది.
ఇక ఆ తర్వాత మేఘన ఓ గుహకు వెళ్లి ఏదో వెతుకుతూ ఉంటుంది. తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాగరాణిని అక్కడే బంధించినట్లు, మోక్షపై ప్రయోగాలు కూడా చేసినట్లు తలుచుకుంటుంది. అలాగే అక్కడే అద్దంలో తన రూపాన్ని చూసుకుంటుంది. ఇలా మారిపోవడానికి కారణం పంచమియే అని, తన మీద తనకే జాలి వేస్తుందంటూ ఆవేదన చెందుతుంది. మళ్లీ మంత్రెగత్తెగా మారి తన శక్తులన్నీ తిరిగి పొందుతానని అంటుంది. ఇక ఆ తర్వాత మహాకాళి అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసుకుంటూ కనిపిస్తుంది.
ఈక్రమంలోనే అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. నీవు చేసుకున్న తప్పుల వల్లే నీ గతి ఇలా అయ్యిందని.. నీ అన్న పరమ దుష్టుడు అని అతడిని కాపాడాలనుకోవడం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చందంటూ చెబుతుంది. మిమ్మల్ని ఎదురించాలని నేనలా చేయలేను తల్లీ.. నా అన్నను కాపాడుకోవాలనుకొనే అలా చేశానని అంటుంది. నువ్వు నా భక్తురాలివి కాబట్టే పిలిచినప్పుడల్లా వస్తున్నానని అంటుంది. నువ్వు మోక్షను ఆహుతి ఇస్తే తప్ప నీకు శక్తులు రావని.. పంచమి శక్తి బయటపడడానికే నీకు ఈ పరీక్ష అంటూ అమ్మవారు చెబుతుంది.

నా శక్తుల కోసం నేనే గెలుస్తానని కరాళీ చెబుతుండగా.. మహాకాళి మాత్రం పుట్టుక, చావు, గెలుపు, ఓటమి అన్నీ కాల గర్భంలో ఒక భాగమే అంటూ వివరిస్తుంది. నీ ప్రయత్నం నీవు చేయు అని మాయం అవుతుంది. ఇక ఆ తర్వాత చిత్ర, జ్వాలలను చూపిస్తారు. వారిద్దరూ మోక్ష.. మేఘనను ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మేఘన వారి ముందు నుంచి వెళ్లడం చూసి పిలుస్తారు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











