Naga Panchami 9th February: మేఘనే కరాళీ అని తెలుసుకున్న ఫణీంద్ర.. చంపబోతున్న అన్నాచెల్లెల్లు
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో కరాళీ రూపంలో ఉన్న మేఘనతో.. జ్వాలలోకి ప్రవేశించిన నంబూద్రీ ఆత్మ మాట్లాడుతూ కనిపిస్తుంది. అయితే వారిద్దరూ కలిసి గదిలో మాట్లాడుకుంటుండగా... ఫణీంద్ర పాము రూపంలో వెళ్లి గదిలో వారు మాట్లాడుకున్న మాటలు వింటాడు. మేఘనయే కరాళీ అని తెలుసుకంటాడు. మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తాడు.
కానీ బయటకు వచ్చేలోపే మేఘన ఆ విషయాన్ని గమనిస్తుంది. పాము రూపంలో ఉన్న ఫణీంద్రయే తము గురించి తెలుసుకున్నాడని.. ఎలాగైనా సరే అతడిని అంతం చేయాలని అనుకుంటారు. వెంటనే పెద్ద కర్ర చేతిలో పట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తారు. అంతోలనే పాము... ఫణీంద్ర రూపంలో మారి పంచమతో మాట్లాడతాడు. అయితే అతడు నీతో ఓ విషయం చెప్పాలి పంచమి అని అంటాడు. కానీ అసలు విషయం మాత్రం చెప్పడు.

అయితే ఫణీంద్ర మేఘనయే కరాళీ అని చెబుతాడా లేదా అన్నది తెలియాలంటే మాత్రం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఫణీంద్ర, పంచమితో మాట్లాడుతుంటే.. కారు వెనకాలే ఉంటే మేఘన, జ్వాలలు పెద్ద కర్ర పట్టుకుని ఉంటారు. అదును దొరికితే చంపాలని చూస్తూ కనిపిస్తారు. మరి ఏం జరగనుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మందుగా పంచమి, మోక్షలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మనం విడిపోయే సమస్యే లేదు పంచమి అంటూ మోక్ష చెప్పగా.. నేను నాగలోకం వెళ్లాలని నిశ్చయించుకున్నానని పంచమి అంటుంది. ఈలోకంతో నాకున్న బంధం ముగిసిపోయింది.. ఇక నేను ఈ భూమ్మీద ఉండే అవకాశమే లేదని అంటుంది. అబద్ధం చెప్పకు పంచమి అనగా.. నిజమేనని పంచమి చెబుతుంది. మీ పెళ్లి అయిపోతే నేను ప్రశాంతంగా వెళ్లగలను అంటూ మోక్ష వివరిస్తాడు. నువ్వు పెళ్లి ఆపితేనే నా ప్రేమ గెలుస్తుందని.. ప్రేమే గెలవాలని కోరుకుంటున్నట్లు చెబుతాడు.

ఇక ఆ తర్వాత ఫణీంద్ర నాగలోకం వెళ్లి నాగదేవతను కలుస్తాడు. ఈక్రమంలోనే పుష్కర పూజ త్వరలోనే చేయాలని లేకపోతో నాగలోకం అంధకారంలో మునిగిపోతుందని చెబుతుంది. రాణీ వంశస్తులే నాగమణికి పూజ చేయాలని.. లేకపోతే నాగమణి పూర్వ వైభవం కోల్పోయి శక్తులు కోల్పోతుందని అంటుంది. పంచమిని నాగలోకం తీసుకు రావాల్సిన సమయం దగ్గరపడిందని అంటుంది. కానీ చివర్లో యువరాణి.. ఈ పూజ గురించి కానీ, నాగలోకాని ఆమె అవసరం గురించి కానీ తెలియాల్సిన అవసరం లేదిని అంటుంది.
ఇక ఆ తర్వాత శబరి బాధ పడుతూ కూర్చుంటుంది. ఆక్రమంలోనే పంచమి, శబరి కూతురు వస్తారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని అడగ్గా.. చిత్ర, జ్వాలలు వస్తారు. అలాగే మోక్షతో పాటు కుటుంబ సభ్యులు అంతా సీన్ లోకి ఎంటర్ అవుతారు. ఎందుకు మీరు విడిపోతున్నారని అడగ్గా.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని.. అందుకే విడిపోవాలనుకుంటున్నామని చెబుతుంది. పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవచ్చని అది పెద్ద సమస్య కాదని.. అంతా అనగా.. లేదు మేము విడిపోవాలనే నిర్ణయించుకున్నామని చెబుతుంది.


Click it and Unblock the Notifications











