Guppedantha Manasu May 3rd: శైలేంద్ర చెంపపగులగొట్టిన ఫణీంద్ర.. బతికే ఉన్న రాజీవ్.. మను సేఫ్!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ఫణీంద్ర.. శైలేంద్ర చెంప పగులగొడతాడు. దేవయానిని కొట్టలేక ఇది నిన్ను కొట్టానని అంటాడు. ఆడవాళ్లపై చేయి చేసుకోలేనని, ఇంకోసారి అలా వాళ్ల దగగరకు వెళ్లి ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని చెబుతాడు. అమ్మా ధరణి వీళ్లిద్దరూ మాట్లాడుకోకుండా చూడమని చెప్పాను కదా అంటే చెప్పారు మామయ్యా కానీ అంటూ నసుగుతుంది. అయినా వీరిని మార్చడం నా వల్లే కాలేదు.. ఇంకా నీ వల్ల ఏం అవుతుందని అంటాడు. ఆ తర్వాత ఇదే మీకు చివరి వార్నింగ్ అని ఇంకోసారి వేరే వాళ్ల విషయాల్లో తలదూర్చితే ఊరుకునేది లేదని వెళ్లిపోతాడు.
ఇక ఆ తర్వాత రాజీవ్ యే స్వయంగా టీ అమ్మేవాడిలా మారి జైల్లోకి వస్తాడు. మనుకు టీ ఇవ్వబోగా.. ఏయ్ నువ్వు అంటూ మను షాక్ అవుతాడు. ఆ తర్వాత రాజీవ్ వెళ్లిపోగానే మను అరుస్తాడు. పోలీస్ ఆఫీసర్ ను పిలిచి అతడే వచ్చాడని చెబుతాడు. వసు, మహేంద్రలు కూడా లోపలికి వస్తారు. రాజీవ్ ను నేను చూశానని రచ్చ చేయగా.. లేదని మాకు రోజూ టీ ఇచ్చే వాడే వచ్చాడని పోలీస్ ఆఫీసర్ అంటాడు. మహేంద్ర అతడిని పిలిపించమని చెప్పగా.. కానిస్టేబుల్ ను పంపుతాడు. మహేంద్ర కూడా వెళ్తాననగా.. వద్దని చెబుతాడు. ఇవన్నీ చేసే బదులు నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని అంటాడు. తను నేరమే చేయలేదంటే ఇలా మాట్లాడుతున్నారేంటని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత వసు మాట్లాడుతూ.. నేరం చేస్తే చెప్పండి, శిక్ష తగ్గుతుందని అనగా మహేంద్ర వసును ఆపేస్తాడు. ఆ తర్వాత నువ్వు నేరం చేయలేదని నేను నమ్ముతున్నాను.. నువ్వు ఎవరో ఆశ పెడితే, భయపెడితేనో నేరం చేసినట్లు అస్సలే ఒప్పుకోకు అంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ టీ ఇచ్చేవాడిని తీసుకు రాగా మను షాక్ అవుతాడు. అందరికీ టీ నువ్వే ఇచ్చావా అనగా అవునంటాడు. మను మాత్రం కాదని రాజీవ్ యే వచ్చాడని అంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ తిట్టి మరీ వెళ్లిపోతాడు. ఇక వసుధార మహేంద్రలు మాట్లాడుకుంటూ ఉండగా.. శైలేంద్రకు తప్ప ఇలాంటి పని చేయాల్సి అవసరం వేరే వాళ్లకు లేదని అంటాడు. శైలేంద్ర సాయం లేకుండా రాజీవ్ ఇలా చేసే ఛాన్స్ లేదని వసు అంటుంది.
రాజీవ్ చనిపోయాడంటే నేను నమ్మను అని, నాకు కనిపించిన రాజీవ్, మను వద్దకు వెళ్లినట్లు కూడా అనిపిస్తుందని అంటుంది. బతికుండే ఇలా ప్లాన్ చేశారేమోనని అని, రాజీవ్ బావను పట్టుకుంటే సమస్యలు అన్నీ తీరిపోతాయని చెబుతుంది. ఆ తర్వాత రాజీవ్ కనిపిస్తాడు. మను రాజీవ్ ను పక్కగా కాల్చగా.. అతడు వెళ్లిపోగానే బుల్లెట్లు ఏరుకుంటాడు. దీని ద్వారా మనును కేసులో ఇరికించొచ్చు కదా అంటాడు. ఆ తర్వాత శైలేంద్రకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెబుతాడు. రెండు బుల్లెట్లు దిగాయంటూ చెప్పుకొస్తాడు. నేను చచ్చిపోతానంటూ తన ప్లాన్ గురించి వివరిస్తాడు. ఇలా శైలేంద్ర, రాజీవ్ లు మనును ఇరికించేందుకు ప్లాన్ చేస్తారు.
ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పమని, అలాగే బుల్లెట్లు, సీసీటీవీ ఫుటేజీ నీకు పంపిస్తున్నానని అంటాడు. అలా వీరిద్దరూ ప్లాన్ చేసి మనును కేసులో ఇరికిస్తారు. ఇక ఆ తర్వాత శైలేంద్ర, రాజీవ్ లు కలిసి కనిపిస్తారు. తాను వసు వద్దకు వెళ్లడం, జైల్లోకి వెళ్లి మనుకు కనిపించడం గురించి చెబుతాడు. లోకం దృష్టిలో నేను చనిపోయినా.. నా మరదలు వసు కోసం మాత్రం బతికే ఉన్నానంటూ వివరిస్తుంది. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











