Naga Panchami 15th February: పంచమిని ముద్దు పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్న మోక్ష.. కాపాడిన ఫణీంద్ర!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో పంచమిని ముద్దు పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు మోక్ష. భర్తను ఎలా కాపాడుకోవాలో తెలియక పంచమి తెగ టెన్షన్ పడిపోతుంది. తనను ముద్దు పెట్టుకోవడం వల్ల మోక్ష గొంతులోకి విషం వెళ్లిందని తెలుసుకుని దానికి పరిష్కారం ఆలోచిస్తుంది. తాను ఆ విషాన్ని మింగలేదు కాబట్టి మింగే వాళ్ల గురించి ఆలోచిస్తుంది.
ఈక్రమంలోనే పంచమికి.. యువరాజు ఫణీంద్ర గుర్తుకు వస్తాడు. వెంటనే అతడితో మాట్లాడి తన భర్త మోక్ష పరిస్థితి వివరిస్తుంది. కాపాడమని బతిమాలుకుంటుంది. అయితే వారిద్దరూ మాట్లాడుకోవడానికి చూసిన చిత్, జ్వాలలు కుటుంబ సభ్యులు అందరికీ విషయం చెప్పేస్తారు. వారందరినీ పిలుచుకుని పంచమి మీదకు గొడవకు వస్తారు. అయితే ఆలోపే పంచమి.. తన భర్తను కాపాడుకోవడానికి గదిలోకి వస్తుంది. ఫణీంద్ర కూడా పాముగా మారి గదిలోకి వచ్చేస్తాడు.

అలా గదిలోకి వచ్చిన యువరాజు ఫణీంద్ర.. మోక్ష శరీరంలోంచి విషాన్ని లాగేస్తాడు. అయితే అప్పటికే కుటుంబ సభ్యులు అంతా వచ్చి పంచమి గదిని కొట్టగా.. పంచమి తలుపులు తీస్తుంది. ఏంటని గట్టిగా అడుగుతుంది. నువ్వు ఇప్పటి వరకు నీ ప్రియుడితో మాట్లాడావు కదా అని వాళ్లు అనగా.. నోరు అదుపులో పెట్టుకుమని వార్నింగ్ ఇస్తుందా. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.
నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా.. మోక్ష కుటుంబ సభ్యులు అంతా మోఘ, మేఘనల పెళ్లి గురించి చర్చించుకుంటూ కనిపిస్తారు. పెళ్లి వద్దని శబరితో పాటు అంతా చెబుతారు. కానీ వైదేహి మాత్రం కచ్చితంగా ఈ పెళ్లి చేసి తీరుతానని.. పంచమి అడ్డుగా వస్తే ఆమెను చంపైనా సరే మోక్ష, మేఘనలను ఒక్కటి చేస్తానని అంటుంది. దీంతో జ్వాల కూడా ఈ విషయంపై స్పందించి.. అత్తయ్యా నాక్కూడా ఈ పెళ్లి ఇష్టం లేదని అనగానే అంతా షాకై చూస్తారు. రోజూ వారిద్దరికీ పెళ్లి చేయని ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావంటారు.
ఎవరకి నచ్చినా నచ్చకపోయినా.. మేఘనే ఈ ఇంటి కోడలు అంటూ వైదేహి తన మనసులోని మాటను మరింత గట్టిగా చెబుతుంది. ఇదంతా విన్న మేఘన తనకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదని.. కానీ మీరంతా చేస్తామంటేనే తాను తప్పక ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొస్తుంది. పంచమి మోక్షలు సంతోషంగా ఉంటే తనకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదని వెల్లడిస్తుంది. ఇక ఆ తర్వాత మోక్ష మల్లెపూలు తీసుకు వచ్చి పంచమితో ప్రేమగా మాట్లాడతాడు.

అప్పుడే ఆమె తలస్నానం చేసి వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటుంది. ముస్తాబయ్యేందుకు అద్దం ముందుకు వెళ్తుంది. ఆమె అందాలను చూసిన మోక్ష మోహంతో ఆమె వెనకాలే పరిగెడతాడు. అలా చాలా సేపు ఆమె వెనకాలే తిరుగుతూ... పంచమి లిప్ టు లిప్ కిస్ ఇస్తాడు. ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా అలాగే చేస్తాడు. చివరకు పంచమి తోసి.. ఎంత తప్పు జరిగిపోయింది మోక్ష బాబు అంటూ అరవగా.. ఆయన మూతి నుంచి మెడ వరకు అంతా విషం ఎక్కి నీలం రంగులోకి మారుతుంది. ఇలా ప్రాణాపాయంలో పడతాడు మోక్ష.


Click it and Unblock the Notifications











