Naga Panchami 5th February: మేఘనను కాటేసిన ఫణీంద్ర.. మోక్ష పెళ్లి కంటే ముందు మరో ట్విస్ట్!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఇప్పటికే మోక్షను పెళ్లి చేసుకోవాలని మేఘన అదిరిపోయే ప్లాన్ వేయగా.. ఫణీంద్ర, పంచమిలను మరోసారి మాయ చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా అబద్ధాలు చెబుతూ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా మేఘన ఫుల్ గా ఏడుస్తూ.. కరాళీ తన కిడ్నాప్ చేసిందని.. తన తల్లిదండ్రులను కళ్లముందే రాళ్లుగా మార్చేసిందని చెప్పుకొచ్చింది. మేఘన మాటలు నమ్మని ఫణేంద్ర అంతా అబద్ధమని అంటాడు. కావాలనే మేఘన మనల్ని మోసం చేస్తుందని చెబుతాడు.
కరాళీ నిజంగానే తన మనుషులును రాయిగా మార్చేస్తుందని... నాగేశ్వరిని కూడా రాయిగా మార్చేసిందని పంచమి వివరిస్తుంది. దీంతో మేఘన.. పంచమి మనల్ని నమ్మేసిందని అనుకుంటుంది. రాళ్లుగా ఎక్కడ మార్చిందని అనగా.. అడవి మధ్యలో అని అక్కడ కాళికామాత విగ్రహం కూడా ఉందని చెబుతుంది. మరి నువ్వు మా మధ్యకు ఎలా వచ్చావని పంచమి అడగ్గా... తాను చెప్పినట్లు చేయకపోతే తన తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించినట్లు వివరిస్తుంది. అలాగే మోక్షను పాము కాటేసినప్పుడు కూడా తానే ఓ మొక్క తీసుకు వచ్చిన ఆ ఆకుల పసరు తీసుకొచ్చి మోక్షను బతికించానని వివరిస్తుంది.

ప్రస్తుతం కరాళీ ఎక్కడ ఉందని.. పంచమి అడగ్గా.. ఇప్పటి వరకు ఆశ్రమంలోనే ఉందని.. ఇప్పుడ ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని అంటుంది. అలాగే మోక్షను పెళ్లి చేసుకుని అతడిని తన వద్దకు తీసుకురావాలని చెప్పినట్లు వివరిస్తుంది. అయితే నువ్వు నాగ కన్యవు కానంటావు అంటూ ఫణీంద్ర అనగా.. అలాంటి వాళ్లు ఉంటారని కూడా నాకు తెలియదని మేఘన చెబుతుంది. అయితే ఓ చిన్న పరీక్ష పెడతానంటాడు. నిన్ను కాటేస్తానను.. నాగకన్యవి అయితే నీకు విషం ఎక్కదు అని అంటాడు. వెంటనే పంచమి వద్దు ఫణీంద్ర... నాగకన్య కాకపోతే ప్రాణాలు పోతాయని అంటుంది.
ఓ చోట కాటేసి విషం ఎక్కుతున్నట్లు అనిపిస్తే.. వెంటనే ఆ విషాన్ని వెనక్కి లాగేస్తానని ఫణీంద్ర అంటాడు. మనసులో ఈ పరీక్ష పెడితే నన్ను నమ్ముతారు కాబట్టి ఏం ఫర్వాలేదని కరాళీ ఓకే చెబుతుంది. ఇలా వెంటనే ఫణీంద్ర మేఘన చేయిపై పాముగా మారి కాటేస్తాడు. ఈక్రమంలోనే మేఘన చేయి అంతా నీలంగా మారడం గమనిస్తారు. ఆమెకు విషం ఎక్కుతున్నట్లు తెలుసుకుని దాన్ని ఫణీంద్ర పీల్చేస్తాడు. ఇలా తాను నాగకన్య కాదని మేఘన నిరూపించుకున్న తర్వాత పంచమి తన భర్తను పెళ్లి చేసుకోమంటూ వేడుకుంటుంది.

నువ్వు అయితేనే మోక్షను బాగా అర్థం చేసుకుంటావు, పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అంటూ చెప్పుకొస్తుంది. ఇక ఆ తర్వాత మోక్షను చూపిస్తారు. ఆయన మేఘనతో మాట్లాడుతూ.. పంచమి ఎంత చెప్పినా వినడం లేదు, ఇక తాను వచ్చి నా పెళ్లి ఆపుతుందన్న నమ్మకం కూడా రోజురోజుకూ తగ్గిపోతుందని వివరిస్తాడు. వెంటనే వెళ్లి నువ్వు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు అని అనగా.. ఇలా నిశ్చితార్థం ఆగిపోతుందే తప్పు పెళ్లి ఆగదు కదా అని మేఘన అంటుంది. నాతో కాకపోయినా మరొకరితో నీ పెళ్లి జరిపిస్తారు అని అంటుంది. అంటే నీక్కూడా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నా అంటాడు.
అలా కాదు మోక్ష.. పెళ్లి వరకు ఓకే చెప్పి అక్కడ వరకు వచ్చాకా.. అంటే పెళ్లి పీటల మీద డైరెక్టుగా పెళ్లి వద్దని చెబుతాను అంటుంది. ఇలా చేస్తే నాకు మళ్లీ పెళ్లి కాదని అనుకోకు.. నేను పంచమి కోసం ఎలాంటి త్యాగం చేయడానికి అయినా సిద్ధమే అంటుంది. దీంతో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











