twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు : మొగుడు షోయబ్‌తో సానియా స్టెప్పులు

    By Bojja Kumar
    |

    ముంబై : పాక్ క్రికెటర్ సోయబ్ మాలిక్ ను పెళ్లాడిన హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా టీవీ రియాల్టీ షోలో తన భర్తతో కలిసి స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులు కనిపించనుంది. స్టార్ ప్లస్ ఛానల్‌లో ప్రసారం కానున్న సెలబ్రిటీ డాన్స్ రియాల్టీ షో 'నాచ్ బలియే-5'లో ఈ ఇద్దరు స్పోర్ట్స్ స్టార్స్ జంటగా స్టెప్పులు వేస్తూ దర్శనం ఇవ్వబోతున్నారు.

    ఇప్పటికే ఈ కార్యక్రమం చిత్రీకరణ జరిగింది. ఈ శని, ఆది వారాల్లో(ఈ నెల 5, 6) రాత్రి 9 గంటలకు స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్న 11 జోడీలతో పాటు స్పెషల్ జోడీగా సానియా-షోయబ్‌ల జోడీ నర్తించి ప్రేక్షకులను అలరించనున్నారు.

    సానియా-షోయబ్‌ల రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంటుందో.....వారి ఇచ్చిన ఈ పెర్ఫార్మెన్స్‌తో ఇట్టే తెలిసి పోతుందని, వారి డాన్స్ స్టెప్పులు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్టాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షో మిస్ కావద్దని షో నిర్వాహకులు అంటున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ షోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు సోనియా-షోయబ్‌లకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కినట్లు తెలుస్తోంది.

     ఫోటోలు : మొగుడు షోయబ్‌తో సానియా స్టెప్పులు

    నాచ్ బలియే-5 కార్యక్రమం 11 జంటల పెర్ఫార్మెన్స్‌తో సాగుతోంది. సానియా-షోయబ్ జంట స్పెషల్ జోడీగా ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇవ్వబోతోంది.

    ఫోటోలు : మొగుడు షోయబ్‌తో సానియా స్టెప్పులు

    సానియా-షోయబ్ జోడీ ఇటీవలే నాచ్ బలియే-5 షూటింగ్ కు హాజరైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

    ఫోటోలు : మొగుడు షోయబ్‌తో సానియా స్టెప్పులు

    ఈ శని, ఆది వారాల్లో స్టార్ ప్లస్ ఛానల్లో రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

    ఫోటోలు : మొగుడు షోయబ్‌తో సానియా స్టెప్పులు

    పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్, ఇండియన్ టెన్నిస్ స్టార్ అయిన సానియా మీర్జాల వివాహం హైదరాబాద్‌లో తాజ్ కృష్ణ హోటల్ లో జరిగింది.

     ఫోటోలు : మొగుడు షోయబ్‌తో సానియా స్టెప్పులు

    పెళ్లి తర్వాత కూడా సానియా మీర్జా తన కెరీర్ కంటిన్యూ చేస్తోంది. సోయబ్ మాలిక్ ఇప్పటికీ పాక్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు.

    English summary
    Sania Mirza and Shoaib Malik will soon be seen shaking a leg for the first time on Indian television on STAR Plus Nach Baliye 5. This special Jodi that has been in the news for a while will be finally seen this Saturday performing together in the celebrity dance reality show Nach Baliye 5.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X