Guppedantha Manasu April 27th: మనుయే హత్య చేసినట్లు ఆధారాలు.. వసు సపోర్ట్ అతడికే.. ఏం జరగనుందంటే?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో రాజీవ్ హత్య కేసులో మనును అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత దేవయాని మాట్లాడుతూ.. అతడే ఈ హత్య చేసి దాన్నుంచి తప్పించుకోవడానికే ఇక్కడకు వచ్చుంటాడని అంటుంది. ఇందుకు వసుధార మాట్లాడుతూ.. అలా ఏం అయ్యుండదు.. తాను మనసు మార్చుకుని ఉండొచ్చు కదా అనగా.. మనం అలా అనుకోవాలనే ఆయన ఇలా వచ్చుంటాడని.. చేసిన తప్పులకు కచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారంటూ చెబుతుంది. దీనికి ఫణీంద్ర ఫైర్ అయి దేవయాని నోరు మూయిస్తాడు. అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లి అసలేం జరిగిందో కనుక్కో అంటాడు.
ఆ తర్వాత ఫణీంద్ర ఇంటికి వెళ్లి.. మను అరెస్టుకు కారణం ఏంటంటూ ఆలోచిస్తాడు. అతడు హత్య చేశాడంటే నమ్మాలనిపించట్లేదని చెబుతాడు. అలాగే శైలేంద్ర కూడా మను హత్య చేసుండడని నాకనిపిస్తుందని అంటాడు. కానీ దేవయాని మాత్రం అతడే చేసుంటాడని అంటుంది. మీరు బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరిస్తుంది. ఆవేశంలో, కోపంలోనే చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి ఫణీంద్ర మనం మనుషులం.. మృగాలం కాదు కదా అంటుంది. మనుకు, రాజీవ్ తో అసలు పరిచయమే లేదు... వారికి చంపుకునేంత శతృత్వం ఏముందని శైలేంద్ర అనగా ఏమో నాకు తెలియట్లేదని ఫణీంద్ర అంటాడు.

దత్తత జరగకపోవడం వల్ల మనకే మంచి జరిగిందని.. అయ్యాక అతడిని అరెస్ట్ చేస్తే ఇంటి పరువు పోయుండేదని అంటుంది. ప్లాన్ ప్రకారమే మను.. మహేంద్రను ఆడిస్తున్నాడని, అదృష్టవశాత్తు దాని నుంచి తప్పించుకున్నామని చెబుతుంది. మీ ఇద్దరి మంచితనం చూసే అంతా మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారని అంటుంది. ఆ తర్వాత ఫణీంద్ర ఇంక ఆపు.. నీతో మాట్లాడితే నా బుర్ర పాడయ్యేలా ఉందని అంటుంది. ఇక ఆ తర్వాత అనుపమ, మహేంద్ర, వసులు పోలీస్ స్టేషన్ కు వస్తారు. కారు దిగగానే అనుపమ.. మనును ఇలా ఫేస్ చేయలేనని అంటుంది. పోలీసులు వాడిని తీసుకెళ్తుంటేనే భరించలేకపోయానని.. స్టేషన్ లో వాడిని అస్సలే చూడలేనని చెబుతుంది. అందరి ముందు వాడు తలదించుకుని ఉండడాన్ని తట్టుకోలేనని అంటుంది.
దీంతో మహేంద్ర, వసులు లోపలికి వెళ్తారు. మను సెల్ లో ఉండగా.. మహేంద్ర పిలుస్తాడు. తల్లి వచ్చిందేమోనని ఆశగా చూస్తాడు. అసలు నువ్వు నిజంగానే రాజీవ్ ను కాల్చావా అని అడగా.. రాజీవ్ ను కలిసిన మాట వాస్తవమే అని, గొడవ పడిన మాట కూడా వాస్తవమేనని అంటాడు. కానీ తాను చంపలేదని చెబుతాడు. అతడే ఫోన్ చేసి రమ్మంటే వెళ్లానని అనగానే.. పోలీస్ వావ్ అంటూ వస్తాడు. అసలైన నేరస్థులు ఎవరు కూడా తాము తప్పు చేశామని చెప్పరని, మీలాంటి వాళ్ల వల్లే క్రై మ్ రేటు పెరిగిపోయిందని అంటాడు. దీనికి వసు ఫైర్ అవుతుంది. ఆధారాలు లేకుండా అలా మాట్లాడొద్దు అనగా.. ఆధారాలు దొరికాయి కదా అంటాడు. అలాగే సీసీ కెమెరా ఫుటేజీ కూడా మా వద్ద ఉందంటూ చెప్పుకొస్తాడు. ఆ వీడియోను వీళ్లకు కూడా చూపిస్తాడు.
ఇందులో షూట్ చేసినట్లు ఉంది కానీ.. రాజీవ్ ను కాల్చినట్లు లేదు కదా అని వసు అంటుంది. ఆ తర్వాత మను మాట్లాడుతూ.. నేను కాల్చిన మాట వాస్తవమే అయినా పక్కన కాల్చానని అంటాడు. ఆ తర్వాత మహేంద్ర మాట్లాడుతూ.. మను తప్పు చేసే మనిషి కాదని అంటాడు. కానీ అసలైన సాక్షి కూడా ఉన్నాడంటూ ఓ వ్యక్తిని పిలుస్తాడు. అతడిని చూడగానే అంతా షాక్ అవుతారు. ఎందుకంటే అతడు మను పీఏ. ఇతడు మీ అందరికీ తెలుసు కదా, అతడు మను వద్ద పీఏగా చేస్తున్నాడు కదా అంటూ.. ఇతడిని మేముమేనేజ్ చేయలేము కదా అంటూ పోలీస్ అంటాడు. దీనికి మను పీఏ మాట్లాడకుండా ఉండగా.. పోలీస్ మీరు భయపడొద్దు అంటాడు.
ఆ తర్వాత అతడు మను ఎక్కడికో వెళ్తుండగా.. తాను ఫాలో అయ్యానని.. అక్కడ మను, రాజీవ్ లు గొడవ పడడం చూశానని అంటాడు. మను కాల్చగానే తనకు భయం వేసి పారిపోయానని అంటాడు. ఈక్రమంలోనే మను తాన కాల్చినట్లు చూశాడే తప్ప ఆ బుల్లెట్లు రాజీవ్ కు తగిలినట్లు చూడలేదు కదా అంటాడు. దానికి పీఏ భయపడి.. నేను చూసిందే చెప్పానని అంటాడు. అతడు వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత మను కూడా వీడియోలో ఉన్నదే అతడు కూడా చూశాడని అంటుంది. రాజీవ్ ను బెదిరించాలనే ఉద్దేశంతోనే తాను మిస్ ఫైర్ చేశానని అంటాడు.
అలాగే రాజీవ్ తో మాట్లాడుతూ.. నా జీవితంలో ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నానని... వసును నువ్వు ఇబ్బంది పెట్టకూడదని అంటాడు. వసుధార అంటే రిషి సార్ భార్య అని ఆమె ఎప్పటికీ అతడికే సొంతం అని చెబుతాడు. ఆ తర్వాత రాజీవ్ అక్కడే ఉండగా.. మను వచ్చేస్తాడు. ఇదే విషయాన్ని పోలీసులకు వివరిస్తూ కనిపిస్తాడు. దీంతో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











