Bigg Boss Winner: పల్లవి ప్రశాంత్ చెప్పడం వల్లే అలా.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు
తెలుగులో ఎప్పుడు వచ్చినా ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని భారీ టీఆర్పీని కొల్లగొడుతోన్న షోనే బిగ్ బాస్. అంతలా దీన్ని ఇక్కడి ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ఫలితంగా నిర్వహకులు ప్రతి ఏడాది ఒక సీజన్‌ను జరుపుతూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో సీజన్‌ను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. కానీ, ఫినాలే రోజు జరిగిన గొడవలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. దీనిపై విన్నర్ పల్లవి ప్రశాంత్‌పైన కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరిని పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఆ వివరాలను మీరే చూడండి!
Recommended Video


విన్నర్‌గా పల్లవి ప్రశాంత్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కామన్ మ్యాన్ కోటాలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. అసాధారణ ఆటతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి.. విజేతగా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అతడి హోస్ట్ నాగార్జున విన్నర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా బిగ్ బాస్ చరిత్రలోనే విజేతగా నిలిచిన మొట్టమొదటి కామన్ మ్యాన్‌గా నిలిచాడు.

ఫ్యాన్స్ రచ్చ.. దాడి చేసి: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి అభిమానులు ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. ఇది పూర్తైన తర్వాత వాళ్లంతా బయట గొడవ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు అమర్ ఫ్యామిలీపై దాడి చేసిన విషయం తెలిసిందే.

ఆ కార్లతో పాటు బస్‌పైన: బిగ్ బాస్ ఏడో సీజన్ రిజల్ట్ వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే వాళ్లకు కనిపించిన ప్రతి వాహనంపైన కూడా దాడి చేశారు. ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న అశ్విని శ్రీ, గీతూ రాయల్ కార్లను కూడా ధ్వంసం చేసేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ బస్‌పై కూడా కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో బస్ అద్దాలు కూడా పగిపోయాయి.
ప్రశాంత్‌పై కేసు నమోదు: అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ అభిమానులే ఈ దాడులకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ పోలీసులు అతడితో పాటు కొందరు అభిమానులపైన కూడా 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేస్ ఫైల్ చేశారు. అలాగే, మరికొన్ని వీడియోల ద్వారా విచారణ జరుపుతున్నారు.
ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు: బిగ్ బాస్ షో పూర్తైన తర్వాత జరిగిన న్యూసెన్స్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే దాడులు జరిగిన సమయంలో పల్లవి ప్రశాంత్ కార్లకు డ్రైవర్లుగా ఉన్న ఇద్దరిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ A4, A5గా ఉన్నట్లు తెలిసింది. ముందుగా ఈ ఇద్దరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

ప్రశాంత్ చెప్పడం వల్లే: ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు మీడియాకు మరింత సమాచారం వెల్లడించారు. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ పల్లవి ప్రశాంత్ ఆదేశాలతోనే వీరిద్దరూ రోడ్డు మీద కార్లను ఆపారని.. ఆ సమయంలోనే అతడి అభిమానులు రెచ్చిపోయారని వివరించారు. అంతేకాదు, ఈ ఘటనపై సీసీ పుటేజ్‌ను చూస్తున్నామని కూడా పోలీసులు మీడియాకు చెప్పారు.


Click it and Unblock the Notifications











