Bigg Boss Winner: పల్లవి ప్రశాంత్‌కు పోలీసులు షాక్.. గెలిచిన ఆనందం లేకుండా కేసు నమోదు
తెలుగు బుల్లితెరపైకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే సెన్సేషన్ హిట్ అయిన ఏకైక షోనే బిగ్ బాస్. అందుకే నిర్వహకులు ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఇలా మూడు నెలల క్రితమే ఏడో సీజన్‌ను తీసుకు వచ్చారు.
ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో మొదలైన ఇది.. గతంలో వాటికంటే భిన్నమైన కంటెంట్‌తో సాగింది. ఫలితంగా భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుని ఈ ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ విన్నర్‌పై పోలీసు కేసు నమోదు అయింది. అసలేం జరిగిందో మీరు కూడా చూడండి!

సీజన్ విన్నర్‌గా ప్రశాంత్: బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి ప్రసారం చేశారు. ఇందులో ఆరుగురు ఫైనలిస్టులను ఒక్కొక్కరుగా ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. చివరికి అమర్‌దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ మిగిలారు. వీరిలో ఆరంభం నుంచి చక్కని ఆటతీరును కనబరిచిన రైతు బిడ్డే ఈ సీజన్ విన్నర్ అని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు.
ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి అభిమానులు ఆదివారం సాయంత్రమే అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. ఇది పూర్తైన తర్వాత వాళ్లంతా బయట గొడవ చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలోనే ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. దీంతో వీళ్లంతా రెండు గ్రూపులుగా ఏర్పడి ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు.
అమర్ ఫ్యామిలీపై దాడి: ఫ్యాన్స్ గొడవ పడుతోన్న సమయంలోనే అమర్‌దీప్ చౌదరి తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్నాడు. అతడిని పల్లవి ప్రశాంత్ అభిమానులు అడ్డుకున్నారు. అంతేకాదు, వాళ్లపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే అమర్‌దీప్ చౌదరి ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. ఆ తర్వాత అందులో ఉన్న అతడిని బయటకు రావాలంటూ బండ బూతులు తిట్టేశారు.
వాళ్ల కార్లు.. బస్సు కూడా: అన్నపూర్ణ స్టూడియో ముందు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి అభిమానులు చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే వాళ్లకు కనిపించిన ప్రతి వాహనంపైన కూడా దాడి చేశారు. ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న అశ్విని శ్రీ, గీతూ రాయల్ కార్లను కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ బస్‌పై కూడా కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో బస్ అద్దాలు పగిలిపోయాయి.
పల్లవి ప్రశాంత్‌పై కేసు: అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ అభిమానులే ఈ దాడులకు పాల్పడ్డారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే గీతూ రాయల్, అశ్విని శ్రీ తమ కార్లపై దాడి చేసిన వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద కూడా పోలీసు కేసు నమోదు అయినట్లు తాజాగా తెలిసింది.
సుమోటోగా నమోదైంది: బిగ్ బాస్ షో తర్వాత వాహనాలతో పాటు మనుషులపై కూడా దాడులు జరగడంతో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసులు దీనిపై విచారణ జరిపినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వాళ్లు బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద సుమోటోగా (ఎవరూ ఫిర్యాదు చేయకుండానే స్వయంగా) కేసును నమోదు చేసినట్లు పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు.
వాళ్లపైనా.. ఆ సెక్షన్లతో: బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు తాజాగా సమాచారం వచ్చింది. అతడిపైనే కాదు.. దాడికి పాల్పడినట్లు గుర్తించిన కొందరు అభిమానులపైన కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











