బిగ్‌బాస్‌పై దృష్టిపెట్టిన పచ్చ చీర సుందరి.. ఎన్నికల వేళ ఈవీఎంలతో రచ్చ!
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారిన పోలింగ్ అధికారిపై దేశ్యవాప్తంగా చర్చ జరిగింది. ఓటింగ్ మిషన్లు చేత పట్టుకొని వెళ్తూ మీడియాకు చిక్కిన ఆఫీసర్ రీనా ద్వివేది ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఆమె గురించిన వార్తలు అన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. పసుపు పచ్చ చీరలో ఆమె చేసిన సందడి సినీ హీరోయిన్‌ను తలపించేలా చేసింది. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఈ మహిళ గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

క్రేజీగా డ్రస్సులు వేసుకోవడమంటే
తనకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ గురించి రీనా ద్వివేది స్పందించారు. నాకు చిన్నప్పటి నుంచి మంచి దుస్తులు ధరించడం ఇష్టం. నాకు నచ్చిన డ్రస్సులు వేసుకోవడం తప్పుకాదనుకొంటాను. విధి నిర్వహణలో భాగంగా నాకు లభించిన క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉన్నారు అని రీనా ద్వివేది అన్నారు.

నాకు వినోదరంగమంటే ఆసక్తి
ప్రభుత్వ అధికారిగా నాకు మంచి గుర్తింపు ఉంది. పీడబ్ల్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను. నాకు నా కుటుంబ సభ్యుల సహకారంతోనే నేను నా విధుల్లో రాణిస్తున్నాను. నాకు గుర్తింపు రావడంపై వారు కూడా హ్యాపీగా ఉన్నారు. నాకు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో పనిచేయాలని ఓ కోరిక ఉంది. ఆ వైపు నుంచి ఏమైనా ఆఫర్లు వస్తే నేను ఆ రంగం వైపు దృష్టిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని రీనా ద్వివేది తెలిపారు.

అవకాశం వస్తే బిగ్‌బాస్‌లోకి
నాకు టెలివిజన్ రియాలిటీ షోలలో బిగ్‌బాస్ అంటే ఇష్టం. ఒకవేళ బిగ్‌బాస్ రియాలిటి షోలో అవకాశం లభిస్తే.. అందులోకి వెళ్లడానికి నేను రెడీగా ఉన్నాను. బిగ్‌బాస్‌లో అవకాశం రావడం అంటే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఒకవేళ అలాంటి ఆఫర్లు వస్తే ప్రభుత్వం ఉద్యోగం చేస్తూనే.. వినోదరంగంలో రాణించడానికి కృషి చేస్తాను అని రీనా ద్వివేది పేర్కొన్నారు.

సెలబ్రిటీగా మారిన రీనా ద్వివేది
సోషల్ మీడియాలో తన ఫోటో వైరల్‌గా మారిన తర్వాత రీనా ద్వివేది లైఫ్ ఇప్పుడు సెలబ్రిటీ హోదాగా మారిపోయింది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రీనా గురించి మాట్లాడుకోవడం కనిపించింది. తొమ్మిదో క్లాస్ చదువుతున్న ఆమె కుమారుడు ఆదిత్ కూడా తన తల్లికి మంచి రెస్పాన్స్ రావడాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఇటీవల మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











